SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

టీచర్లకు TET మినహాయింపు.. ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

TET Exemption Resolution: జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తీసుకున్న రెండు కీలక నిర్ణయాలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. డిసెంబర్ 24,2009 నాటికి ముందు నోటిఫై చేసిన ఉద్యోగ పోస్టులకు ఎంపికైన సిబ్బందిని నేషనల్ పెన్షన్ స్కీమ్ నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లోకి మారడానికి అనుమతి ఇస్తూ జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Sep 29, 2026, 09:10 AM IST | Updated: Sep 29, 2026, 09:11 AM IST
Image Credit: TET Exemption Resolution
Join

TET Exemption Resolution: జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తీసుకున్న రెండు కీలక నిర్ణయాలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. డిసెంబర్ 24,2009 నాటికి ముందు నోటిఫై చేసిన ఉద్యోగ పోస్టులకు ఎంపికైన సిబ్బందిని నేషనల్ పెన్షన్ స్కీమ్ నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లోకి మారడానికి అనుమతి ఇస్తూ జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోపాటు జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న రెహబర్ ఎ తలీమ్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చే ప్రతిపాదిత తీర్మాన్నాన్ని కూడా ఆమోదించింది.

జమ్మూ కాశ్మీర్ తన స్వంత రాజ్యాంగం కింద ఉన్న సమయంలో డిసెంబర్ 24,2009 నాడు అధికారికంగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ ను స్వీకరించింది. అయితే ఆ గడువు కంటే ముందే ప్రభుత్వ ఉద్యోగ రిక్రూట్ మెంట్ కోసం నోటిఫికేషన్ వెలువడి.. ఆ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు ఇప్పుడు పాతన పెన్షన్ స్కీమ్ ఎంచుకునే అద్భుత అవకాశాన్ని కల్పించింది. 2019ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత జమ్ము కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా పరిగణించబడుతోంది. ఒక యూటీ పరిధిలో ఈ తరహా నిర్ణయం అమలు అనేది దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఇతర కేంద్రపాలిత ప్రాంతాల ఉద్యోగులకు కొత్త ఆశలను చిగురింపజేస్తోందని చెప్పాలి.

కాగా జూన్ 2004 కంటే ముందుగా నోటిఫికేషన్లు వచ్చి.. ఆపై విధుల్లో చేరిన వేలాది మంది ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు ఓపీఎస్ కోరుతూ ఇప్పటికే కోర్టులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే జమ్మూకశ్మీర్ ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పుడు ఢిల్లీ బాధితుల వాదనకు బలమైన ఉదాహరణగా.. చట్టపరమైన ఆధారంగా నిలిచే అవకాశం ఉంది.  ఇక జమ్మూకశ్మీర్ అసెంబ్లీ వేదిక మరో కీలక తీర్మానం ఆమోదం పొందింది. రెహబర్ ఎ తలీమ్ స్కీమ్ కింద గతంలో నియమితులైన టీచర్లకు టెట్ నిబంధన నుంచి ఉపశమనం లభించింది. అసెంబ్లీ సమావేశాల్లో సుదీర్ఘ చర్చల తర్వాత విధుల్లో కొనసాగుతున్న సీనియర్ టీచర్లకు మళ్లీ టెట్ అర్హత తప్పనిసరి  కాదని ఈ తీర్మానం రూపొందించింది.


జమ్మూ-కాశ్మీర్ ప్రస్తుత పరిపాలనా హోదా కారణంగా, ఈ అసెంబ్లీ తీర్మానం చట్టంగా మారాలంటే కొన్ని కీలక దశలు పూర్తి కావాల్సి ఉంది. లెఫ్టినెంట్ గవర్నర్  ఆమోదంతో పాటు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ  తుది ఆమోదం లభించిన తర్వాత మాత్రమే ఇది అమలులోకి వస్తుంది. ఈ పరిపాలనాపరమైన పరిణామాలు కేవలం జమ్మూ-కాశ్మీర్‌కే పరిమితం కాకుండా, దేశవ్యాప్త విద్యా రంగాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. 
 

2009 ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం అమల్లోకి రాకముందే నియామక ప్రక్రియ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు ఇది పెద్ద ఊరట అని చెప్పాలి.  ఏళ్ల తరబడి విధుల్లో ఉన్నవారిపై బలవంతంగా టెట్ రుద్దడం సరికాదనే భావనకు ఇది బలం చేకూరుస్తుందని చెప్పవచ్చు. గతంలో నియమితులైన వారికి కూడా టెట్ నిబంధన వర్తిస్తుందని సుప్రీంకోర్టు ఇచ్చిన  ఉత్తర్వుల నేపథ్యాన్ని ఈ తీర్మానం సవాలు చేసే అవకాశం ఉంది. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉపాధ్యాయుల కోసం ఇలాంటి మినహాయింపులు కోరేందుకు ఇదొక ముందడుగుగా మారనుంది. ఇక పాత పెన్షన్ స్కీమ్ అమలు,  సీనియర్ ఉపాధ్యాయులకు అర్హత పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వడంలో జమ్మూ-కాశ్మీర్ తీసుకున్న ఈ నిర్ణయాలు..    దేశంలోని ఇతర రాష్ట్రాల విద్యా, ఉద్యోగ విధానాలలో పెను మార్పులకు పునాది వేసే అవకాశముందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES