• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /రాజమౌళిపై గుస్సా అవుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్.. జక్కన్న నోరు విప్పవయ్యా..!!

రాజమౌళిపై గుస్సా అవుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్.. జక్కన్న నోరు విప్పవయ్యా..!!

Rajamouli No Updates on Varanasi: అవును రాజమౌళి పై మహేష్ బాబు అభిమానులు రగిలిపోతున్నారు. మిగిలిన దర్శకులు ఏదైనా వేడుక వస్తే తమ సినిమా నుంచి టీజరో, ట్రైలరో విడుదల చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతుంటారు. కానీ 'వారణాసి' సినిమా నుంచి అసలు అప్‌డేట్సే రావట్లేదు. గతేడాది వచ్చిన కాన్సెప్ట్ టీజర్ తప్ప మరే విజువల్ ఇవ్వకూడదని జక్కన్న ముందుగానే ఏమైనా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. కనీసం బర్త్ డేలకైనా సర్ప్రైజ్‌లు ఇవ్వకుండా, ప్రమోషన్స్ కోసం ఆయన ఏదైనా సపరేట్ ముహూర్తం సెట్ చేశారా ..మొత్తంగా మహేష్ బాబు ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్న జక్కన్న ముందున్న ప్లాన్స్ ఏంటి..?

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 19, 2026, 10:03 AM IST|Updated: Oct 19, 2026, 10:04 AM IST
joinshare
రాజమౌళిపై గుస్సా అవుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్.. జక్కన్న నోరు విప్పవయ్యా..!!
Image Credit: Varanasi no Iupdate (File/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
దేశంలో ఎక్కడా లేని ఆచారం.. విజయదశమి రోజున రావణుడికి హోమం చేసే గ్రామం ఇదే!

దేశంలో ఎక్కడా లేని ఆచారం.. విజయదశమి రోజున రావణుడికి హోమం చేసే గ్రామం ఇదే!

2

దసరా రోజున పాలపిట్టను ఎందుకు చూడాలి? శివుడితో సంబంధం ఏంటి?

3

హైబీపీ సైలెంట్ కిల్లర్.. ఈ లక్షణాలు ఉంటే మీ రక్తపోటు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లే!

4

దసరా రోజు రావణుడిని దహనం చేయరు.. దేవుడిలా పూజించే ఆ గ్రామాలు ఏవో తెలుసా?

5

రాజమౌళిపై గుస్సా అవుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్.. జక్కన్న నోరు విప్పవయ్యా..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mahesh Babu Fans Angry on Rajamouli: ఈ నెల అక్టోబర్ 10న రాజమౌళి బర్త్ డేకు వారణాసి నుంచి ఏదైనా అప్‌డేట్ వస్తుందని మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు అభిమానులు. కానీ ఏం రాలేదు.  అంతకు ముందు మహేష్ బాబు పుట్టినరోజైన ఆగష్టు 9న తేదిన కూడా రెండు పోస్టర్స్‌తో ఏదో సరిపెట్టుకోమన్నారు.  గతేడాది నవంబర్ 19న ఇచ్చిన కాన్సెప్ట్ టీజర్ తర్వాత మేకర్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. మధ్యలో షూటింగ్ గురించి వార్తలు వస్తున్నాయి.  ఫ్యాన్స్‌కు మాత్రం విజువల్ ట్రీట్ దక్కలేదనే చెప్పాలి.  

అక్టోబర్ 10న రాజమౌళి పుట్టినరోజును కూడా వితౌట్ అప్‌డేట్ లాగించేసారు మేకర్స్. మహేష్‌ బర్త్‌డేకైనా కనీసం పోస్టర్స్ అయినా ఇచ్చారు కానీ.. జక్కన్న పుట్టినరోజుకు మాత్రం అది కూడా లేదు. వారణాసి కోసం ఏం చేసినా చాలా స్పెషల్‌గా ప్లాన్ చేయాలనే ఉద్దేశ్యంతోనే.. ఆయన ఇలా పుట్టినరోజులను వాడుకోవడం లేదు. షూటింగ్ మాత్రం చివరిదశకు వచ్చేసింది.

షూటింగ్ మొత్తం పూర్తైన తర్వాతే.. ప్రమోషనల్ ఈవెంట్స్‌ను ఒక్కొక్కటిగా స్టార్ట్ చేయాలని రాజమౌళి పక్కా స్కెచ్ వేశారు. వచ్చే నవంబర్ నాటికి సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి, ఆ తర్వాత జనవరి నుంచి ప్రమోషన్స్‌ను పీక్స్‌కు తీసుకువెళ్లేలా టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ముందే ప్రకటించినట్లుగానే ఎట్టి పరిస్థితుల్లోనూ 7 ఏప్రిల్ 2027న వారణాసిని థియేటర్లలోకి తెచ్చేలా స్పీడ్‌గా వర్క్ నడుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల కోసం హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఐమాక్స్ స్క్రీన్స్‌ను రెడీ చేసే పనిలో పడ్డారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News