SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Russian Woman: ఇది కదా నిజమైన ప్రేమ... బీహర్ ప్రియుడి కోసం రష్యా నుంచి యువతి.. గుడిసెలోనే ఉంటానని రచ్చ..

Russian woman lover story: ప్రియుడ్ని వదిలి ఉండలేక రష్యాకు చెందిన యువతి 6 నెలల తర్వాత ఫ్యామిలీతో కలిసి భారత్‌కు వచ్చి బీహర్ లో ఉంటున్న రాహుల్ ను వెతికి మరీ పట్టుకుంది. అతనితోనే కలసి ఉంటానని మొండి పట్టు పట్టింది.

Written By Inamdar Paresh
Published: Oct 14, 2026, 09:06 AM IST | Updated: Oct 14, 2026, 09:13 AM IST
Image Credit: Russian girl bihar man love story
Join

Russian woman Julie and bihar Bhagalpur resident Rahul yadav love story: సమాజంలో  చాలా మంది ప్రేమ వివాహలకు మొగ్గుచూపిస్తున్నారు. కొంత మంది యువతీ, యువకులు తమకు నచ్చిన వారు దొరికితే చాలని భావిస్తున్నారు. కొన్ని రోజుల పాటు వారితో కలిసి లివింగ్ రిలేషన్లో కూడా ఉంటున్నారు. ఒకవేళ తమ అభిప్రాయాల్లో బేధాలు, ఏదైన సమస్యలు వస్తే వెంటనే బ్రేకప్ చెప్పుకుంటారు. ఇంకా మరో రకం యువతీ, యువకులు చాలా ప్రాక్టికల్ గా ఉంటున్నారు. 

 

 

పైసామే పరమాత్మ అన్నట్లు.. వీరు చేసుకునే వారి ప్యాకేజీ, బ్యాంక్ బ్యాలెన్స్, అందంగా ఉన్నాడా..?.. ప్రాపర్టీ మొదలైనవి తెసుకుని మరీ ప్రేమించి, పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.  కానీ నిజమైన ప్రేమ అనేది ఎప్పుడు, ఎవరిమీద పుడుతుందో ఎవరు చెప్పలేదు. అంతే కాకుండా..పేద, ధనిక, రంగు బేధాలు మొదలైనవి వంటివి అస్సలు దీనిలో ఉండవంటారు. కేవలం తమమనస్సుకు నచ్చితే చాలని కొంత మంది భావిస్తారు.

అలాంటి వారు ఒక్కసారి జీవితంలో వస్తేవారిని అస్సలు వదులు కోరు.  ఎలాంటి పనులు చేయడానికైన వెనుకాడరు. అచ్చం ఇలాంటి  నిజాయితీ గల ప్రేమ రష్యాలో పుట్టింది. అది కాస్త ఇప్పుడు బీహర్ లో వచ్చి వాలింది. ఈ ప్రేమ కథ ఏంటో ఇప్పుడుచూద్దాం.

బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లా రాజాపూర్ గ్రామానికి చెందిన రాహుల్ యాదవ్ రష్యాదేశంకు ఉపాధి కోసం వెళ్లాడు. అక్కడ ఒక ప్రైవేటు కంపెనీలో పని చేసేవాడు. అదే సమయంలో అక్కడుండే సహోద్యోగి జూలితో పరిచయంఏర్పడింది. అది కాస్త క్రమ క్రమంగా ఇద్దరి మధ్యగాఢమైన ప్రేమగామారింది. ఇద్దరు ఒకరిని వదిలి మరోకరు ఉండలేనంత ప్రేమగా మారింది.
కొంతకాలం తర్వాత రాహుల్ రష్యా నుంచి తిరిగి ఇండియాకు వచ్చేశాడు.

 ఇద్దరి మధ్య ఏదో తెలియని బాధ, ఒకరిని విడిచిమరోకరు ఉండలేదమని తరచుగా మాట్లాడుకునేవారు. ఇక యువతి జూలీ తన ప్రియుడిని వదిలి ఉండలేనని తన ఇంట్లో వారికి తమ ప్రేమను చెప్పింది. వారితో పాటు కలిసి భారత్ కు వచ్చింది. కనీసం తన ప్రియుడికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండాననే బీహర్కు వచ్చింది. 

ఆ తర్వాత నేరుగా రాహుల్ ఇంటికి జూలి తన కుటుంబంతో వెళ్లి సర్ ప్రైజ్ ఇచ్చింది. అక్కడ రాహుల్ చిన్న గుడిసెలో ఉంటున్నాడు. ప్రియుడిని చూసిన ఆనందంలో జూలి ఎమోషనల్ అయ్యింది. రాహుల్ ను వదిలి ఉండలేనని, చిన్న గుడిసెలో అయిన ఇక్కడే ఉంటానని కుటుంబ సభ్యులకు తెల్చి చెప్పింది. 

దీంతో ఇరు కుటుంబాలు వీరి ఎల్లలుదాటిన నిజమైన ప్రేమను అంగీకరించి వీరికి నవంబర్‌లో పెళ్లి చేయాలని  ఇరు కుటుంబ పెద్దలు నిశ్చయించారు. ఈ ఘటన కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. వీరి నిజమైన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES