Samsung Galaxy A08 Launched: సాంసంగ్ కంపెనీ ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్‌తో పాటు అద్భుతమైన బడ్జెట్ మొబైల్స్ కూడా విడుదల చేస్తూ ఉంటుంది. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సాంసంగ్ గెలాక్సీ A08 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీనిని కంపెనీ ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన కలర్స్‌తో పాటు ప్రీమియం లుక్‌లో విడుదల కావడం విశేషం.. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్, ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సాంసంగ్ గెలాక్సీ A08 ధర వివరాలు..
ఈ సాంసంగ్ గెలాక్సీ A08 స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే... దీనిని కంపెనీ కేవలం ఒకే ఒక వేరియంట్‌లో కూడా అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఇది 4GB ర్యామ్‌తో పాటు 64GB స్టోరేజ్ వేరియంట్‌లో లభించబోతోంది. దీని ధర రూ.18,499 నుంచి ప్రారంభం కాబోతోంది.. ఇది డార్క్ బ్లూ, సిల్వర్‌తో పాటు గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో లభించబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ ఫోన్ సాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లతో పాటు రిటైల్ షాపుల్లో, ముఖ్యంగా కొన్ని ఈ కామర్స్ కంపెనీ ఫ్లాట్‌ఫామ్స్‌లో కూడా అందుబాటులో ఉంది.. లాంచ్ ఆఫర్‌లలో భాగంగా ఆరు నెలల పాటు నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా లభిస్తోంది.
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..
సాంసంగ్ గెలాక్సీ A08 స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 720x1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7-అంగుళాల HD ప్లస్ LCD డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతోంది.. అంతేకాకుండా కంపెనీ ప్రొటక్షన్ కోసం ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ కూడా అందించడం విశేషం.. ఇది ARM మాలి-G57 MC2 సపోర్ట్‌తో ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో G99 ప్లస్ 6nm చిప్‌సెట్ ప్రాసెసర్ లభిస్తోంది.. ఇందులో 4GB LPDDR5 ర్యామ్‌తో పాటు చాలా అద్భుతమైన 128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్‌తో లాంచ్ చేసింది. అంతేకాకుండా మైక్రో SD కార్డ్‌తో 2TB వరకు స్టోరేజ్‌ను పెంచుకునే అవకాశాన్ని కూడా అందిస్తోంది.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ UI 8 ఆపరేటింగ్ సిస్టమ్‌పై కూడా రన్ అవుతుంది. ఇవే కాకుండా ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది..
ఇక ఈ స్మార్ట్‌ఫోన్ వెనక భాగంలో అద్భుతమైన కెమెరా మాడ్యూల్ కూడా లభిస్తోంది. ఇందులో కంపెనీ 50-మెగాపిక్సెల్ ప్రధాన రియర్ కెమెరాతో పాటు ఎంతో ప్రత్యేకమైన 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాను కూడా అందిస్తూ వస్తోంది.. సెల్ఫీలతో పాటు వీడియో కాల్స్ కోసం.. ఇందులో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు కూడా లభిస్తున్నాయి. ఫోన్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని.. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందిస్తోంది.. కనెక్టివిటీ ఆప్షన్లలో భాగంగా.. 3.5mm ఆడియో జాక్‌తో పాటు డ్యూయల్ 4G VoLTE సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఇందులో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీ అందుబాటులోకి రావడం విశేషం..