SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Thane Actress Prostitution: ముంబైలో హెటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు..బాలీవుడ్ నటి అరెస్ట్..పట్టుబడ్డ ఇద్దరు మహిళలు!

Thane Actress Prostitution Arrest: మహారాష్ట్రలోని థానేలో హై-ప్రొఫైల్ సెక్స్ రాకెట్‌ను భగ్నం అయ్యింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTC) ఈ గుట్టును రట్టు చేసింది. భోజ్‌పురి సినిమాలు, హిందీ వెబ్ సిరీస్‌ల్లో నటించిన 26 ఏళ్ల హీరోయిన్‌ ఈ దందా నడుపుతున్నట్లు పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో అరెస్టు చేశారు. ఆ తర్వాత ఇందులో భాగమైన ఇద్దరు మహిళా ఆర్టిస్ట్‌లను పోలీసులు రక్షించారు.

Written By Harish Darla
Published: Sep 28, 2026, 03:56 PM IST | Updated: Sep 28, 2026, 04:01 PM IST
Join

Thane Actress Prostitution Arrest: ముంబైలోని థానే ప్రాంతంలో పోలీసులు హై-ప్రొఫైల్ వ్యభిచార ముఠా భగ్నం చేశారు. వాగ్లే ఎస్టేట్ పరిధిలో ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో మహిళలను వాణిజ్య లైంగిక కార్యకలాపాల కోసం తీసుకురావడానికి ప్రణాళిక జరుగుతోందని పోలీసుల మానవ అక్రమ రవాణా నిరోధక విభాగానికి (AHTC) ఖచ్చితమైన సమాచారం అందింది. దీంతో అధికారులు డీకాయ్ ఆపరేషన్ ద్వారా ఒక నకిలీ కస్టమర్‌ను రంగంలోకి దించి పక్కా వ్యూహంతో ఉచ్చు పన్నారు. ఒప్పందానికి అంగీకరించిన సదరు నటి, ఇద్దరు మహిళలతో కలిసి నిర్ణయించిన ప్రదేశానికి చేరుకోగానే వేచి ఉన్న పోలీస్ బృందం ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

పోలీసుల విచారణలో అరెస్టయిన ముంబైకి చెందిన 26 ఏళ్ల నటి 10 వెబ్ సిరీస్‌లు, 3 భోజ్‌పురి చిత్రాల్లో నటించినట్లు తేలింది. అయితే ఈ అక్రమ దందాలో భాగంగా ఒక్కో కస్టమర్ దగ్గర నుంచి దాదాపుగా రూ.25,000 వసూలు చేసినట్లు సమాచారం అందుతోంది. 

అయితే అలా వచ్చిన డబ్బులో 10,000 సంబంధిత మహిళకు ఇచ్చి, మిగిలిన రూ.15,000 మొత్తాన్ని తన కమీషన్‌గా సదరు నటి ఉంచుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. అయితే సినిమా పరిశ్రమలో సరైన అవకాశాలు లేకపోవడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ఈ  వ్యభిచారంలోకి అడుగుపెట్టినట్లు ఆ నటి వెల్లడించింది.

ముందుస్తు సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలం చేరుకొని నిందుతులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారి వద్ద ఉన్న నగదు, మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఇద్దరు మహిళలను పోలీసులు రక్షించగా.. వారిని పునారావసం నిమిత్తం ఆశ్రయ గృహానికి పంపి.. వారి వాంగ్మూలాలను కూడా పోలీసులు నమోదు చేస్తున్నారు.

ఈ అక్రమ వ్యభిచార ముఠాపై అనైతిక రవాణా నిరోధక చట్టం (PITA) కింద ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యభిచార ముఠా వెనుక ఇతర వ్యక్తుల ప్రమేయం లేదా ఏదైనా పెద్ద నెట్‌వర్క్ ఉందా అనే కోణంలో పోలీసులు సదరు నటి ఫోన్ కాల్ రికార్డులు, పరిచయాలు, ఆర్థిక లావాదేవీలను విస్తృతంగా పరిశీలిస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES