SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Sabarimala 54 Special Trains: అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్‌న్యూస్.. శబరిమలకు 54 స్పెషల్ రైళ్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే!

Sabarimala 54 Special Trains 2027: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 54 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్, చర్లపల్లి, నాందేడ్ నుంచి కొల్లంకు ఈ సర్వీసులు నడవనున్నాయి. నవంబర్ 2026 నుంచి జనవరి 2027 వరకు అందుబాటులో ఉండే రైళ్ల నంబర్లు, ప్రయాణ తేదీలు, బయలుదేరే సమయాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Harish Darla
Published: Nov 13, 2026, 06:34 AM IST | Updated: Nov 13, 2026, 06:38 AM IST
Join

 Sabarimala 54 Special Trains 2027: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తెలుగు రాష్ట్రాల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (సికింద్రాబాద్ జోన్) కీలక సమాచారం అందించింది. శబరిమల యాత్ర సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నవంబర్ 2026 నుంచి జనవరి 2027 వరకు కొల్లం మార్గంలో మొత్తం 54 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్, చర్లపల్లి, నాందేడ్ వంటి ప్రాంతాల నుంచి ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి.

ఈ ప్రత్యేక రైళ్లలో హైదరాబాద్ నుంచి కొల్లంకు 07193, తిరుగు ప్రయాణానికి 07194 నంబర్లతో నాలుగు జతల సర్వీసులు నడుస్తాయి. డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో హైదరాబాద్ నుంచి రైలు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో కొల్లం నుంచి బయలుదేరుతుంది.

అలాగే చర్లపల్లి నుంచి కొల్లంకు 07180/07181 రైలు జత ఆరు సార్లు రాకపోకలు సాగిస్తుంది. మరో రైలు జత 07195/07196 ద్వారా నవంబర్ చివరి వారం నుంచి జనవరి వరకు తొమ్మిది సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లలో 1AC, 2AC, 3AC తరగతులు మాత్రమే ఉంటాయని రైల్వే షెడ్యూల్‌లో పేర్కొన్నారు.

ఇక 07197/07198 రైలు జత ద్వారా డిసెంబర్‌లో నాలుగు రాకపోకల సర్వీసులు, 07199/07200 రైలు జత ద్వారా డిసెంబర్ చివరి నుంచి జనవరి వరకు మూడు రాకపోకల సర్వీసులు నడుస్తాయి. అదనంగా నాందేడ్ నుంచి కొల్లంకు 07189, తిరుగు ప్రయాణానికి 07190 నంబర్లతో ఒక్కో సర్వీసును ఏర్పాటు చేశారు.

ఈ రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కేరళలోని పలు ముఖ్యమైన స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయి. సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, నెల్లూరు, కాట్పాడి, సేలం, పాలక్కాడ్, ఎర్నాకులం వంటి స్టేషన్లలో ప్రయాణికులకు రైలు ఎక్కే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి రైలుకు అన్ని స్టేషన్లలో హాల్టింగ్ ఉండదు.

అయ్యప్ప భక్తులు ప్రయాణానికి ముందే తమ రైలు నంబర్, తేదీ, సమయం, హాల్టింగ్ స్టేషన్లు, టికెట్ లభ్యతను అధికారిక రైల్వే వెబ్‌సైట్ లేదా NTES యాప్‌లో తనిఖీ చేసుకోవాలి. ప్రత్యేక రైళ్ల షెడ్యూల్‌లో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణానికి ముందు తాజా సమాచారం తెలుసుకోవడం మంచిది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

ZEENEWS TRENDING STORIES