Chennai: చెన్నైలో అమానుషం.. గల్లా పట్టుకుని బస్ కండక్టర్‌పై యువకుల పైశాచిక దాడి.. వీడియో వైరల్..
Attack on chennai bus conductor: పుట్ బోర్డ్ ప్రయాణం వద్దన్నందుకు కొంత మంది యువకులు బస్ కండక్టర్ పై ఘోరంగా దాడి చేశారు. చుట్టుపక్కల వారు వారిస్తున్న కూడా విన్పించుకోలేదు. ఈ క్రమంలో చెన్నైలోని ఘటనపై ఆర్టీసీ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Student assault govt bus conductor in Chennai: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయంను కల్పిస్తున్నారు. దీనికి మహిళల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం ఫ్రీబస్సు సర్వీసుల్ని మహిళలు ఉపయోగించుకుంటూ రచ్చ చేస్తున్నారు. సీట్ల కోసం, చిల్లర కోసం తోటి ప్రయాణికులతో వాగ్వాదంకు దిగుతున్నారు. అంతే కాకుండా ఏకంగా కండక్టర్లు, డ్రైవర్లపైనే దాడికి దిగుతున్నారు. దీని వల్ల కొంత మంది బస్సుల్లో ప్రయాణిస్తు తమ ప్రాణాల్ని సైతం కొల్పతున్నారు.ఈ క్రమంలో చెన్నైలోని ఆవడిలో దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.
తమిళనాడులోని చెన్నైలోని ఆవడిలో ఆర్టీసీ బస్ లో కొంత మంది ఐటీఐ స్టూడెంట్స్ ఎక్కారు. అయితే.. వారు బస్సు ఎక్కిన తర్వాత చాలా సేపు ఫుట్ బోర్డ్ మీదే ప్రయాణం చేశారు. బస్సులో ఎక్కేవారు, దిగేవారు ఇబ్బందులు పడుతున్న పుట్ బోర్డు మీద నిలబడి నానా హంగామా చేశారు. కండక్టర్ , డ్రైవర్ ఎంతగా చెబుతున్న కూడా విన్పించుకోలేదు. ఇక చివరకు కండక్టర్ వారికి గట్టిగా చెప్పి బస్సులోని దింపి వేయడంతో వారు కండక్టర్ తోనే గొడవలకు దిగారు.
నోటికొచ్చిన బూతులు తిడుతూ దాడులకు పాల్పడ్డారు. అక్కడున్న వారు చెప్పేందుకు ప్రయత్నించిన పట్టించు కోలేదు. పలుమార్లు కండక్టర్ పై చెయ్యి చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. పాపం ఈ ఘటనతో కండక్టర్ ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లిపోయాడు. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై తమిళనాడు ఆర్టీసీ అధికారులు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.