• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /నేడు అల్ప పీడనం.. మరో తుపాను ముప్పు..

నేడు అల్ప పీడనం.. మరో తుపాను ముప్పు..

Heavy Rains in Andhra Pradesh: నేడు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వెంటాడుతుంది. అది తుపానుగా మారుతుందా లేదా అనేది చూడాలి. మొత్తంగా ఇప్పటికే ఏపీకి వరుసగా రెండు తుపానులు అర్నబ్,మురసు తుపానులు వెంటనే వచ్చాయి. తొందరగానే వెళ్లిపోయాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారి తుపానుగా రూపాంతరం చెందుతుందా లేదా అనేది చూడాలి.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 13, 2026, 08:13 AM IST|Updated: Nov 13, 2026, 08:16 AM IST
joinshare
నేడు అల్ప పీడనం.. మరో తుపాను ముప్పు..
Image Credit: AP News (ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
డిసెంబర్ 5 నుంచి ఈ 4 రాశులకు కుజుడి అదృష్టం.. 566 రోజుల పాటు డబ్బే డబ్బు!

డిసెంబర్ 5 నుంచి ఈ 4 రాశులకు కుజుడి అదృష్టం.. 566 రోజుల పాటు డబ్బే డబ్బు!

2

పవన్ కళ్యాణ్ విడాకులకు దారితీసిన పరిస్థితులు ఇవేనా..! మూడోసారి జనసేనాని ఇడుపుకాయితం కథ..!!

3

బుధుడి ఉదయంతో ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే.. డబ్బు సమస్యలన్నీ దూరం!

4

భాగ్యనగరంలో రెండు రోజులపాటు భారత్ సమ్మిట్.. నేడు నగరానికి రాహుల్ గాంధీ..

5

Telangana Inter Education Policy: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 11వ తరగతి బోర్డు పరీక్ష రద్దు? 9 నుంచి 12వ తరగతి వరకు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AP Another Toofan: ఈ సీజన్‌లో వరుసగా రెండు తుపాన్లను ఎదుర్కొన్న ఆంధ్ర ప్రదేశ్  మరో ముప్పు పొంచివుంది. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇవాళ అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరింత బలపడి నవంబర్ 14 నాటికి తీవ్ర అల్పపీడనంగా మారే అకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

తీవ్ర వాయుగుండం.. 

ఇది నవంబర్ 15 నాటికి వాయు గుండంగా, తరువాత తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలున్నాయంటోంది. అయితే ఇది ఆ తర్వాత ఏ దిశగా పయనిస్తుంది.  మరింత తీవ్రమై తుపానుగా మారుతుందా అనేది  మరికొన్ని గంటల్లో తేలనుంది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్‌లోని  దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడుపై వుంటుందంటోంది. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాల్లో  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ .  

రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలన్న IMD..

మొదటగా అల్పపీడనం బలపడి తమిళనాడు, దక్షిణ తీర ఆంధ్రప్రదేశ్ దిశగా కదలే అవకాశాలున్నాయని తెలిపింది. అటు దక్షిణ పశ్చిమ బంగాళాఖాతానికి చేరుకున్న తర్వాత సముద్రంలోనే దిశ మార్చుకునే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం బలపడే సమయంలో దిశ మార్చుకుని మయన్మార్  తీరం వైపు వెళ్లడం అనే ఆప్షన్స్ ఉన్నాయి.2026 అక్టోబర్ నెల చివరి వారంలో అర్నబ్ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఆ తర్వాత నవంబర్ ప్రారంభంలో మురసు తుపాను కూడా ఏపీలోని తూర్పు తీరాన్ని అల్లకల్లోలం చేసింది.  ఇప్పుడు వరుసగా మూడో తుపాను ఏర్పడే సూచనలు కనిపించడంతో అధికారులు ఎప్పటికపుడు అప్‌డేట్స్ అందిస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
AP Weather
Weather Update
Rain News