• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /దసరా రోజు రావణుడిని దహనం చేయరు.. దేవుడిలా పూజించే ఆ గ్రామాలు ఏవో తెలుసా?

దసరా రోజు రావణుడిని దహనం చేయరు.. దేవుడిలా పూజించే ఆ గ్రామాలు ఏవో తెలుసా?

Ravana Worship In India: దసరా రోజు భారతదేశ వ్యాప్తంగా అందరూ రావణ దిష్టిబొమ్మను బాణాసంచాల వెలుగులో దహనం చేస్తుంటే.. కానీ కొన్ని గ్రామాల్లో దీనిని కీడుగా భావించి.. రావణుడిని దేవుడిగా పరిగణిస్తూ ఉంటారు. అసలు ఆ గ్రామాలు ఏవి? ఈ వింత ఆచారం పాటించడానికి గల కారణాలేంటి? దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 19, 2026, 10:12 AM IST|Updated: Oct 19, 2026, 10:14 AM IST
joinshare
దసరా రోజు రావణుడిని దహనం చేయరు.. దేవుడిలా పూజించే ఆ గ్రామాలు ఏవో తెలుసా?
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
దేశంలో ఎక్కడా లేని ఆచారం.. విజయదశమి రోజున రావణుడికి హోమం చేసే గ్రామం ఇదే!

దేశంలో ఎక్కడా లేని ఆచారం.. విజయదశమి రోజున రావణుడికి హోమం చేసే గ్రామం ఇదే!

2

దసరా రోజున పాలపిట్టను ఎందుకు చూడాలి? శివుడితో సంబంధం ఏంటి?

3

హైబీపీ సైలెంట్ కిల్లర్.. ఈ లక్షణాలు ఉంటే మీ రక్తపోటు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లే!

4

దసరా రోజు రావణుడిని దహనం చేయరు.. దేవుడిలా పూజించే ఆ గ్రామాలు ఏవో తెలుసా?

5

రాజమౌళిపై గుస్సా అవుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్.. జక్కన్న నోరు విప్పవయ్యా..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ravana Worship In India Telugu News: దేశవ్యాప్తంగా దసరా పండగ వచ్చిందంటే చాలు.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతి గ్రామ గ్రామాన రావణ దిష్టిబొమ్మలను బాణాసంచా వెలుగుల్లో దహనం చేస్తూ ఉంటారు.. రాముడి విజయ నామస్మరణతో పల్లెతోపాటు పట్టణాలు మారుమోగిపోతూ ఉంటాయి.. కానీ ఉత్తర భారత దేశంలోని కొన్ని గ్రామాల్లో మాత్రం ఆరోజు వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది.  బాణాసంచా చెప్పులు వినిపించవు. ఎలాంటి సంబరాలు అసలు కనిపించవు.. పైగా దశకంటుడిని దైవంగా పూజిస్తూ.. ఆయన మృతిని తలుచుకొని ప్రజలు శోకసముద్రంలో మునిగిపోతూ ఉంటారు.. ఇంతకీ ఆ గ్రామం ఏంటి? ఆయనను పూజించడానికి గల కారణాలేంటి? అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

రాజస్థాన్లోని జోధ్పూర్ సమీపంలో ఉన్న మండోరా గ్రామం రావణాసురుడు భార్య మండోదరి పుట్టిన ఊరు అని స్థానికుల విశ్వాసం.. ఈ గ్రామ ప్రజలు రావణుడిని.. సాక్షాత్తు తమ ఇంటి అల్లుడుగా భావిస్తూ ఉంటారట.. భారతీయ భారతీయ సాంప్రదాయం ప్రకారం అల్లుడికి అత్యున్నత గౌరవం అందిస్తూ ఉంటారు కాబట్టి. ఆయన మరణాన్ని వారు పండగల జరుపుకునేందుకు పెద్దగా ఇష్టపడరట.. అంతేకాకుండా ఆయన మరణాన్ని వారు కీడుగా కూడా చెప్పుకుంటారట.. అందుకే దసరా రోజు ఇక్కడ రావణ దహనం ఉండదు.. ఆరోజు గ్రామంలోని ముద్దుగల్ గోత్ర బ్రాహ్మణులు ప్రత్యేకంగా స్నానాలు ఆచరించి.. రావణుడి ఆత్మశాంతి కోసం పిండ ప్రధాన లతో పాటు కర్మలు చేయడం వంటివి నిర్వహిస్తూ వస్తారు..

మరోవైపు ఉత్తరా ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా పరిధిలో బిస్రఖ్ గ్రామంలో వింత ఆచారం కొనసాగుతూ వస్తోంది.. రావణాసురుడి జన్మస్థలంగా ప్రసిద్ధి పొందిన ఈ గ్రామంలో కూడా వింత వింత దసరా ఆచారం ఉంటుంది. రావణుడి తండ్రి విశ్రవసు మహర్షి పేరు మీదుగానే ఈ గ్రామానికి ఆ పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు.. ఇక్కడి ప్రజలు రావణాసురుడిని పరమ శివ భక్తుడిగా చెప్పుకుంటారు. అంతేకాకుండా ఇక్కడ ఆయనను దేవుడిగా ఆరాధిస్తూ వస్తారు. ఈ గ్రామంలో రావణుడికి అంకితం చేసిన ప్రాచీన ఆలయం సైతం ఉందట.. ఇక్కడ దసరా రోజు ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారట..

విజయదశమి రోజు దేశమంతా మిఠాయిలు పంచుకుంటూ ఆనందంతో మునిగి తేలితే.. ఈ ప్రాంతంలో మాత్రం పోయి వెలగకుండా ఉంటుందట. ఇళ్లలో ఎలాంటి పిండివంటలు చేసుకోకుండా కన్నీటితో తమ ఆరాధ్యుడికి వీడ్కోలు పలుకుతూ ఉంటారట.. రావణుడు చేసిన తప్పులను పక్కన పెడితే.. ఆలయంలోని పాండిత్యం, శివ భక్తి తమకు ఆదర్శమని ఇక్కడ స్థానికులు చెబుతూ ఉన్నారు.. వేల సంవత్సరాలుగా వస్తున్న ఈ సాంప్రదాయం, భారతీయ సాంస్కృతిలో దాగివున్న అద్భుతమైన వైవిధ్యమని వారి చెబుతూ వస్తున్నారు..

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News