• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /చెల్లి చేసిన పనికి తండ్రి కీలక నిర్ణయం.. బతికుండగానే పిండ ప్రదానం, అసలు కథ ఇదే!

చెల్లి చేసిన పనికి తండ్రి కీలక నిర్ణయం.. బతికుండగానే పిండ ప్రదానం, అసలు కథ ఇదే!

Up Woman Marries Rakhi Brother: అన్నతో లేచిపోయిన చెల్లికి తండ్రి బ్రతికి ఉండగానే పిండ ప్రదానం చేశారు. అయితే, 15 ఏళ్ల పాటు రాఖీ కట్టిన అన్నతో ఇలా లేచిపోయి పెళ్లి చేసుకోవడంతో ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు ఈ ఘటన విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 03, 2026, 04:14 PM IST|Updated: Oct 03, 2026, 04:15 PM IST
joinshare
చెల్లి చేసిన పనికి తండ్రి కీలక నిర్ణయం.. బతికుండగానే పిండ ప్రదానం, అసలు కథ ఇదే!
Image Credit: జీ తెలుగు న్యూస్..

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
రూ.10,499కే HMD Vibe 2 5G ఫోన్‌.. దీపావళి స్పెషల్ ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు!

రూ.10,499కే HMD Vibe 2 5G ఫోన్‌.. దీపావళి స్పెషల్ ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు!

2

Assam Night Club Incident: నైట్‌క్లబ్‌లో యువతిపై బౌన్సర్ల దాడి..అమ్మాయిని నగ్నంగా నిలబెట్టి, పిడిగుద్దులతో...

3

Bathukamma 2026 Dates: ఈ నెల 10వ తేదీ నుంచి బతుకమ్మ వేడుకలు.. ఏర్పాట్ల వివరాలు ఇవే..!

4

శుక్రుడి తిరోగమనం.. ఈ 4 రాశులకు జాక్‌పాట్‌.. ఆగిపోయిన డబ్బులు చేతికి!

5

Shoaib Malik Vaneeza Sattar: నాలుగో పెళ్లికి రెడీ అయిన సానిమా మీర్జా మాజీ భర్త..44 ఏళ్ల వయసులో 31 ఏళ్ల హీరోయిన్‌తో షోయబ్ మాలిక్ లగ్గం!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Up Woman Marries Rakhi Brother: గత 15 ఏళ్లగా సోదరుడిగా భావించి రాఖీ కట్టిన యువకుడినే ఓ యువతి పెళ్లి చేసుకున్న విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ సమీప గ్రామంలో చోటు చేసుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. తమ రక్తసంబంధాన్ని, కుటుంబ గౌరవాన్ని మంటగలిపిందని ఆగ్రహంతో యువతి కుటుంబసభ్యులు ఆమెతో శాశ్వతంగా సంబంధాలు తెంచుకోవడమే కాకుండా.. బతికుండగానే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలోని ఓ గ్రామానికి సంబంధించిన నందినీ పాండే (20)తో పాటు అదే గ్రామానికి.. చెందిన శశ్వత్ గుప్తా (22) కొన్నేళ్లుగా ఒకరికొకరు బాగా తెలుసు.. శశ్వత్ తరచూ.. నందిని ఇంటికి వస్తూ ఉండేవాడు.. చిన్నప్పటి నుంచి అంటే దాదాపు 15 సంవత్సరాలుగా నందిని అతడిని సోదరుడిగా భావించి.. ప్రతి రాఖీ పండగకి.. రాఖీ కట్టేదని కుటుంబ సభ్యులు తెలిపారు.. అయితే, సెప్టెంబర్ 20న వీరిద్దరూ అకస్మాత్తుగా ఇళ్ల నుంచి జంప్‌ అయి వివాహం చేసుకున్నారట..

అయితే, వీరి ఈ పెళ్లి విషయం తెలిసిన వెంటనే నందిని కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలుస్తోంది.. సోదరుడిగా భావించిన వ్యక్తితోనే పెళ్లి కావడంతో ఆ యువతి తండ్రి తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. సమాజంలో తమ పరువు పోయిందని.. ఇకపై ఆమె తమకు కూతురు కాదని వెల్లడించారు.. హిందూ సంప్రదాయం ప్రకారం... ఆమెకు అంతిమ సంస్కారాలు కూడా ఇటీవలే నిర్వహించారు. ఆమె తమకు చనిపోయిందని అందిరితో చెప్పారట.. అంతేకాకుండా, శశ్వత్ తమ కుమార్తెను మాయమాటలతో బురిడీ కొట్టించాడని.. ఇంట్లో ఉన్న దాదాపు రూ.2 లక్షల డబ్బులను తీసుకుని వెళ్లారని ఈ సమయంలో బంధువులు ఆరోపించారు..

కుటుంబ సభ్యుల ఒత్తిడితో నందిని సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేసి స్పందించింది.. వారిద్దరూ పరస్పర అంగీకారంతో.. ప్రేమించే పెళ్లి చేసుకున్నారని.. ఆమె ఆ వీడియోలో స్పష్టం చేసింది. అంతేకాకుండా తాను ఇంట్లో నుంచి ఎంలాంటి డబ్బులు తీసుకువెళ్లలేదని.. చెబుతూ వారి తండ్రి ఆరోపణలను ఖండించింది. ఇంట్లో తనపై శారీరక, మానసిక వేధింపులు ఎక్కువయ్యాయని.. అందుకే ఇల్లు వీడాల్సి వచ్చిందని వీడియోలో తెలిపింది.. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News
Viral News