UCO బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు.. రూ. 16,650 స్టైపెండ్, దరఖాస్తులు ప్రారంభం!
యూకో బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 530 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 1961 అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం, 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఇతర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
UCO Bank Apprentice Recruitment 2026: నిరుద్యోగులకు ఇది ఒక శుభవార్త. బ్యాంక్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ఒక గొప్ప అవకాశం. యూకో బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం 530 అప్రెంటిస్ ఖాళీలను 1961 అప్రెంటిస్ యాక్ట్ కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 14, 2026 నుండి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్సైట్ https://www.uco.bank.in/en/ లో నోటిఫికేషన్ను చూసి, అక్టోబర్ 29వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఈ పోస్టుల ద్వారా ఎంపికైన అభ్యర్థులకు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఏడాది పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అవకాశం లభిస్తుంది. కావున, దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ రాష్ట్రాల వారీగా ఉన్న ఖాళీలు, వయోపరిమితి, అప్లికేషన్ ఫీజు, ఎంపిక విధానాన్ని పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోవాలి.
యూకో బ్యాంక్ ఈ 530 అప్రెంటిస్ ట్రైనింగ్ పోస్టులను అర్హత కలిగిన గ్రాడ్యుయేట్ అభ్యర్థుల కోసం ప్రకటించింది. ఇందులో ఎంపికైన వారికి నెలకు రూ. 16,650 లభిస్తుంది. ఎంపిక ప్రక్రియ విషయానికి వస్తే.. ఆన్లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, లాంగ్వేజ్ టెస్ట్, మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించిన తర్వాత అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించబడుతుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వారు నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. SC/ST అభ్యర్థులకు రూ. 200 + GST, జనరల్, BC మగ అభ్యర్థులకు రూ. 800 + GST, మహిళా అభ్యర్థులకు రూ. 600 + GST ఫీజుగా నిర్ణయించారు.
యూకో బ్యాంక్ దరఖాస్తు చేసుకునే విధానం:
యూకో బ్యాంక్ అధికారిక వెబ్సైట్ https://www.uco.bank.in/en/ను ఓపెన్ చేసి, అందులోని 'కెరియర్' సెక్షన్లో 'రిక్రూట్మెంట్' ఎంచుకోవాలి. అక్కడ 'ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ 1961' కనిపిస్తుంది, దానిపై ఉన్న 'అప్లై క్లిక్ ఫర్ ఆన్లైన్' అనే ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. అనంతరం మీ రిజిస్టర్ నంబర్ వివరాలతో లాగిన్ అవ్వండి. యూకో బ్యాంక్ 2026 ఆర్థిక సంవత్సరం కోసం సెర్చ్ చేసి 'అప్రెంటిస్షిప్' ఎంచుకోండి. అక్కడ మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేసి, ఫీజు చెల్లించండి. చివరగా అప్లికేషన్ను రివ్యూ చేసి సబ్మిట్ చేసిన తర్వాత, ప్రింట్ అవుట్ తీసి ఉంచుకోండి.