• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /రైతు చొక్కాలోకి దూరిన నాగుపాము పిల్ల.. వీడియో ఇదే..

రైతు చొక్కాలోకి దూరిన నాగుపాము పిల్ల.. వీడియో ఇదే..

Sleeping Farmer Snake Video: పొలంలో ఓ రైతు విశ్రాంతి తీసుకున్న సమయంలో ఓ పాము అతడి షర్ట్‌లోకి దూరింది. దీనికి సంబంధించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిని చూసి అందరూ షాక్‌ అవుతున్నారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 30, 2026, 04:39 PM IST|Updated: Oct 30, 2026, 04:43 PM IST
joinshare
రైతు చొక్కాలోకి దూరిన నాగుపాము పిల్ల.. వీడియో ఇదే..
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
రూ.69,999తో Infinix GT 50 Pro లాంచ్.. 24 వేల విలువైన గేమింగ్ యాక్సెసరీస్ ఫ్రీగా!

రూ.69,999తో Infinix GT 50 Pro లాంచ్.. 24 వేల విలువైన గేమింగ్ యాక్సెసరీస్ ఫ్రీగా!

2

AP Inter Exam Fee Deadline: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్..పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు గడుపు పెంపు! ఎప్పటి వరకు?

3

Hyderabad: రాబోయే 8 నెలలు హైదరాబాద్‌లో నీటి సంక్షోభం.. నగర వాసులకు జలమండలి కీలక హెచ్చరిక..

4

IND vs NZ Highlights: భారత్‌ గెలుపు యాత్రకు బ్రేక్‌.. భారీ విజయంతో పరువు నిలబెట్టుకున్న న్యూజిలాండ్‌

5

రైతు చొక్కాలోకి దూరిన నాగుపాము పిల్ల.. వీడియో ఇదే..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Sleeping Farmer Snake Video: పొలంలో రెక్కలు ముక్కలు చేసుకుని.. అన్నదాతలకు ప్రకృతి ఒడి ఎంతటి అద్భుతాన్ని అందిస్తుందో అదరికీ తెలుసు.. అయితే, ఈ ప్రకృతిలోని జీవులు కూడా అంతటి ప్రమాదాన్ని తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. పొలం పనులు ముగించుకుని.. చెట్టు నీడన కాసేపు అలసట తీర్చుకుంటున్న ఓ రైతుకు ఊహించని ఊహించని ఘటన ఎదురైంది. నిద్రలో ఉన్న ఆతని చొక్కాలోకి ఓ చిన్న నాగుపాము పిల్ల దూరిన ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన చూసిన వారు షాక్‌ అవుతున్నారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసకుందాం..

ఉదయం నుంచి పొలంలో కష్టపడి పనిచేసిన ఆ రైతు..  మధ్యాహ్న భోజనం ముగించుకుని.. సమీపంలో చెట్టు కింద పడుకున్నాడు.. అలసటగా ఉండడంతో ఆ రైతు గాఢ నిద్రలోకి జారుకున్నాడట.. సరిగ్గా అదే సమయంలో పరిసరాల్లోని పొదల్లో నుంచి వచ్చిన ఓ చిన్న నాగుపాము పిల్ల అతడి చొక్కా పై నుంచి లోపలికి దూరుకుంటూ పోయింది.. శరీరానికి ఏదో చల్లగా తగడలంతో రైతు ఒక్కసారిగా నిద్రలో నుంచి లేచేసేశాడు.. తీరా చూస్తే, చొక్కా లోపల పాము పిల్ల కదులుతుండటం చూసి అతడికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైపోయింది..

సాధారణంగా పామును చూస్తేనే ఎవరైనా భయంతో గట్టిగా కేకలు వేయడం, పరుగులు పెట్టడం చేస్తూ ఉంటారు.. అయితే, చొక్కా లోపల పాము ఉన్నప్పుడు కంగారుపడి ఒక్కసారిగా కదిలితే, తప్పకుండా కాటే వేసే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ రైతు తీవ్ర భయాందోళనకు గురైనప్పటికీ.. ఎలాగోలా అతి కష్టమ్మీద ఆ పాము పిల్లను శరీరం నుంచి దులుపుకోగలిగాడు.. అక్కడున్నది చిన్న పాము పిల్ల అయినప్పటికీ.. అది ప్రాణాలు తీసే ఛాన్స్‌ ఉన్నప్పటికీ..  అతన్ని కాటు పడకుండా  ఉండడంతో ఊపిరి పీల్చుకున్నట్లు తెలుస్తోంది.

ఈ అరుదైన ఘటన ఎవరో దూరం నుంచే చిత్రీకరించి రీల్‌ రూపంలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షలాది మంది వీక్షించిన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు విశ్రాంతి తీసుకునే సమయంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని నిపుణుల సూచిస్తున్నారు. లేకపోతే పాములు ఇలాగే దూరి కాటేసే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Telugu Viral Duniya (@telugu_viral_duniya)

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Viral News
Telugu News