Youtuber Madhumitha: భర్త, పిల్లలతో యూట్యూబర్ మధుమిత పరార్.. అసలు కారణం ఇదేనా..?..
Madhumitha controversy: యూట్యూబర్ మధుమితపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో మధుమిత తన పిల్లలు, భర్తతో కలసి పారిపోయారు. ఈ ఘటనతో మరోసారి మధుమిత వార్తల్లో నిలిచారు.
Tamil nadu youtuber madhumitha absconds amid police investigation: తమిళనాడుకు చెందిన యూట్యూబర్ మధుమితపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలో మధుమితపై ఇప్పటికే అనేక వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఇటీవల తిరునెల్వేలి జిల్లా కేటీసీ నగర్‌కు చెందిన భవన నిర్మాణ కాంట్రాక్టర్ పేచ్చిముత్తు (89)ను సైతం మధుమిత ట్రాప్ చేసి ఐదు తులాల చైన్ ను చోరీ చేసి బెదిరింపులకు పాల్పడిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
అయితే.. తాజాగా మధుమిత తన భర్త, పిల్లలతో కలిసి పరార్ అయ్యారు. పోలీసు కేసులకు భయపడిపోయి ఇంటికి తాళం వేసి పారిపోయినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో యూట్యూబర్ మధుమిత ఎక్కడకు వెళ్లిందని పోలీసులు విచారణ చేపట్టారు.
అయితే యూట్యూబర్ మధుమిత ఇటీవల సోషల్ మీడియాలో డబ్బుల కట్టలు, బంగారంతో వీడియోలు షేర్ చేశారు.
ఆ తర్వాత అనూహ్యంగా దొంగలుపడి ఆమె ఇంట్లోని ఏకంగా 118 సవర్ల బంగారం నగలు, డబ్బులను దోచుకెళ్లారు. దీనిపై యూట్యూబర్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఘటన తర్వాత కూడా మధుమిత సోషల్ మీడియాలో పదుల సంఖ్యలో తన వీడియోలను నెట్టింట షేర్ చేసింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మంచి ఫాలోవర్స్ తో ఉన్న మధుమిత ప్రస్తుతం వివాదాంలో చిక్కుకొవడం తెగ వైరల్ గా మారింది.