Thief steals Iphone later asked owner for passcode in Dehradun: ఇటీవల కొంత మంది అస్సలు కష్టపడకుండా చోరీల బాటపడ్డారు. జాబ్ లు చేయడం, ఏదైన పనులు చేయడం అస్సలు చేయడంలేదు. సులువుగా డబ్బులు సంపాదించడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ముఖ్యంగా బంగారం రెట్లు పెరిగిపోయిన తర్వాత చాలా మంది సింగిల్ గా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకుని మరీ దొంగతనాలు చేస్తున్నారు. ఎక్కడ చాన్స్ దొరికిన ఏదోరకంగా చోరీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన్ లో ఒక విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది.
ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన్ లో డీఐటీ యూనివర్సిటీ, గ్రాఫిక్ ఎరా యూనివర్సిటీ సమీపంలోని హస్టళ్లలో చోరీలు జరిగాయి. అంతే కాకుండా సన్‌షైన్ ఎన్‌క్లేవ్‌లో నివసించే కౌశికి ధ్యాని ఐఫోన్ చోరీకి గురైంది. ఆమె ఈ ఘటన తర్వాత సీసీఫుటేజీని పరిశీలించగా ఇద్దరు అనుమానాస్పదంగా అక్కడ కన్పించారు. కౌశికి చెందిన ఫోన్ ను.. సెప్టెంబర్ 12న ఉదయం 6.30 గంటల ప్రాంతంలో తన ఐఫోన్‌ను చివరిసారిగా ఉపయోగించాడు. ఉదయం 8.45 గంటలకల్లా అది అతని గదిలో కనిపించలేదు.
సెప్టెంబర్ 13న సక్షం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఇటీవల కుటుంబ సభ్యులు పోయిన ఫోన్ గురించి వివరాలు అడుగుతూ వాట్సాప్ మెస్సెజ్ లు రావడంతో ఇంట్లోని వారు షాక్ అయ్యారు. ఈ ఫోన్ పాస్ వర్డ్ ఏంటని, వివరాలు చెప్పాలని పదే పదే మెస్సెజ్ లను పంపాడు. దీంతో యువతి అదే రోజు రాత్రి పీఎస్ కు వెళ్లింది.
ఈ క్రమంలో యువతి సీసీటీవీ ఫుటేజ్, బాధితుల కుటుంబ సభ్యులకు పంపిన సందేశాలను పోలీసులకు చూపించింది. దీంతో పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. అయితే.. ఐఫోన్ పాస్ వర్డ్ ను ఓపెన్ చేయడం అంత ఈజీకాదని, అందుకే సదరు దొంగ పాస్ వర్డ్ కోసం ఏకంగా ధైర్యం చేసి దాని ఓనర్ కు ఫోన్ చేయడంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.