Uttar Pradesh: యూపీలో ఘోరం.. నిద్రలో ఉన్న భర్త ప్రైవేటు పార్ట్‌ను కట్ చేసిన భార్య.. అసలు విషయం ఇదే..
Wife cuts husband private part in Up: ఏడేళ్ల క్రితం నదీమ్ అనే వ్యక్తికి షబ్నమ్ అనే మహిళతో వివాహం అయ్యింది. ఈ క్రమంలో పెళ్లయి ఏడేళ్లు అయినా వీరికి పిల్లలు పుట్టలేదు. కొంతకాలం నుంచి భార్య ఫోన్‌లో మరొకరితో మాట్లాడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. యూపీలో చోటు చేసుకున్న ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారింది.
Wife cuts husband private part with knife in meerut: సమాజంలో కొంత మంది భార్యభర్తలు వివాహబంధానికి ఉన్న పవిత్రతను దిగజారుస్తున్నారు. చక్కగా పెళ్లిళ్లు చేసుకుని అన్యోన్యంగా కాపురం చేసుకొకుండా ఎఫైర్ లు పెట్టుకుని కట్టుకున్న వారిని కాటికి పంపుతున్నారు. చిన్నచిన్న కారణాలతో విడాకులు తీసుకొవడం, కట్టుకున్న వారిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక పిల్లలు పుట్టకుంటే కొంత మంది మరీ వైలెంట్ గా మారుతున్నారు. ఈ క్రమంలో యూపీలోని మీరట్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్ మీరట్‌లోని లిసారి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడేళ్ల క్రితం నదీమ్ అనే వ్యక్తికి షబ్నమ్ అనే మహిళతో వివాహం అయ్యింది. అయితే ఈ దంపతులకు మాత్రం పిల్లలు లేరు. దీంతో కొంతకాలం నుంచి భార్య ఫోన్‌లో మరొకరితో మాట్లాడుతోందని, సీక్రెట్ యవ్వారం చేస్తుందని భర్త నదీమ్ కు తెలిసింది.
ఈ క్రమంలో భర్త నదీమ్ కు అతని భార్యకు మధ్య గొడవలు జరిగాయి. ఇక తన ప్రియుడితో ఉండలేనని భార్య షబ్నమ్.. భర్త గాఢ నిద్రలో ఉండగా తెల్లవారుజామున 2:30 గంటలకు తన ప్రైవేట్ పార్ట్‌ని కట్ చేయడంతో అతను లబో దిబో మన్నాడు.
వెంటనే ఇంట్లో వారు బాధితుడికి ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యూపీ పోలీసులు భార్య షబ్నమ్‌ను అరెస్ట్ చేశారు. మరోవైపు.. భర్త మరో పెళ్లికి సిద్ధమవుతున్నందుకే తాను ఈ పని చేశానని షబ్నమ్ ఆరోపణలు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.