• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /పిల్లల్లో రక్తహీనత, మానసిక ఒత్తిడికి చెక్.. కౌమార సమస్యలపై బడుల్లో అవగాహనా క్లబ్‌లు..!!

పిల్లల్లో రక్తహీనత, మానసిక ఒత్తిడికి చెక్.. కౌమార సమస్యలపై బడుల్లో అవగాహనా క్లబ్‌లు..!!

Telangana school: టీనేజ్ ( కౌమార దశ) వయస్సులో ఉన్న బాలబాలికల ఆరోగ్యం, మానసిక వికాసం, వ్యక్తిత్వ వికాసంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

Written ByBhoomi
Published: Oct 28, 2026, 10:30 AM IST|Updated: Oct 28, 2026, 10:32 AM IST
joinshare
పిల్లల్లో రక్తహీనత, మానసిక ఒత్తిడికి చెక్.. కౌమార సమస్యలపై బడుల్లో అవగాహనా క్లబ్‌లు..!!
Image Credit: Telangana school

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఉద్యోగి ఆత్మగౌరవమే ముఖ్యం..  వెయిటర్‌ను కొట్టిన కస్టమర్‌కు షాకిచ్చిన తాజ్ హోటల్.. లైఫ్‌టైమ్ బ్యాన్..!!

ఉద్యోగి ఆత్మగౌరవమే ముఖ్యం.. వెయిటర్‌ను కొట్టిన కస్టమర్‌కు షాకిచ్చిన తాజ్ హోటల్.. లైఫ్‌టైమ్ బ్యాన్..!!

2

సాంసంగ్ Galaxy A08 లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ధర ఎంతంటే?

3

నవంబర్ 1 నుంచి మహాలక్ష్మి రాజయోగం.. ఈ 4 రాశులకు ధనలాభాలు, బంపర్‌ జాక్‌పాట్‌!

4

ఆయుష్మాన్ కార్డుదారులకు అలర్ట్.. మీ ఉచిత రూ.5 లక్షల క్లెయిమ్ తిరస్కరిస్తే ఇలా కంప్లైంట్ ఇవ్వండి!

5

పిల్లల్లో రక్తహీనత, మానసిక ఒత్తిడికి చెక్.. కౌమార సమస్యలపై బడుల్లో అవగాహనా క్లబ్‌లు..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana school: టీనేజ్ ( కౌమార దశ) వయస్సులో ఉన్న బాలబాలికల ఆరోగ్యం, మానసిక వికాసం, వ్యక్తిత్వ వికాసంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగా విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడంతోపాటు రక్తహీనత, పోషకాహార లోపం, రుతుస్రావం సమయంలో తలెత్తే ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, బాల్య వివాహాలు, మాదకద్రవ్యాల వినియోగం వంటి సమస్యలపై అవగాహన కల్పించేందుకు పాఠశాలలు కమ్యూనిటీ సెంటర్ల స్థాయిలో అడోల్ సెంట్ క్లబ్స్ ను నిర్వహించనుంది. రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా ఈ క్లబ్స్ ను ఏర్పాటు చేసి వాటి ద్వారా కౌమార బాలబాలికలకు నెలకో అంశంపై అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టి సారించింది.

ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ముందుగా ప్రతి ఆశా కార్యకర్త ప్రాంతం నుంచి ఇద్దరు అబ్బాయిలు.. ఇద్దరు అమ్మాయిలను ఎంపిక చేస్తారు. వారు అవగాహన కల్పించాల్సిన అంశాలపై వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. ఈ నలుగురిని పీర్ ఎడ్యుకేటర్లు అని పిలుస్తారు. ఆ తర్వాత వారు 15 నుంచి 20 మంది కౌమార బాలురు, బాలికలతో  బృందాలుగా ఏర్పడి నెలవారీ సమావేశాలు నిర్వహిస్తారు. తమ తోటివారికి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడం, సందేహాలను నివృత్తి చేయడం, సంభాషణలను సులభతరం చేయడం వారి బాధ్యత. ఈ కార్యక్రమాలకు ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు, ఇతర నియమిత సిబ్బంది సాంకేతిక సహాయాన్ని అందిస్తారు.

ప్రతి సమావేశంలో..  ఒక ప్రధాన అంశాన్ని ఎంపిక చేసి, ఆశా, ఏఎన్ఎం లేదా ఆరోగ్య సిబ్బంది సమక్షంలో దానిపై చర్చిస్తారు. అవసరమైతే, అబ్బాయిలు, అమ్మాయిలను అడోలసెంట్ ఫ్రెండ్లీ హెల్త్ క్లినిక్స్ (AFHCs) ఇతర ఆరోగ్య సేవలకు సిఫార్సు చేస్తారు. ఈ కార్యక్రమాలను అమలు చేయడానికి అవసరమైన శిక్షణ, సమాచార సామగ్రిని స్టేట్ హెల్త్ సిస్టమ్ రిసోర్స్ సెంటర్ (SHRC) సహకారంతో అభివృద్ధి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈ క్లబ్‌లను ఏర్పాటు చేయాలని నేషనల్ హెల్త్ మిషన్ (NHM) మేనేజింగ్ డైరెక్టర్,  పాఠశాల విద్యా డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జనవరి నుండి డిసెంబర్ వరకు క్లబ్‌ల కోసం ఒక ప్రత్యేక క్యాలెండర్‌ను ఇప్పటికే సిద్ధం చేశారు.

ఏయే నెలలో ఎలాంటి అంశాలను చర్చిస్తారో తెలుసుకుందాం.

జనవరి: వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి ప్రత్యేకంగా చర్చిస్తారు.

ఫిబ్రవరి: పోషకాహార లోపం, రక్తహీనత నివారణ. ఐరన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు, ఐరన్-ఫోలిక్ యాసిడ్ (IFA) మాత్రల వాడకంపై అవగాహన కల్పిస్తారు.

మార్చి: ఋతుస్రావ పరిశుభ్రత. అపోహలు, వాస్తవాలపై చర్చ, శానిటరీ నాప్‌కిన్‌ల వాడకంపై అవగాహన కల్పిస్తారు.

ఏప్రిల్: మానసిక ఆరోగ్యం, భావోద్వేగ సమతుల్యత. భావోద్వేగాలను గుర్తించడం, ఒత్తిడి నిర్వహణపై కార్యక్రమాలు నిర్వహిస్తారు.

మే: శారీరక వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి. బహిరంగ ఆటలు, ఫిట్‌నెస్ కార్యక్రమాలు, నిద్ర,  స్క్రీన్ సమయం గురించి క్లుప్తంగా వివరిస్తారు.

జూన్: మాదకద్రవ్యాల నివారణ. పొగాకు, మద్యం, ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే హానిపై అవగాహన. సమస్యలను ఎదుర్కొనే నైపుణ్యాలపై పాత్ర పోషణ.

జూలై: లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం. కౌమారదశలో వచ్చే శారీరక మార్పులు, వ్యక్తిగత హద్దులు, అవసరమైతే సహాయం కోరడంపై అవగాహన.

ఆగస్టు: లింగ సమానత్వం, హింస నివారణ. లింగ వివక్షపై అవగాహన, విశ్వసనీయమైన పెద్దలను గుర్తించడం, సహాయ సేవల వివరాలు.

సెప్టెంబర్: జీవన నైపుణ్యాలు, నిర్ణయం తీసుకోవడం. సమస్య పరిష్కారం, సంభాషణ,  నిర్ణయం తీసుకునే నైపుణ్యాలపై అభ్యాసం.

అక్టోబర్: బాల్య వివాహాల నివారణ, పిల్లల భద్రత. చట్టపరమైన రక్షణ, కౌమార హక్కులు, బాలల హెల్ప్‌లైన్‌లు, ఫిర్యాదుల గురించి అవగాహన.

నవంబర్: ఇంటర్నెట్ భద్రత. సైబర్‌సెక్యూరిటీపై అవగాహన కార్యక్రమాలు.

డిసెంబర్: బాధ్యతాయుతమైన డిజిటల్ ప్రవర్తన. ఆన్‌లైన్ వ్యక్తిగత సమాచార గోప్యత సైబర్‌బుల్లింగ్ నివారణపై చర్చిస్తారు.

Also Read: 

విద్యార్థుల్లో పఠనాసక్తి పెంపే లక్ష్యం.. రాష్ట్రవ్యాప్తంగా ‘తెలంగాణ రీడింగ్ డిప్లొమా’ ప్రారంభం.!!

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telugu News