• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /ఉద్యోగి ఆత్మగౌరవమే ముఖ్యం.. వెయిటర్‌ను కొట్టిన కస్టమర్‌కు షాకిచ్చిన తాజ్ హోటల్.. లైఫ్‌టైమ్ బ్యాన్..!!

ఉద్యోగి ఆత్మగౌరవమే ముఖ్యం.. వెయిటర్‌ను కొట్టిన కస్టమర్‌కు షాకిచ్చిన తాజ్ హోటల్.. లైఫ్‌టైమ్ బ్యాన్..!!

Taj Hotel Agra: ఆగ్రాలోని ప్రముఖ తాజ్ హోటల్లో చోటుచేసుకున్న ఒక ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హోటల్లో పనిచేస్తున్న ఓ వెయిటర్ పై కస్టమర్ చేయిచేసుకోవడం సంచలనంగా మారింది.

Written ByBhoomi
Published: Oct 28, 2026, 11:16 AM IST|Updated: Oct 28, 2026, 11:19 AM IST
joinshare
ఉద్యోగి ఆత్మగౌరవమే ముఖ్యం..  వెయిటర్‌ను కొట్టిన కస్టమర్‌కు షాకిచ్చిన తాజ్ హోటల్.. లైఫ్‌టైమ్ బ్యాన్..!!
Image Credit: Taj Hotel Agra

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఉద్యోగి ఆత్మగౌరవమే ముఖ్యం..  వెయిటర్‌ను కొట్టిన కస్టమర్‌కు షాకిచ్చిన తాజ్ హోటల్.. లైఫ్‌టైమ్ బ్యాన్..!!

ఉద్యోగి ఆత్మగౌరవమే ముఖ్యం.. వెయిటర్‌ను కొట్టిన కస్టమర్‌కు షాకిచ్చిన తాజ్ హోటల్.. లైఫ్‌టైమ్ బ్యాన్..!!

2

సాంసంగ్ Galaxy A08 లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ధర ఎంతంటే?

3

నవంబర్ 1 నుంచి మహాలక్ష్మి రాజయోగం.. ఈ 4 రాశులకు ధనలాభాలు, బంపర్‌ జాక్‌పాట్‌!

4

ఆయుష్మాన్ కార్డుదారులకు అలర్ట్.. మీ ఉచిత రూ.5 లక్షల క్లెయిమ్ తిరస్కరిస్తే ఇలా కంప్లైంట్ ఇవ్వండి!

5

పిల్లల్లో రక్తహీనత, మానసిక ఒత్తిడికి చెక్.. కౌమార సమస్యలపై బడుల్లో అవగాహనా క్లబ్‌లు..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Taj Hotel Agra: ఆగ్రాలోని ప్రముఖ తాజ్ హోటల్లో చోటుచేసుకున్న ఒక ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హోటల్లో పనిచేస్తున్న ఓ వెయిటర్ పై కస్టమర్ చేయిచేసుకోవడం సంచలనంగా మారింది. అయితే ఈ అమానుష ప్రవర్తనపై హోటల్ యాజమాన్యం స్పందించిన తీరు సిబ్బంది ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తీసుకున్న నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

అసలేం జరిగిందంటే.. పరితోష్ లధానీ తన పోస్టులో తెలిపిన వివరాల ప్రకారం.. హోటల్ లోని రెస్టారెంట్లో కాంతీ అనే వెయిటర్ ఒక గెస్ట్ కు సర్వీస్ అందిస్తున్నాడు. ఆ సమయంలో కమ్యూనికేషన్ గ్యాప్ తో ఇద్దరి మధ్య చిన్న అపార్థం చోటుచేసుకుంది. వెయిటర్ కు ఇంగ్లీష్ పై పట్టు తక్కువగా ఉండటంతో పొరపాటు జరిగింది. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన గెస్ట్ అందరూ చూస్తుండగానే.. వెయిటర్ కాంతీ చెంపపై కొట్టాడు.

అయితే.. తనను తీవ్రంగా కలవరపరిచిన మరో విషయం ఉందని పరితోష్ చెప్పారు. వెయిటర్ కాంతీ ఈ సంఘటన గురించి ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. యాజమాన్యానికి ఈ విషయం తెలిసి, ఎందుకు మౌనంగా ఉన్నావని అడిగినప్పుడు, కాంతి ఇచ్చిన సమాధానం వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.  తాను ఆగ్రా సమీపంలోని ఒక పేద రైతు కుటుంబం నుండి వచ్చానని.. తాజ్ హోటల్‌లో పనిచేయడం తన కల అని.. దానికి భంగం కలిగించే ఏ పని చేయాలనుకోలేదని కాంతి వివరించాడు. ఉద్యోగం కోల్పోతానేమోనన్న భయంతోనే ఆ అవమానాన్ని మౌనంగా భరించానని అతను చెప్పాడు.

యాజమాన్యం కఠిన నిర్ణయం:
కాంతీ మాటలతో తీవ్రంగా బాధపడిన పరితోష్.. మరుసటి రోజు ఆ గెస్ట్ ను  హోటల్ నుండి జీవితకాలం పాటు నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై ఆయన ఒక లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో  స్పందించారు. నా తాజ్ ఆగ్రా హోటల్ నుండి ఒక అతిథిని జీవితకాలం పాటు బ్లాక్‌లిస్ట్ చేశాను. వారు మా వెయిటర్‌తో ప్రవర్తించిన తీరు అత్యంత దారుణం. నా బృందాన్ని అగౌరవపరిచే హక్కు ఎవరికీ లేదు. ఇకపై ఎలాంటి శారీరక దాడిని నేను సహించను." కస్టమర్ ఎంత పెద్దవారైనా లేదా ఎంత డబ్బు ఖర్చు చేసినా, ఉద్యోగిని దురుసుగా ప్రవర్తించే హక్కు వారికి లేదని ఆయన స్పష్టం చేశారు. "మన ఉద్యోగులు తమ ఆత్మగౌరవం కోసం నిలబడటానికి భయపడితే, వారి పక్షాన నిలబడటం మన బాధ్యత " అని పరితోష్ అన్నారు.

ఈ లింక్డ్‌ఇన్ పోస్ట్ వైరల్ అయి.. వేలాది స్పందనలను పొందింది. హోటల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసించారు. కొందరు నిందితుడిపై అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించగా, మరికొందరు అతని పేరు ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. మొత్తం మీద, కస్టమర్ సంతృప్తి ఎంత ముఖ్యమో, ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడటం కూడా అంతే ముఖ్యమనే బలమైన సందేశాన్ని ఈ సంఘటన ఇచ్చింది.


 Also Read: 

పిల్లల్లో రక్తహీనత, మానసిక ఒత్తిడికి చెక్.. కౌమార సమస్యలపై బడుల్లో అవగాహనా క్లబ్‌లు..!!

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Telugu News