• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /మీ వద్ద రేషన్ కార్డు ఉందా? నిబంధనల్లో భారీ మార్పులు.. ఈ కొత్త సిస్టమ్ తెలుసుకోండి!

మీ వద్ద రేషన్ కార్డు ఉందా? నిబంధనల్లో భారీ మార్పులు.. ఈ కొత్త సిస్టమ్ తెలుసుకోండి!

మీకు రేషన్ కార్డు ఉందా? అయితే బిగ్ రేషన్ కార్డులో కొన్ని మార్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో రేషన్ తీసుకునే వారు ముందుగా తెలుసుకోలేకపోతే రేషన్ పొందడం కష్టమవుతుంది. సాధారణంగా రేషన్ తీసుకునే సమయంలో ఫింగర్ ప్రింట్ ఆధారంగా రేషన్ మంజూరు చేస్తారు. అయితే, ఇందులో కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఫేస్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) ఆధారంగా కూడా రేషన్ మంజూరు చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Oct 04, 2026, 08:09 AM IST|Updated: Oct 04, 2026, 08:18 AM IST
joinshare
మీ వద్ద రేషన్ కార్డు ఉందా? నిబంధనల్లో భారీ మార్పులు.. ఈ కొత్త సిస్టమ్ తెలుసుకోండి!
Image Credit: Ration Rule Changes:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
సింగరేణి కార్మికులకు బిగ్ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ. 1.10లక్షలు.. పూర్తి వివరాలివే..!!

సింగరేణి కార్మికులకు బిగ్ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ. 1.10లక్షలు.. పూర్తి వివరాలివే..!!

2

ఇప్పుడే బంగారం కొంటున్నారా?.. కాస్త ఆగండి.. ధన్‌తేరస్ నాటికి పసిడి రేట్లలో ఊహించని మార్పు..HSBC రిపోర్ట్..!!

3

Rachita Ram Video: ఆ పనిచేయలేదు కదా.!. ఫ్యాన్ బుగ్గలు గిల్లిన ఘటనపై బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నటి రచిత రామ్.. వీడియో వైరల్..

4

సింగీతం మృతిపై రేవంత్,బాలయ్య, పవన్, ఎన్టీఆర్ సహా పలువురి ప్రముఖుల సంతాపం..

5

Haryana: కూతురి కాళ్లపై పడి వేడుకుంటున్న తండ్రి.. గుండెల్ని పిండేస్తున్న వీడియో.. అసలు విషయం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ration Rule Changes: ప్రభుత్వం రేషన్ కార్డు ద్వారా బీపీఎల్ కుటుంబాలకు బియ్యం, పప్పులు ఇతర నిత్యావసర వస్తువులను అందిస్తుంది. ఇది వారి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. అంతేకాకుండా, రేషన్ కార్డు ద్వారా ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధి కూడా పొందుతారు. ప్రతి నెలా రేషన్ తీసుకునే సమయంలో ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ ద్వారానే రేషన్ మంజూరు చేస్తారు. కుటుంబంలో ఒకరు వెళ్లి తీసుకుంటే సరిపోతుంది. అయితే, ఈ ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఫేస్ వెరిఫికేషన్‌ను కూడా తప్పనిసరి చేయనున్నారు.

రేషన్ తీసుకునే సమయంలో ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ ఇబ్బందికరంగా మారుతోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఫేస్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేసింది. రేషన్ తీసుకునే క్రమంలో మీకు బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ సమస్యలు ఎదురైనప్పుడు, మీ ముఖం ఆధారంగా కూడా వెరిఫై చేసే అవకాశం ఉంటుంది.

ఈ కొత్త వ్యవస్థను 2026 అక్టోబర్ ఒకటో తేదీ నుండి ప్రారంభించారు. ప్రధానంగా లబ్ధిదారులకు రేషన్ సులభంగా అందాలనే ఉద్దేశంతో, ఫింగర్ ప్రింట్‌లో సాంకేతిక సమస్యలు ఎదురైనా ఫేస్ స్కానింగ్ ద్వారా ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది. ఈ సాంకేతిక మౌలిక సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం అప్‌డేట్ చేసింది.

గతంలో రేషన్ కార్డుపై పప్పులు, బియ్యం వంటివి తీసుకోవాలంటే ఫింగర్ ప్రింట్ తప్పనిసరిగా ఉండేది. ఇది ఈ-పోస్ (ePOS) మెషీన్‌ ద్వారా ఐడెంటిటీ వెరిఫికేషన్ చేస్తుంది. అయితే నెట్‌వర్క్ సమస్యలు, మెషిన్ మల్ ఫంక్షన్, ఫింగర్ ప్రింట్ క్వాలిటీ సరిగా లేకపోవడం వల్ల ఈ ప్రక్రియ తరచుగా ఫెయిలవుతుండేది. ఈ సమస్యల పరిష్కారార్థమే ఫేస్ అథెంటికేషన్ విధానాన్ని తీసుకువచ్చారు.

Read Also: పీఎం కిసాన్ రూ.2000 మీ ఖాతాలో పడలేదా? ఇలా ఫిర్యాదు చేస్తే వెంటనే డబ్బులు మీ అకౌంట్‌లోకి!

Read Also: పీఎం కిసాన్ లబ్దిదారులకు బిగ్ షాక్! ఆ తప్పు చేస్తే రూ. 2,000 
 

ఇది ఎలా పనిచేస్తుంది?
దీనిని బయోమెట్రిక్ వెరిఫికేషన్ అని చెప్పవచ్చు. ఈ-పోస్ మిషన్ మునుపటిలాగే ఉంటుంది. ఒకవేళ మీ ఫింగర్ ప్రింట్ సరిపోకపోతే, వెంటనే ఫేస్ అథెంటికేషన్ ఆప్షన్‌కు మారుతుంది. కెమెరా ద్వారా మీ ముఖాన్ని స్కాన్ చేసిన వెంటనే ప్రక్రియ పూర్తవుతుంది. మీ ఫేషియల్ డేటాను ఆధార్ డేటాబేస్‌లోని సమాచారంతో సరిపోల్చుతుంది. ఒక్కసారి వెరిఫికేషన్ విజయవంతమైతే, మీరు ప్రతి నెలా సులభంగా రేషన్ తీసుకోవచ్చు.

దీనివల్ల ఎవరికి లాభం?
సాధారణంగా వయసు రీత్యా సీనియర్ సిటిజన్ల ఫింగర్ ప్రింట్లు సరిగ్గా మ్యాచ్ కావు. అలాగే, కష్టపడే శ్రమ చేసే కార్మికుల స్కిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఫింగర్ ప్రింట్ పడటంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా వారు చాలా సులభంగా రేషన్ పొందవచ్చు.

Add Zee News as a Preferred Source
TAGS:
Govt Schemes