• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /Ind vs WI Highlights: చుక్కలు చూపించిన విండీస్.. 3వ టీ20లో పోరాడి గెలిచిన టీమిండియా

Ind vs WI Highlights: చుక్కలు చూపించిన విండీస్.. 3వ టీ20లో పోరాడి గెలిచిన టీమిండియా

India Beat West Indies By 14 Runs In 3rd T20I At Indore: బౌలింగ్‌లో.. బ్యాటింగ్‌లో అదరగొట్టిన వెస్టిండీస్‌ భారత జట్టుకు చుక్కలు చూపించింది. నామమాత్రపు స్కోర్‌ను కాపాడుకునేందుకు భారత్‌ తీవ్రంగా శ్రమించింది. ఫలితంగా మూడో టీ20లో విండీస్‌పై పోరాడి భారత జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 11, 2026, 11:44 PM IST|Updated: Oct 11, 2026, 11:49 PM IST
joinshare
Ind vs WI Highlights: చుక్కలు చూపించిన విండీస్.. 3వ టీ20లో పోరాడి గెలిచిన టీమిండియా
Image Credit: Source: BCCI Twitter

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Kavitha: కవిత సంచలన ప్రకటన.. 'రేవంత్ రెడ్డి ముక్కు పిండి రూ.వెయ్యి కోట్లు తెస్తా'

Kavitha: కవిత సంచలన ప్రకటన.. 'రేవంత్ రెడ్డి ముక్కు పిండి రూ.వెయ్యి కోట్లు తెస్తా'

2

Ind vs WI Highlights: చుక్కలు చూపించిన విండీస్.. 3వ టీ20లో పోరాడి గెలిచిన టీమిండియా

3

Revanth Reddy: గోవా నుంచి ఢిల్లీ ఎర్రకోట వరకు కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం: రేవంత్ రెడ్డి

4

Sai pallavi: ప్రభాస్ సినిమా షూటింగ్లో సాయి పల్లవి..!

5

సముద్రంపై సరికొత్త అద్భుతం.. ఆకాశంలో 1500 డ్రోన్‌లతో వెల్‌కమ్! కార్డెలియా స్కై లగ్జరీ లైనర్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ind Beat WI By 14 Runs: రెండో టీ20 మ్యాచ్‌ను కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారత్‌ మూడో మాచ్‌లోనూ తడబడి చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు పోరాడి విజయం సాధించింది. విండీస్‌ బౌలింగ్‌ దెబ్బకు భారత బ్యాటర్లు నామమాత్రపు స్కోర్‌ సాధించగా.. ఇక ఛేదనలో విండీస్‌ బ్యాటర్లు భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. విజయం దిశగా విండీస్‌ ఆటగాళ్లు పోరాడుతుండగా.. ఒకానొక దశలో మ్యాచ్‌ చేజారిందనుకున్న దశలో భారత బౌలర్లు లక్ష్యాన్ని కాపాడారు. ఫలితంగా 14 పరుగుల తేడాతో విండీస్‌పై భారత్‌ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

ఇండోర్‌ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 223 పరుగులు చేసి ఆలౌటైంది. అభిషేక్‌ శర్మ అర్ధ శతకంతో మెరవగా.. ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ కొన్ని పరుగులు జోడించడంతో భారత్‌ గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది. 30 బంతుల్లో 69 పరుగులు చేసి అభిషేక్‌ భారీ ఇన్నింగ్స్‌ ఆడగా.. 6 ఫోర్లు, 5 సిక్సర్లు నమోదు చేశాడు. ఇషాన్‌ కిషన్‌ 18 బంతుల్లో 37 పరుగులతో రాణించగా.. తిలక్‌ వర్మ 28 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. స్టార్‌ ఓపెనర్‌ సంజూ శామ్‌సన్‌ 3 పరుగులకే ఔటవగా.. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. నితీశ్‌ కుమార్‌ రెడ్డి (21), అక్షర్‌ పటేల్‌ (20), నమన్‌ ధిర్‌ (10) కొంత స్కోర్‌ను పెంచారు. అయితే ఆసక్తికరంగా బౌలర్లు ప్రిన్స్‌ యాదవ్‌ (13), అర్ష్‌దీప్‌ సింగ్‌ (11) బ్యాట్‌తో సత్తా చాటి ప్రత్యర్థి లక్ష్యాన్ని పెంచారు. భారత స్కోర్‌కు కళ్లెం వేయడమే కాకుండా వికెట్లతో విండీస్‌ బౌలర్లు విజృంభించారు. ఫలితంగా ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్‌ చాపచుట్టేశారు. రోస్టన్‌ చేజ్‌, షమర్‌ జోసెఫ్‌, షమర్‌ స్ప్రింగర్‌ రెండేసి వికెట్లు తీయగా.. గుడకేశ్‌ మోతీ, కీమో పాల్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌ ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు నమోదు చేసింది. మ్యాచ్‌ ఎలాగైనా గెలవాలనే కసితో విండీస్‌ బ్యాటర్లు ఆడినా మరింత పోరాటం చేయాల్సి ఉంది. ఒక దశలో విజయం దిశగా దూసుకెళ్లి అనంతరం పరుగులు రాబట్టడంలో తడబడడంతో విండీస్‌ ఓటమి వైపు నిలబడింది. గత మ్యాచ్‌ సెంచరీవీరుడు శాయ్‌ హోప్‌ 5 పరుగులకే వెనుదిరగగా.. కమిల్‌ పూరన్‌, షిమ్రాన్‌ హెట్‌మెయిర్‌ సత్తా చాటేందుకు ప్రయత్నించి (42), (43) పరుగుల వద్ద ఇద్దరూ ఔటయ్యారు. రౌమన్‌ పావెల్‌ (5) నిరాశపర్చగా.. షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ 32 పరుగులతో రాణించగా.. క్వింటిన్‌ శామ్‌ప్సన్‌ (21), కిమో పాల్‌ (10) విజయం కోసం కొన్ని పరుగులు జోడించారు. షమర్‌ స్ప్రింగర్‌ అద్భుతంగా ఆడి 35 పరుగులు చేసి జట్టు ఓటమి అంతరాన్ని తగ్గించాడు. బ్యాటింగ్‌లో అదరగొట్టిన అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లోనూ రాణించి మూడు వికెట్లు తీశాడు. నమన్‌ ధిర్‌ 2 వికెట్లు, అక్షర్‌ పటేల్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఒక్కో వికెట్‌ తీసి భారత్‌కు విజయాన్ని ఖరారు చేశారు.

విండీస్‌ గొప్పగా పోరాడినా ఓటమి వైపు నిలబడగా.. భారత్‌ రెండో విజయంతో 2-1 తేడాతో విండీస్‌పై ఆధిక్యత సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో నిర్ణయాత్మకమైన నాలుగో టీ20 మ్యాచ్‌ హైదరాబాద్‌లో జరగనుంది. సిరీస్‌ సాధించాలనే కసితో ఉన్న ఇరు జట్లు ఉప్పల్‌ స్టేడియంలో హోరాహోరీగా తలపడనున్నాయి. బ్యాటింగ్‌కు అనుకూలించే హైదరాబాద్‌లో మరి పరుగుల వరద పారుతుందా? ఇరు జట్లలో ఏదో ఒక జట్టు రికార్డు విజయం సాధిస్తుందా? అనేది ఉత్కంఠ నెలకొంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Team India
Cricket
Sports News
Telugu News
Trending News