• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Video Viral: వామ్మో.. నడి రోడ్డు మీద రెచ్చిపోయిన ఏనుగు.. బైకర్ పొట్టపై కాలు పెట్టి మరీ.. షాకింగ్ వీడియో..

Video Viral: వామ్మో.. నడి రోడ్డు మీద రెచ్చిపోయిన ఏనుగు.. బైకర్ పొట్టపై కాలు పెట్టి మరీ.. షాకింగ్ వీడియో..

Uttarakhand Elephant attacks video: డెహ్రాడూన్ జాలీ గ్రాంట్ విమానాశ్రయం సమీపంలో రోడ్డు దాటుతున్న అడవి ఏనుగు బుల్లెట్ పై ప్రయాణిస్తున్న వ్యక్తిపై దాడి చేసింది. దీంతో అతను రోడ్డు మీద పడిపోయాడు. వెంటనే ఏనుగు అతని మీద కాలు పెట్టి తొక్కుతూ చుక్కలు చూపించింది.

Written ByInamdar Paresh
Published: Nov 12, 2026, 12:42 PM IST|Updated: Nov 12, 2026, 12:48 PM IST
joinshare
Video Viral: వామ్మో.. నడి రోడ్డు మీద రెచ్చిపోయిన ఏనుగు.. బైకర్ పొట్టపై కాలు పెట్టి మరీ.. షాకింగ్ వీడియో..
Image Credit: wild elephant attacks uttarakhand video

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
AP Panchayat Election: సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం చేస్తే రూ.2 కోట్లు! ఏపీలో ఆఫర్ల వర్షం.. ఎక్కడంటే?

AP Panchayat Election: సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం చేస్తే రూ.2 కోట్లు! ఏపీలో ఆఫర్ల వర్షం.. ఎక్కడంటే?

2

India vs New Zealand Playing 11: నాలుగో వన్డేకు టీమిండియాలో భారీ మార్పులు.. ముగ్గురు ప్లేయర్లు ఎంట్రీ..!

3

ఇల్యూజరీ సుపీరియారిటీ: చుట్టూ ఉన్నవారి ఫేక్ పొగడ్తలను నమ్మితే జరిగేది ఇదే.. సింహం - తోడేళ్ల కథ...!!

4

Srikalahasti Temple: శ్రీకాళ హస్తి ఆలయంలో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడ్డ మంటలు.. అసలేం జరిగిందంటే..?

5

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Wild Elephant attacks on bullet motorcycle rider in dehradun: ఇటీవల అడవుల్లోని ఏనుగులు తరచుగా జనావాసాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా చిరుత పులులు, ఏనుగులు, పాములు, ఎలుగు బంట్లు రాత్రి పూట జనావాసాల్లోకి వచ్చి ప్రజలపై, పెంపుడు జంతువులపై  సైతం దాడులు చేసి చంపేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఇటీవల మరీ ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి.  అందుకే అడవులకు సమీపంలో ఉండే గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన్ లో చోటు చేసుకున్న ఒక ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.

 

देहरादून: जॉलीग्रांट एयरपोर्ट के पास हाथी ने बुलेट सवार युवक पर हमला किया, राहगीरों के शोर मचाने पर जंगल भागा। https://t.co/vO91lgAXrC

— Arjun Chaudharyy (@Arjun5chaudhary) November 12, 2026

 


ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జాలీ గ్రాంట్ విమానాశ్రయం సమీపంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ఒక భారీ ఏనుగు  ఒక్కసారిగా రెచ్చిపోయి బుల్లెట్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తిపై దాడి చేసింది. ఈ ఘటనతో షాక్ కు గురైన బైకర్ రోడ్డు మీద పడిపోయాడు. వెంటనే ఆ ఏనుగు బైకర్ ను కాలితో తొక్కుకుంటూ బీభత్సం చేసింది. అతగాడు బాధతో విలవిల్లాడిపోయాడు. ఆ మార్గంలో వెళ్తున్న వారు పెద్దగా అరుపులు పెట్టడం, హరన్ మోగించడంతో ఏనుగు బెదిరిపోయి అతడ్ని వదిలేసి అడవిలోకి  వెళ్లిపోయింది. దీంతో అప్పటికే తీవ్రంగా గాయపడిన బైకర్ ను స్థానికులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.  ఈ ఘటనను కొంత మంది వీడియో తీయడంతో అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు షాక్ కు గురౌతున్నారు. బ్రో వెంట్రుక వాసిలో బైటపడ్డావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది రాత్రిళ్లు అడవుల్లోని మార్గాల గుండా వెళ్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెబుతూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
National News
Telugu News