SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

నవంబర్ 25న భారత్‌లోకి Vivo కొత్త ఫోన్లు.. 200MP కెమెరా, 7800mAh బ్యాటరీతో అదుర్స్‌!

Vivo X500 Series India Launch: భారత మార్కెట్‌లోకి వివో ఎక్స్500 సిరీస్‌ విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ మోస్ట్ పవర్‌ఫుల్‌ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో పాటు కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్‌ ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 05, 2026, 01:05 PM IST | Updated: Nov 05, 2026, 01:06 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Vivo X500 Series India Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ Vivo తమ అద్భుతమైన ఫ్లాగ్‌షిప్ లైనప్ వివో ఎక్స్500 సిరీస్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్‌ అయి.. సంచలనం సృష్టించిన ఈ సిరీస్‌ను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు అన్ని సిద్ధం చేసుకుంది. అంతేకాకుండా ఈ సిరీస్‌కు సంబంధించిన అధికార విడుదల తేది కూడా అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రముఖ టెక్ టిప్‌స్టర్ ప్యాషనేట్ గీక్జ్ అందించిన సమాచారం ప్రకారం.. ఇప్పటికే భారత్‌లోని కొన్ని ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో ఈ సరికొత్త సిరీస్ కోసం ప్రీ-బుకింగ్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయట.. అయితే, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఇవి ఎప్పుడు ప్రారంభమవుతాయి.. అలాగే కస్టమర్లు ముందస్తు టోకెన్ అమౌంట్ ఏమైనా చెల్లించాల్సి ఉంటుందా? అనే అంశాలపై ఇంకా అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. కంపెనీ అధికారిక ప్రకటన చేయకముందే.. మార్కెట్‌లోకి ఈ సిరీస్‌కి ఇప్పటికే కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది..

ఈ సిరీస్‌లో భాగంగా కంపెనీ మూడు వేరియంట్లను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. వివో ఎక్స్500, వివో ఎక్స్500 ప్రోతో పాటు వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. వీటికి సంబంధించిన మోడల్ నంబర్లు కూడా ఇటీవలే అందుబాటులోకి రావడం విశేషం.. ఇవి V2619, V2621తో పాటు V2610 మోడల్‌ నెంబర్స్‌తో బ్యూరో (BIS) సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రావడం విశేషం.. టెక్ టిప్‌స్టర్ దేబయన్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. కంపెనీ ఈ లైనప్‌ను నవంబర్ 25న దేశీయ మార్కెట్లోకి అధికారికంగా లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఫీచర్స్‌ వివరాలు ఇవే..
వివో ఎక్స్500 స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది 6.59 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు మీడియాటెక్ డైమెన్సిటీ 9600M ప్రాసెసర్‌తో లాంచ్‌ కాబోతోంది. బ్యాక్‌ సెటప్‌లో 50MP మెయిన్ కెమెరాతో పాటు 50MP అల్ట్రా-వైడ్, 64MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా  90W వైర్డ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఎంతో అద్భుతమైన 7,500mAh భారీ బ్యాటరీని కలిగి ఉండడం విశేషం..

వివో ఎక్స్500 ప్రో స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇది ఎంతో అద్భుతమైన 6.36 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్ల్పేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో చిప్‌సెట్ ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇది 3.5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేసే మోస్ట్ పవర్‌ఫుల్ 64MP పెరిస్కోప్ లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే 6,510mAh బ్యాటరీతో లభించబోతోంది..

వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్స్‌ స్పెషిఫికేషన్స్‌కి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇది 6.85 అంగుళాల 2K అమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. అలాగే దీని డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తోంది. దీనిని కంపెనీ డైమెన్సిటీ 9600 ప్రో ప్రాసెసర్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. దీనిలో కంపెనీ మోస్ట్ పవర్‌ఫుల్ 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో పాటు ఏకంగా 7,800mAh బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు సమాచారం..

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES