• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /బెంగాల్‌లో నవరాత్రుల్లో అమ్మవారికి చేపల కూర నైవేద్యం.. అసలు కథ ఇదేనా?

బెంగాల్‌లో నవరాత్రుల్లో అమ్మవారికి చేపల కూర నైవేద్యం.. అసలు కథ ఇదేనా?

Fish Offering During Durga Puja: బెంగాల్ లోని నవరాత్రుల్లో భాగంగా దుర్గామాతకు చేపల కూరతో నైవేద్యం సమర్పిస్తారట. ఈ సాంప్రదాయం కొన్ని వందల ఏళ్ల నుంచి వస్తోందట.. అప్పటినుంచి ఇప్పటివరకు అమ్మవారికి ఎంతో ఇష్టంగా భక్తులు చేపల కూర నైవేద్యాన్ని సమర్పించి భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు పాటిస్తారు.

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 17, 2026, 01:31 PM IST|Updated: Oct 17, 2026, 01:41 PM IST
joinshare
బెంగాల్‌లో నవరాత్రుల్లో అమ్మవారికి చేపల కూర నైవేద్యం.. అసలు కథ ఇదేనా?
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Rajasthan:  ఒకే అమ్మాయి కోసం ఇద్దరు మైనర్ల ఫైటింగ్.. రాజస్థాన్ లో కోచింగ్ సెంటర్ లో  కలకలం.. వీడియో..

Rajasthan: ఒకే అమ్మాయి కోసం ఇద్దరు మైనర్ల ఫైటింగ్.. రాజస్థాన్ లో కోచింగ్ సెంటర్ లో కలకలం.. వీడియో..

2

బెండకాయ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా? గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఏం చెబుతున్నారు?

3

పరగడుపున నీళ్లు తాగుతున్నారా? ఆయుర్వేదం ప్రకారం ఈ 5 అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు మానరు!

4

బ్యూటీ పార్లర్ పెట్టిన కోతులు.. ఒకదానికి మరొకటి మేకప్.. వీడియో!

5

బెంగాల్‌లో నవరాత్రుల్లో అమ్మవారికి చేపల కూర నైవేద్యం.. అసలు కథ ఇదేనా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Fish Offering During Durga Puja Telugu: దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. సాధారణంగా దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజులపాటు భక్తులు కఠినమైన ఉపవాసాలు ఉంటూ.. అమ్మవారికి పూర్తిగా శాకాహారం పిండివంటలు, పండ్లను ప్రసాదంగా సమర్పిస్తూ వస్తారు. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం ఎందుకు భిన్నంగా.. శతాబ్దాలుగా ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అక్కడ దుర్గామాత పూజల్లో భాగంగా రకరకాల చేపలను అత్యంత భక్తితో నైవేద్యంగా సమర్పిస్తారు.

దుర్గాదేవికి నివేదించే చేపల వంటకాల తయారీలో నిర్దిష్టమైన పద్ధతులను పాటిస్తూ వస్తారు.. అమ్మవారి నైవేద్యం కోసం తయారు చేసే చేపల కూరల్లో ఉల్లిపాయలతో పాటు వెల్లుల్లిని అస్సలు వినియోగించారట.. అంతేకాకుండా సాంప్రదాయ సుగంధ ద్రవ్యాలతో పాటు ఆవనూనె, అల్లం, పచ్చిమిర్చి వంటి సాత్విక పద్ధతికి దగ్గరగా ఉండే పదార్థాలతోనే ఈ చేపల కూర వండుతారు. పూజా నిబంధనల ప్రకారం ఎంతో నిష్టతో వంటచేసి దుర్గామాత విగ్రహం ఎదుట పవిత్రంగా సమర్పిస్తారట..

బెంగాలీ సాంస్కృతిలో చేపలకు అత్యున్నతమైన స్థానం ఉంటుంది. చేపలను కేవలం ఆహారంగా మాత్రమే కాకుండా శుభానికి, శ్రేయస్సుకు, దీర్ఘాయుష్షు కు సూచికగా భావిస్తూ ఉంటారట. శుభకార్యాలలోనూ.. ముఖ్యంగా పెళ్లిలోనూ, కొత్త పనుల్లో చేపలను చూడటాన్ని, వండతాన్ని మంగళప్రదంగా భావిస్తారట. అలాగే తాంత్రిక సాంప్రదాయాల ప్రకారం చేపలను సమర్పించడం అనేది ప్రకృతి పరిపూర్ణతకు నిదర్శనంగా చెబుతూ వస్తారు.. మాంసాహారాన్ని జీవిత సంపూర్ణతను వ్యక్తీకరించే ఒక సాధనంగా చూసే ఈ దృక్పథం వల్లే.. అమ్మవారికి పెట్టే నైవేద్యం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు..

బెంగాల్ ప్రజలు దుర్గాదేవిని కేవలం లోక రక్షక దేవతనే కాకుండా.. తమ కన్న కూతురు పుట్టింటికి వచ్చినంత ఆపేయాతగా చూసుకుంటారట.. కుమార్తె తమ ఇంటికి వచ్చినప్పుడు ఆమెకు ఇష్టమైన ఆహారాన్ని ఎంత ప్రేమతో వండి పెడతారో.. జగన్మాతకు కూడా తమ సాంస్కృతిలోని అత్యంత ప్రీతికరమైన చేపలను భక్తితో వండి పెడతారట.. దేశంలోని విభిన్న ప్రాంతాల్లో విభిన్నమైన ఆచారాలు ఉన్నప్పటికీ.. భగవంతుడి పట్ల భక్తితో పాటు ప్రేమానురాగాలు ఒకే తీరుగా ఉంటాయ్.. అనడానికి బెంగాల్ లో కొనసాగుతున్న ఈ సాంప్రదాయం ఒక అద్భుతమైన నిదర్శనంగా భావించవచ్చు..

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News