• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /తెలంగాణను వణికిస్తున్న చలి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.

తెలంగాణను వణికిస్తున్న చలి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.

Telangana Cold Waves: తెలంగాణను చలిపులి వణికిస్తోంది. గత రెండు మూడు రోజులుగా ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోయాయి. దీంతో ప్రజలు వెచ్చని ప్రదేశాలను ఆశ్రయిస్తున్నారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 13, 2026, 08:16 AM IST|Updated: Nov 13, 2026, 08:19 AM IST
joinshare
తెలంగాణను వణికిస్తున్న చలి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.
Image Credit: Cold Waves (ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
డిసెంబర్ 5 నుంచి ఈ 4 రాశులకు కుజుడి అదృష్టం.. 566 రోజుల పాటు డబ్బే డబ్బు!

డిసెంబర్ 5 నుంచి ఈ 4 రాశులకు కుజుడి అదృష్టం.. 566 రోజుల పాటు డబ్బే డబ్బు!

2

పవన్ కళ్యాణ్ విడాకులకు దారితీసిన పరిస్థితులు ఇవేనా..! మూడోసారి జనసేనాని ఇడుపుకాయితం కథ..!!

3

బుధుడి ఉదయంతో ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే.. డబ్బు సమస్యలన్నీ దూరం!

4

భాగ్యనగరంలో రెండు రోజులపాటు భారత్ సమ్మిట్.. నేడు నగరానికి రాహుల్ గాంధీ..

5

Telangana Inter Education Policy: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 11వ తరగతి బోర్డు పరీక్ష రద్దు? 9 నుంచి 12వ తరగతి వరకు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Weather Update: తెలంగాణలో ఒక్కపారిగా  వాతావరణం పూర్తిగా మారిపోయింది. నిన్న మొన్నటిదాకా ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలకు, ఇప్పుడు చలి వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుండటంతో సాయంత్రం 6 గంటల నుంచే చలి తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో 20 డిగ్రీలకు పైగా నమోదైన రాత్రి ఉష్ణోగ్రతలు, కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 15 డిగ్రీల దిగువకు చేరడం గమనార్హం. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత కనిష్టానికి పడిపోనున్నాయి.

21 జిల్లాల్లో 14 డిగ్రీల దిగువకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు..

ముఖ్యంగా 21 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల కిందకు పడిపోయాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈ సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సంగారెడ్డి జిల్లాలోని కోహీర్‌ ప్రాంతంలో 11.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత ..
సంగారెడ్డి జిల్లాలోని కోహీర్‌ ప్రాంతంలో 11.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ చలి ప్రభావం క్రమంగా పెరుగుతోంది.

ఉమ్మడి మెదక్‌ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు..

రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని  వాతావరణశాఖ హోచ్చరిస్తోంది. తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల రహదారులపై విజిబిలిటీ తగ్గే ప్రమాదం ఉందంటోంది. ఉదయం వేళల్లో పనులకు వెళ్ళేవారు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.  వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana Weather
Telangana News
Trending News
Telugu News