• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /పదేళ్లుగా పెంచుకున్న చిలుక మిస్సింగ్.. ఆచూకీ చెబితే రూ.11 వేలు గిఫ్ట్‌!

పదేళ్లుగా పెంచుకున్న చిలుక మిస్సింగ్.. ఆచూకీ చెబితే రూ.11 వేలు గిఫ్ట్‌!

Missing Parrot Viral News: చిలుక ఉన్నట్టుండి తప్పిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా బాధపడుతున్నారట. అంతేకాకుండా తమ చిలుకను వెతికి పెట్టిన వారికి దాదాపు రూ.11 వేల వరకు నగదు బహుమహి కూడా ప్రకటించారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది.? దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 24, 2026, 16:22 IST|Updated: Nov 24, 2026, 16:37 IST
joinshare
పదేళ్లుగా పెంచుకున్న చిలుక మిస్సింగ్.. ఆచూకీ చెబితే రూ.11 వేలు గిఫ్ట్‌!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ కావాలా? టికెట్ బుక్ చేసే ముందు ఈ 4 సెట్టింగ్స్ మార్చండి.. కన్ఫామ్‌గా వస్తుంది!

రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ కావాలా? టికెట్ బుక్ చేసే ముందు ఈ 4 సెట్టింగ్స్ మార్చండి.. కన్ఫామ్‌గా వస్తుంది!

2

Karnataka: బెంగళూరులో ఘోరం.. లాడ్జీలో ప్రియుడితో గొడవ.. మూడో అంతస్తునుంచి పడి యువతి మృతి..

3

ఆడేవడన్న.. ఈడేవడన్న.. వైభవ్ సూర్యవంశీకి అడ్డవేడన్న.. 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ..!

4

Vaibhav Sooryavanshi: బుడ్డోడు చితక్కొట్టాడు.. 28 బంతుల్లోనే సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డు..!

5

Road Accident: ఏపీలో ఘోర ప్రమాదాలు- 8 మంది మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Missing Parrot Viral News: పెంపుడు జంతువులు లేదా పక్షులు మనతో కొన్ని రోజులు ఉంటేనే వాటితో మనకు విడదీయరాని అనుబంధం ఏర్పడడం చాలా సహజం.. అలాంటిది ఏకంగా పదేళ్ల పాటు ఒకే చోట కుటుంబంలో ఒకరై ఉన్న చిలుక అకస్మాత్తుగా కనిపించకుండా పోతే.. ఆ ఇంటివారి బాధ వర్ణనాతీతం.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది.. తమ ముద్దుల చిలుక అలెక్స్‌ను వెతికి తెచ్చిన వారికి రూ.11 వేల గిఫ్ట్‌ ఇస్తామని ఆ కుటుంబం ప్రకటించడం ఇప్పుడు ఈ ఘనట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది..

వారణాసిలోని దారా నగర్‌కి చెందిన అరవింద్ మౌర్య కుటుంబం పదేళ్ల క్రితం ఓ చిలుకను ఎంతో ఇష్టంగా తెచ్చుకుందట... దానికి అలెక్స్‌ అని పేరు పెట్టి కన్నబిడ్డలా పెంచుకున్నారట.. పదేళ్లుగా ఆ ఇంట్లో అందరితో కలిసిపోయిన అలెక్స్.. తన కిలకిల సందడితో.. అల్లరి చేష్టలతో ఆ ఇంటికి కొత్త కళను తెచ్చిందట.. అయితే, నవంబర్ 16వ తేదీన ఆ కుటుంబం నుంచి చిలుక దూరమైంది.. ఆ రోజు ఇంట్లో టైల్స్ వేసే పనులు జరుగుతున్నాయట.. టైల్స్ కట్ చేసే మిషన్ నుంచి వచ్చిన భారీ శబ్దానికి అలెక్స్ తీవ్ర భయాందోళనకు గురైందట.. ఆ కంగారులో పంజరం నుంచి బయటకు వచ్చి.. ఆకాశంలోకి ఎగిరిపోయింది.

అలెక్స్ కనిపించకపోవడంతో అరవింద్ మౌర్య కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారట.. చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు, ఇరుగుపొరుగు ఇళ్లలో వెతికినా ఏమాత్రం ఫలితం లేకపోయిందట.. దీంతో వారు ఎలాగైనా ఆ చిలుకను కావాలనుకుని నిర్ణయించుకున్నారు. అలెక్స్ మిస్‌ అని ఫోటోలతో ఉన్న పోస్టర్లను ప్రింట్‌ చేశారట.. అరవింద్ మౌర్య.. ఆయన కుమారులు వారణాసిలోని గల్లీలలో ఈ పోస్టర్లను అంటిస్తున్నారట. అలెక్స్‌ను సురక్షితంగా తీసుకొచ్చి అప్పగించిన వారికి రూ.11,000 డబ్బులు గిఫ్ట్‌ ఇస్తామని పోస్టర్లలో తెలిపారు.

ఈ ఘటనలో అందరినీ కదిలిస్తున్న మరో విషయం ఆ ఇంట్లోని పెంపుడు కుక్క పరిస్థితి.. పదేళ్లుగా అలెక్స్, ఆ కుక్క ఎంతో స్నేహంగా మెలిగేవి.. రోజంతా ఇద్దరూ కలిసి ఆడుకునేవట.. ఇప్పుడు అలెక్స్ కనిపించకపోవడంతో ఆ మూగజీవి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతుందట. బెంగతో సరిగ్గా ఆహారం తీసుకోకుండా.. ఆటలు మానేసి దిగాలుగా కూర్చుంటోందని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. తమ కుటుంబంలోని ఆనందాన్ని తిరిగి తీసుకురావడానికి ఆ చిలుకను వెతికి పెట్టాలని ఆ కుటుంబ సభ్యులు కన్నీటితో వేడుకుంటోంది..

 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Telugu News
Viral News