Video Viral: వామ్మో.. నడి రోడ్డు మీద రెచ్చిపోయిన ఏనుగు.. బైకర్ పొట్టపై కాలు పెట్టి మరీ.. షాకింగ్ వీడియో..
Uttarakhand Elephant attacks video: డెహ్రాడూన్ జాలీ గ్రాంట్ విమానాశ్రయం సమీపంలో రోడ్డు దాటుతున్న అడవి ఏనుగు బుల్లెట్ పై ప్రయాణిస్తున్న వ్యక్తిపై దాడి చేసింది. దీంతో అతను రోడ్డు మీద పడిపోయాడు. వెంటనే ఏనుగు అతని మీద కాలు పెట్టి తొక్కుతూ చుక్కలు చూపించింది.
Wild Elephant attacks on bullet motorcycle rider in dehradun: ఇటీవల అడవుల్లోని ఏనుగులు తరచుగా జనావాసాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా చిరుత పులులు, ఏనుగులు, పాములు, ఎలుగు బంట్లు రాత్రి పూట జనావాసాల్లోకి వచ్చి ప్రజలపై, పెంపుడు జంతువులపై సైతం దాడులు చేసి చంపేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఇటీవల మరీ ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. అందుకే అడవులకు సమీపంలో ఉండే గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన్ లో చోటు చేసుకున్న ఒక ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జాలీ గ్రాంట్ విమానాశ్రయం సమీపంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ఒక భారీ ఏనుగు ఒక్కసారిగా రెచ్చిపోయి బుల్లెట్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తిపై దాడి చేసింది. ఈ ఘటనతో షాక్ కు గురైన బైకర్ రోడ్డు మీద పడిపోయాడు. వెంటనే ఆ ఏనుగు బైకర్ ను కాలితో తొక్కుకుంటూ బీభత్సం చేసింది. అతగాడు బాధతో విలవిల్లాడిపోయాడు. ఆ మార్గంలో వెళ్తున్న వారు పెద్దగా అరుపులు పెట్టడం, హరన్ మోగించడంతో ఏనుగు బెదిరిపోయి అతడ్ని వదిలేసి అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో అప్పటికే తీవ్రంగా గాయపడిన బైకర్ ను స్థానికులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనను కొంత మంది వీడియో తీయడంతో అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు షాక్ కు గురౌతున్నారు. బ్రో వెంట్రుక వాసిలో బైటపడ్డావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది రాత్రిళ్లు అడవుల్లోని మార్గాల గుండా వెళ్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెబుతూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.