SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Revanth Reddy: గోవా నుంచి ఢిల్లీ ఎర్రకోట వరకు కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం: రేవంత్ రెడ్డి

Revanth Reddy Powerful Speech In Goa Public Meeting And Slams To Narendra Modi: దేశంలో మరోసారి కాంగ్రెస్‌ జెండా ఎగురుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని.. గోవా నుంచి ఢిల్లీ ఎర్రకోటపై మూడు రంగుల జెండా ఎగరాలని రేవంత్‌ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా గోవాలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 11, 2026, 10:01 PM IST | Updated: Oct 11, 2026, 10:02 PM IST
Image Credit: Revanth Reddy Goa Speech
Join

Congress Party: 'దేశాన్ని ఏకం చేసేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారు. రాహుల్ గాంధీ దేశ ప్రజలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తుంటే మోదీ విభజించడానికి ప్రయత్నిస్తున్నారు' అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 'గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది. గోవా నుంచి నేరుగా ఢిల్లీ ఎర్ర కోటపై మూడు రంగుల జెండా ఎగరడం ఖాయం' అని జోష్యం చెప్పారు. 2026 కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా.. 2027లో గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది' అని పేర్కొన్నారు.

గోవాలో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్‌ రెడ్డి కీలక ప్రసంగం చేశారు.  'జ్ఞానేష్ కుమార్ పేరుతో మోదీ పేదల ఓట్లను తొలగించాలని చూస్తున్నారు. గోవా ప్రజలు బీజేపీతో విసిగిపోయారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే గోవా ప్రజలు పరాయి వారిగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది' అని రేవంత్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 'ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నైస్, ఐస్ బీజేపీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా పనిచేస్తాయి. ఇప్పుడు వాటితో కూడా బీజేపీకి ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ పేరుతో ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. పేదలు, దళితులు, మైనారిటీలు, ఆదివాసీల ఓట్లు తొలగిస్తున్నారు' అని ఆరోపించారు.

గోవాలోని బీజేపీ ప్రభుత్వంపై రేవంత్‌ రెడ్డి విరుచుకుపడ్డారు. 'ఇక్కడి భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. గోవా సీఎం ప్రమోద్ సావంత్ కాదు. ప్రాపర్టీ సావంత్ అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. గోవా సీఎం.. గోవాను అభివృద్ధి చేసే పనిలో కాకుండా ఇక్కడి ఆస్తులను ఇతరులకు అప్పగించే పనిలో ఉన్నారు' అని ఆరోపించారు. 'గోవా యువతను డ్రగ్స్ కు బానిసలుగా మార్చారు. బీజేపీ పాలనలో గోవా డ్రగ్స్ సోర్స్‌గా మారిపోయింది. నషా ముక్త్ భారత్ అని మాట్లాడుతున్న మోదీ, అమిత్‌ షా ఇక్కడ ఎందుకు అమలు చేయడం లేదు?' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

'గోవాను డ్రగ్స్ పెడ్లర్స్ అడ్డాగా మార్చారు. ఇది గోవాకు కీర్తిని తెచ్చి పెడుతుందా? గోవా పేరును చెడగొడుతుందా?' అని రేవంత్‌ రెడ్డి నిలదీశారు. గోవా యువత డ్రగ్స్‌కు బానిసలు కావద్దు గోవా పేరు చెడిపోవద్దన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. 'గోవాలో కాంగ్రెస్ పార్టీకి కాకుండా ఏ పార్టీకి ఓటు వేసినా అది బీజేపీకే చేరుతుంది. డ్రగ్స్ లార్డ్స్, ల్యాండ్ మాఫియా గోవాలో రాజ్యమేలాలా? మీరే ఆలోచన చేయండి' అని ప్రజలకు రేవంత్‌ రెడ్డి సూచించారు. 'ఇది రావణ్, రాముడికి మధ్య జరుగుతున్న పోరాటం. రావణ్ అంటే బీజేపీ, రాముడు అంటే కాంగ్రెస్ పార్టీ. రావణ్‌ను ఓడించాలంటే మీరంతా రాముడికి మద్దతుగా నిలబడాలి. రెండుసార్లు గోవా ప్రజలు మోసపోయారు. మూడోసారి బీజేపీని నమ్మి మోసపోవద్దు' అని విజ్ఞప్తి చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES