Rahu Ketu Transit 2026 Effect: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ సంచారాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని గ్రహాలు రాశి సంచారం చేస్తే కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. నవంబర్ 25 ఛాయా గ్రహాలైన రాహువు, కేతువు తమ రాశి సంచారం చేశాయి. రాహువు కుంభ రాశి నుంచి మకర రాశిలోకి.. కేతువు సింహ రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించాయి. ఈ రెండు గ్రహాల ప్రభావం వల్ల ఒకటిన్నర సంవత్సరాల పాటు అన్ని రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలికంగా మానవ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం కాబోతున్నాయి. అంతేకాకుండా కొన్ని రాశుల వారి ప్రేమ జీవితం, వైవాహిక బంధాల్లోనూ అద్భుతమైన ప్రయోజనాలు కలిగే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే అన్ని రంగాల్లో కూడా విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా అనేక రకాల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి బంపర్ లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మీన రాశి:
ఈ రెండు గ్రహాల సంచారం వల్ల మీన రాశి వారికి అద్భుతమైన ధన లాభాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపడి.. కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వచ్చే సూచన కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఉద్యోగులు చేసేవారికి బంపర్ లాభాలు కూడా సులభంగా కలుగుతాయి. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి, కొత్త ప్రణాళికలను అమలు చేయడానికి ఇది అత్యంత అనుకూలంగా ఉంటుంది..
మేష రాశి:
ఈ రాశి వారికి వృత్తిపరంగా ఊహించని ధన లాభాలు కలిగే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. గత కొంతకాలంగా మీరు పడుతున్న కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలం కూడా సులభంగా లభిస్తుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో కొత్త బాధ్యతలు, హోదా పెరగడం లేదా ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తున్న వారికి మంచి ప్యాకేజీతో కూడిన కొత్త అవకాశాలు తప్పకుండా లభిస్తాయి.
వృశ్చిక రాశి:
ఈ రాశి వారి జీవితంలో రెండు గ్రహాలు అద్భుతమైన మార్పులు తీసుకు రాబోతున్నాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడంతో పాటు భవిష్యత్తు లక్ష్యాలపై స్పష్టత కూడా చాలా వరకు వస్తుంది. ఉద్యోగం, వ్యాపారం లేదా కొత్త ప్రాజెక్టుల విషయంలో ఉన్న సందేహాలు తొలగిపోయే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. ముఖ్యంగా అనుకున్న పనుల్లో విజయాలు కూడా సులభంగా సాగుతాయి. ఆఫీసుల్లో ఉన్నతాధికారులను ఆకట్టుకుని.. కీలక బాధ్యతలు చేపట్టే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
వృషభ రాశి:
వృషభ రాశివారికి కూడా బంపర్ లాభాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సంచారం కొత్త అవకాశాలను అందించడమే కాకుండా కోరుకున్న కోరికలను కూడా సులభంగా నెరవేర్చుతుంది. అదృష్టం పూర్తిగా మీ వైపు ఉండటంతో.. గతంలో నిలిచిపోయిన పనులు కూడా సులభంగా ప్రారంభమవుతాయి. ఈ సమయంలో కష్టపడి పనులు చేయడం వల్ల అద్బుతమైన విజయాలు కూడా సాధిస్తారు. కుటుంబ సభ్యుల పూర్తి సపోర్ట్‌తో అద్భుతమైన విజయాలు కూడా సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి.
NOTE: