SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

నా కళ్లలో కళ్లు పెట్టి చూసే ధైర్యం మోడీకి లేదు.. ఆత్మకథలో సోనియా సంచలనం..

Sonia Gandhi on PM Modi: సోనియా గాంధీ తన ఆత్మకథలో పలు అంశాలను ప్రస్తావించారు. అంతేకాదు 2014లో ప్రధాన మంత్రిగా అధికారం చేపట్టిన నరేంద్ర మోడీపై తన పుస్తకంలో తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన తన కళ్లలో కళ్లు పెట్టి చూసే ధైర్యం లేదని తన పుస్తకంలో ప్రస్తావించారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 11, 2026, 12:12 PM IST | Updated: Nov 11, 2026, 12:15 PM IST
Image Credit: Sonia Gandhi on PM Modi (FilePic /Source)
Join

Sonia - PM Modi: ప్రధాని నరేంద్ర మోడీతో తనకు ఇప్పటివరకు పెద్దగా వ్యక్తిగత సంభాషణలేమీ జరగలేదని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ వెల్లడించారు. అధికారిక కార్యక్రమాల్లో ఎదురుపడినప్పుడు పరస్పరం నమస్కారం మాత్రమే చేసుకుంటామని చెప్పుకొచ్చారు.  ఆ సమయంలో నరేంద్ర మోడీ తనతో మాట్లాడేటప్పుడు కళ్లలోకి కాకుండా పక్కకు చూస్తారని పేర్కొన్నారు. తన కళ్లలో కళ్లు పెట్టి చూసే ధైర్యం లేదని ప్రస్తావించారు.   దేశం పట్ల ప్రధాన నరేంద్రమోడీకి, తనకు పూర్తిగా భిన్నమైన ఆలోచనలున్నాయని సోనియా గాంధీ తెలిపారు. మోడీ దృక్పథం ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్తల ఆలోచనలు, ఆయన వ్యక్తిగత అనుభవాల ద్వారా రూపుదిద్దుకుందని సోనియా గాంధీ విమర్శించారు.

మోడీపై సోనియా అభిప్రాయం..

ఆ దృక్పథంలో ఒక మతం, సంస్కృతికి ఇతరులకంటే ప్రాధాన్యం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే ఇది వ్యక్తిగత విభేదం కాదని, దేశ భవిష్యత్తుపై ఉన్న భిన్నమైన ఆలోచనల మధ్య పోరాటమని సోనియాగాంధీ ప్రస్తావించారు.పార్లమెంట్‌లోనూ  ప్రతిపక్షాలను ద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరచూ కఠిన భాష ఉపయోగిస్తుంటారని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆరోపించారు. ముఖ్యంగా దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూపై బీజేపీ వైఖరిని ఆమె తప్పుబట్టారు. నెహ్రూ దేశాన్ని ప్రజాస్వామ్య, లౌకిక మార్గంలో నడిపించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇద్దరి సిద్ధాంతాలు పూర్తిగా వేరు.. 
'కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌' అనే బీజేపీ నినాదం వెనుక కాంగ్రెస్‌ పార్టీతో పాటు దాని విధానాలు, సిద్ధాంతాలను కూడా అంతం చేయాలనే ఆలోచన ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం మతపరమైన విభజనకు దారితీస్తోందని విమర్శించారు. మొత్తంగా మోడీతో తన వ్యక్తిగత పరిచయం పరిమితంగానే ఉన్నప్పటికీ.. దేశం పట్ల ఇద్దరి ఆలోచనలు, రాజకీయ సిద్ధాంతాలు పూర్తిగా భిన్నమని సోనియా గాంధీ తన ఆత్మకథ పుస్తకంలో విశ్లేషించారు.

భారత దేశపు కోడలిగా సోనియా ..

భారత రాజకీయ చరిత్రను శాసించిన ఉక్కుమహిళ, మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీకి ఉండే కోపతాపాల గురించి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలిపారు. పెళ్లయి ఆ ఇంట్లోకి అడుగు పెట్టిన కొత్తలో ఇందిరాగాంధీ వ్యవహారశైలి ఎంతగానో భయపెట్టేదని సోనియా ఆత్మకథలో వెల్లడించారు. అత్తగారి విపరీతమైన ఆగ్రహావేశాలు చూసి తాను తొలి రోజుల్లో కూర్చున్న చోటే వణికిపోయేదాన్ననారు.  అయితే ఆ తర్వాత ఆమె మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నానని సోనియా ఆ పుస్తకంలో ఎంతో భావోద్వేగంతో రాసుకొచ్చారు. చిన్న చిన్న పొరపాట్లకు కూడా సిబ్బందిని, పార్టీ ప్రముఖులను గది మూలన నిలబెట్టడం, తినే ప్లేట్లు పడేయడం వంటి కఠినమైన పద్ధతులు ఆ ఇంటి వాతావరణంలో ఉండేవని సోనియాగాంధీ వివరించారు. ఇందిరా గాంధీ కోపం కేవలం సిబ్బందికే పరిమితం కాలేదని, పార్లమెంటులో ప్రతిపక్షాలతో ఏదైనా ఘర్షణ వాతావరణం ఏర్పడితే ఆ ప్రభావం తినేటప్పుడు కూడా కనిపించేదని సోనియా గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఎమర్జన్సీని తనతో పాటు తన భర్త రాజీవ్ గాంధీ పూర్తిగా వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత తన అత్త ఎమర్జన్సీ విధింపుపై బాధపడ్డారన్నారు. అయితే ఎమర్జన్సీ విధింపుకు ప్రధాన కారణం తన మరిది సంజయ్ గాంధీ అని గుర్తు చేస్తూ అప్పుడు జరిగిన సంఘటనలకు ఆయనే ప్రధాన బాధ్యత ఆయనదే అని చెప్పుకొచ్చారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES