Rule Changes From Dec 1: డిసెంబర్ నెల రానుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అలెర్ట్‌గా ఉండాలి. 1వ తేదీనా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతినెలా మారుస్తుంటారు. 2026 డిసెంబర్ 1వ తేదీ నుంచి కొన్ని రూల్స్‌లో మార్పులు రానున్నాయి. ఈ మార్పులు నేరగా మనపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మన పెట్టుబడులు, వడ్డీరేటు, క్రెడిట్ కార్డుల్లో మార్పులు రానున్నాయి.
ఆయిల్, గ్యాస్ ధరలు..
డిసెంబర్ మొదటి రోజు మాత్రమే కాదు.. ప్రతినెలా 1వ తేదీ ఆయిల్ కంపెనీలు ఎల్‌పీజీ డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ ధరలను సవరిస్తూ ఉంటాయి. దీంతోపాటు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ATF) సవరణ ధరలను కూడా ఇదే రోజు ప్రకటిస్తారు.
ఎస్‌బీఐ లావాదేవీలు..
డిసెంబర్ 1వ తేదీ నుంచి ఎస్‌బీఐ కార్డుదారులకు కూడా అలెర్ట్. 1 ఫీజు అదనంతోపాటు ట్యాక్స్ కూడా పెద్ద లావాదేవీలపై విధిస్తున్నారు. ప్రధానంగా రవాణా సంబంధించిన చెల్లింపులు రూ.30000 దాటితే ఈ పన్ను విధించనున్నారు.
పింఛనుదారులకు అలెర్ట్..
డిసెంబర్ 1వ తేదీ నుంచి పింఛనుదారులకు కూడా అలెర్ట్. ఈ తేదీకి ముందే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే పింఛను లభిస్తుంది.
ఆధార్ అప్‌డేట్ ఫీజు..
యూఐడీఏఐ ఈమెయిల్ అడ్రస్ అప్‌డేట్ వయా ఆధార్ మొబైల్ యాప్ ద్వారా చేస్తే రూ.75 నామమాత్రపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ వెసులుబాటు డిసెంబర్ 31వ తేదీ వరకు వర్తిస్తుంది. కానీ, కేవలం ఈ యాప్‌లో మాత్రమే అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
ఆర్‌బీఐ మీటింగ్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనీటరీ పాలసీ కమిటీ (MPC) మీటింగ్ డిసెంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు జరగనుంది. ఈ సమావేశంలో రెపో రేటుపై రివ్యూ ఉంటుంది. ఇక గత అక్టోబర్ నెలలో ఆర్‌బీఐ 25 బేసిస్ పాయింట్స్ నుంచి 5.50 శాతం పెంచిన సంగతి తెలిసిందే. అంటే 0.25 శాతం పాయింట్స్ పెరుగుదల.