• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Rachita Ram Video: ఆ పనిచేయలేదు కదా.!. ఫ్యాన్ బుగ్గలు గిల్లిన ఘటనపై బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నటి రచిత రామ్.. వీడియో వైరల్..

Rachita Ram Video: ఆ పనిచేయలేదు కదా.!. ఫ్యాన్ బుగ్గలు గిల్లిన ఘటనపై బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నటి రచిత రామ్.. వీడియో వైరల్..

Rachita ram on fan pinched cheeks row: పుట్టిన రోజు వేడుకల్లో ఒక అభిమాని తన బుగ్గలను గిల్లడంపై నటి రచిత రామ్ తొలుత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. దీనిపై చాలా మంది సీరియస్ గా కామెంట్స్ చేశారు.

Written ByInamdar Paresh
Published: Oct 04, 2026, 09:21 AM IST|Updated: Oct 04, 2026, 09:30 AM IST
joinshare
Rachita Ram Video: ఆ పనిచేయలేదు కదా.!. ఫ్యాన్ బుగ్గలు గిల్లిన ఘటనపై బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నటి  రచిత రామ్.. వీడియో వైరల్..
Image Credit: Actressrachitaram(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
నవోదయ విద్యాసంస్థల్లో 9, 11వ తరగతుల ప్రవేశాలు.. అక్టోబర్ 15తో ముగియనున్న దరఖాస్తు గడువు.. పూర్తి వివరాలు ఇవే!

నవోదయ విద్యాసంస్థల్లో 9, 11వ తరగతుల ప్రవేశాలు.. అక్టోబర్ 15తో ముగియనున్న దరఖాస్తు గడువు.. పూర్తి వివరాలు ఇవే!

2

సింగరేణి కార్మికులకు బిగ్ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ. 1.10లక్షలు.. పూర్తి వివరాలివే..!!

3

Mahbubnagar: మహబూబ్‌నగర్‌లో షాకింగ్ ఘటన.. ఏడాది చిన్నారి గొంతులో ఇరుక్కున్న బిస్కెట్.. ఆ తర్వాత.!.

4

ఇప్పుడే బంగారం కొంటున్నారా?.. కాస్త ఆగండి.. ధన్‌తేరస్ నాటికి పసిడి రేట్లలో ఊహించని మార్పు..HSBC రిపోర్ట్..!!

5

Rachita Ram Video: ఆ పనిచేయలేదు కదా.!. ఫ్యాన్ బుగ్గలు గిల్లిన ఘటనపై బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నటి రచిత రామ్.. వీడియో వైరల్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Actress rachita ram responds in fan pinched her cheeks incident video: సెలబ్రీటీలు, రాజకీయ నేతలు అంటే చాలా మందికి అభిమానం ఉంటుంది. ముఖ్యంగా  ఫ్యాన్స్ కు అభిమానించేవారు జనాల మధ్యన కన్పిస్తే ఎలాగైన వారిని కలుసుకొవాలని చూస్తారు. వారితో సెల్ఫీ దిగేందుకు లేదా షేక్ హ్యాండ్ కోసం ప్రయత్నిస్తారు. ఇదంతా మనంచూస్తుంటాం. కానీ ఇదే అదనుగా భావించి కొంత మంది అభిమానం ముసుగులో కామాంధులు బరితెగించి ప్రవర్తిస్తారు.

 

బుగ్గలు గిల్లినా కోపం రాలేదు అభిమాని బుగ్గ గిల్లడంపై #RachithaRam క్లారిటీ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌తో ఫొటోలు దిగిన రచిత రచిత బుగ్గలు గిల్లిన ఫ్యాన్‌.. అభిమాని ప్రేమతో చిన్న పిల్లల బుగ్గలు పట్టుకున్నట్టు నాకనిపించింది. బ్యాడ్‌గా టచ్‌ చేయలేదు. నాకెందుకు కోపం వస్తుంది? ప్యూర్‌ లవ్‌తో అలా చేశారు. #HbdRachitha

— Tilak Chand (@TilakTalkies) October 3, 2026

 

 

 ముఖ్యంగా హీరోయిన్లపై చెయ్యిలు వేయడం, ప్రైవేటు పార్ట్ లను తాకడం, ముద్దులు పెట్టడం వంటివి చేస్తారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే అనేక మంది సెలబ్రీటీలు వివిధ ఈవెంట్ల కోసం పబ్లిక్ లో వచ్చినప్పుడు ఫెస్ చేశారు. కొంతమంది వీటిపై చూసి చూడనట్లు వదిలేస్తే, మరికొంత మంది అభిమానుల తీరుపై ఆగ్రహం సైతం బైటపెట్టిన ఘటనలు కొకొల్లలు. తాజాగా.. కన్నడ ఫెమస్ నటి రచిత రామ్ కు తన బర్త్ డే వేళ అనుకొని వింత అనుభవం ఎదురైంది. దీనిపై ఆమె తాజాగా.. క్లారిటీ ఇచ్చారు.

 

కన్నడ స్టార్ హీరోయిన్, 'డింపుల్ క్వీన్'గా పేరుగాంచిన రచితా రామ్‌ ఇటీవల తన పుట్టిన రోజువేడుకల్ని గ్రాండ్ గా జరుపుకున్నారు.  ప్రతి ఏటా మాదిరిగానే రచితా రామ్ తన పుట్టినరోజును అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. అక్టోబర్ 3న అర్ధరాత్రి నుంచే బెంగళూరులోని ఆర్ఆర్ నగర్‌లో అభిమానులు  భారీగా చేరుకున్నారు. ఆమెకు చాక్లెట్లు, కానుకలతో క్యూలు కట్టారు. రచిత రామ్ కు కానుకలు ఇచ్చి వారంతా సెల్ఫీ దిగారు. 

అయితే ఒక అభిమాని మాత్రం ఆమె బుగ్గలు నిమిరాడు. దీంతో నటి ఒక్కసారిగా షాక్ అయ్యింది. అక్కడున్న వారు సైతం ఈ పరిణామంతో కొంత సేపు అసౌకర్యానికిగురయ్యారు. ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అయ్యింది. దీనిపై నటి రచిత రామ్ క్లారిటీ ఇచ్చింది. సదరు అభిమాని తన బుగ్గలు గిల్లినా కోపం రాలేదని మాట్లాడారు.

అభిమాని కేవలం తన మీద ప్రేమతో చిన్న పిల్లల  బుగ్గలు పట్టుకున్నట్టు  నాకనిపించిందని చెప్పుకొచ్చారు. అతని టచ్ లో ఎక్కడ బ్యాడ్‌గా టచ్‌ ఫీల్ కల్గలేదన్నారు. అదే విధంగా తన  ఇతర ప్రైవేట్ పార్ట్ లు తాకడం లేదా అలా చూడటం కూడా చేయలేదని మాట్లాడారు. 

 అభిమాని చాలాప్యూర్‌,  ఎమోషనల్ లవ్‌తో అలా చేశాడని నటి రచిత రామ్ చెప్పుకొచ్చింది. నాకు అతని మీద కోపంలేదని కూడా నటి రచిత రామ్ క్లారిటీ ఇచ్చింది. దయచేసి లేని పోనీ రూమర్ లు వైరల్ చేయోద్దని కోరింది. ఈ వీడియో ప్రస్తుతం మరోసారి వైరల్గా మారింది.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Movie
Trending News