చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డ్ ఏమవుతుంది? UIDAI ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే!
ఆధార్ కార్డు ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉండటమే కాకుండా, అప్‌డేటెడ్‌గా ఉండటం కూడా చాలా అవసరం. అయితే, మరణించిన వ్యక్తుల ఆధార్ కార్డుల పరిస్థితి ఏమిటి? అవి ఏమవుతాయి? ఏదైనా మోసపూరిత వ్యవహారం జరగకముందే ఈ ముఖ్యమైన విషయం తెలుసుకోవాలని ట్విట్టర్ వేదికగా యూఐడీఏఐ సూచించింది. ఆ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Aadhaar Card New Update: మన దేశంలో ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డు. ప్రతి ఒక్కరికీ దీనిని జారీ చేస్తారు. ఆధార్ కార్డుపై ఉండే ఫోన్ నంబర్, అడ్రస్, బ్యాంకు వివరాలను కచ్చితంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండాలి. మరి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారి ఆధార్ కార్డు ఏమవుతుంది? అది ఆటోమేటిక్‌గా క్యాన్సల్ అవుతుందా? అసలు ఏం జరుగుతుంది? కుటుంబ సభ్యులు తెలుసుకోవాల్సిన విషయాలేమిటి? అనే అంశాలపై UIDAI ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేసింది. ఆధార్ కార్డుదారుడు మరణించినప్పుడు, ఆ కార్డు మోసపూరిత వ్యక్తుల చేతికి చిక్కకుండా కుటుంబ సభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి UIDAI వివరించింది.
ఆధార్ కార్డుదారుడు చనిపోతే ఏం చేయాలో UIDAI ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. UIDAI కొత్తగా ఒక ఫెసిలిటీని తీసుకువచ్చింది. దీని ప్రకారం 'రిపోర్ట్ డెత్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మెంబర్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సర్వీస్ మై ఆధార్ పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది. దీని ప్రధాన లక్ష్యం ఏమిటంటే, ఆధార్ కార్డును దుర్వినియోగం చేయకుండా, KYC సంబంధిత మోసాలు జరగకుండా చూడటం. కుటుంబ సభ్యులు చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్‌ను అటాచ్ చేసి, వెంటనే రిక్వెస్ట్ ద్వారా వారి ఆధార్ కార్డును డియాక్టివేట్ చేయవచ్చు.
సాధారణంగా ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు, పాన్ కార్డు, LPG కనెక్షన్, పెన్షన్ వంటి వాటికి లింక్ అయి ఉంటాయి. కాబట్టి, వ్యక్తి మరణించిన వెంటనే ఆధార్‌ను డియాక్టివేట్ చేయించాలి. మోసపూరిత వ్యక్తుల చేతికి చిక్కకముందే ఈ కీలక నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. కుటుంబ సభ్యులు దీనిని డియాక్టివేట్ చేయడం ద్వారా ఆర్థికంగా మోసపోకుండా జాగ్రత్త పడవచ్చు.
UIDAI ఆన్‌లైన్ ప్రక్రియ..
చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డును డియాక్టివేట్ చేయాలంటే, మొదటగా 'మై ఆధార్' పోర్టల్‌లో వివరాలతో లాగిన్ అవ్వాలి.
ఆధార్ నంబర్‌కు వచ్చే OTPని ఉపయోగించి, సర్వీసెస్ విభాగంలోకి వెళ్లి 'రిపోర్ట్ డెత్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మెంబర్' పై క్లిక్ చేయాలి.
అక్కడ మరణించిన వ్యక్తి ఆధార్ నంబర్, పేరు, పుట్టిన తేదీ ఇతర వివరాలతో పాటు డెత్ సర్టిఫికేట్ నంబర్‌ను కూడా నమోదు చేయాలి.
ఆ తర్వాత బయోమెట్రిక్ లేదా OTP ద్వారా వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆధార్ డేటా ఇప్పటికే డెత్ సర్టిఫికేట్‌తో లింక్ అయి ఉండటం వల్ల ఈ ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది.
సంబంధిత డాక్యుమెంట్లు సబ్మిట్ చేసిన 90 రోజుల్లో ఈ ప్రక్రియ ముగుస్తుంది. అనంతరం మై ఆధార్ పోర్టల్ ద్వారా డియాక్టివేషన్ స్టేటస్‌ను కూడా చెక్ చేసుకోవచ్చు.
మీ ఆధార్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి రికార్డులు అప్‌డేట్ అయ్యాయో లేదో కూడా తెలుసుకోవచ్చు.
Read Also: EPFO అత్యవసర సెక్యూరిటీ అలర్ట్! ఈ 4 వివరాలు ఎవరికీ చెప్పకండి.. ఖాతా ఖాళీ అవుతుంది!