• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /బ్యూటీ పార్లర్ పెట్టిన కోతులు.. ఒకదానికి మరొకటి మేకప్.. వీడియో!

బ్యూటీ పార్లర్ పెట్టిన కోతులు.. ఒకదానికి మరొకటి మేకప్.. వీడియో!

Monkeys Makeup Video: తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో ఎంతగానో సోషల్ మీడియా వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో రెండు ఫన్నీ కోతులు ఒకదానికొకటి.. మేకప్ వేసుకుంటూ దర్శనమిచ్చాయి. అటుగా వెళుతున్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే విపరీతంగా వైరల్ అవుతుంది.

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 17, 2026, 01:37 PM IST|Updated: Oct 17, 2026, 01:39 PM IST
joinshare
బ్యూటీ పార్లర్ పెట్టిన కోతులు.. ఒకదానికి మరొకటి మేకప్.. వీడియో!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Rajasthan:  ఒకే అమ్మాయి కోసం ఇద్దరు మైనర్ల ఫైటింగ్.. రాజస్థాన్ లో కోచింగ్ సెంటర్ లో  కలకలం.. వీడియో..

Rajasthan: ఒకే అమ్మాయి కోసం ఇద్దరు మైనర్ల ఫైటింగ్.. రాజస్థాన్ లో కోచింగ్ సెంటర్ లో కలకలం.. వీడియో..

2

బెండకాయ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా? గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఏం చెబుతున్నారు?

3

పరగడుపున నీళ్లు తాగుతున్నారా? ఆయుర్వేదం ప్రకారం ఈ 5 అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు మానరు!

4

బ్యూటీ పార్లర్ పెట్టిన కోతులు.. ఒకదానికి మరొకటి మేకప్.. వీడియో!

5

బెంగాల్‌లో నవరాత్రుల్లో అమ్మవారికి చేపల కూర నైవేద్యం.. అసలు కథ ఇదేనా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Monkeys Makeup Video Watch: సాధారణంగా జంతువులు చేసే వింత చేష్టలతో పాటు కొన్ని అమాయకపు పనులు సోషల్ మీడియాలో నిత్యం ఎంతగానో వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా కోతులు మనుషులు చేసే పనులను అనుసరించడంలో ఎప్పుడు ముందుంటాయి.. అయితే, తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఓ వీడియో నేటిజెన్లను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తోంది. రోడ్డుపై ఎవరో పడేసిన మేకప్ బాక్స్ ను పట్టుకున్న రెండు కోతులు. ఏదో బ్యూటీ పార్లర్లో ప్రొఫెషనల్ బ్యూటీషియన్ల లాగే ఒకదానికొకటి ఎంతో శ్రద్ధగా మేకప్ వేసుకోవడం మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తున్నాయి. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.

రోడ్డు పక్కన పడి ఉన్న ఒక మేకప్ కిట్ గమనించిన రెండు కోతులు దాని దగ్గరికి వెళ్ళాయి. ఆ బాక్స్ ను తెరిచి అందులో ఉన్న వస్తువులను పట్టుకున్నాయి. అక్కడితో ఆగకుండా అందులో బ్యూటీ బ్రష్లను ఆ రెండు కోతులు చేతుల్లోకి తీసుకున్నాయి. ఓ కోతి డ్రెస్ తో పౌడర్ అద్దుకొని.. పక్కనే కూర్చున్న మరో కోతి ముఖంపై పూయడం మీరు చూడొచ్చు. ఆ తర్వాత రెండో కోతి కూడా బ్రష్ ను అందుకొని మొదటి దానికి కూడా అంతే ముద్దుగా మేకప్ వేయడం ఈ వీడియోలో మీరు గమనించవచ్చు. అవి రెండు మనుషులు మేకప్ ఎలా వేసుకుంటారు చూసి అనుసరిస్తున్న తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసేలా చేశాయి..

అయితే, అదే మార్గం గుండా కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఈ అరుదైన దృశ్యాలను తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు. ఆ తర్వాత ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధికాస్త వైరల్ గా మారింది. ఈ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ వైరల్ అవుతూనే వస్తోంది. సోషల్ మీడియాలో నైతే ఈ వీడియో ట్రెండింగ్‌గా కూడా మారింది. ఈ వీడియో చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు పెడుతూ వస్తున్నారు.

ఏదో సెలూన్ లేదా బ్యూటీ పార్లర్ ఓపెన్ చేసినట్లున్నాయి.. కొంతమంది కామెంట్లు పెడుతుంటే.. మనుషుల కంటే వీటికి ఫ్యాషన్స్ ఎక్కువగా ఉన్నట్లుందని మరికొంతమంది మహిళలు కామెంట్లు పెడుతూ వస్తున్నారు. మరికొంతమంది ఫ్రెండ్షిప్ గోల్స్ అంటే ఇవే అంటూ సరదాగా కామెంట్లు రాస్కొస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ అందరిని నవ్వుకునేలా చేసింది.

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Alexander kong (@matthkong)

 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Telugu News
Viral News