SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

గురువుల గొప్పతనాన్ని చాటే రోజు.. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం వెనుక ఉన్న అసలు నిజాలు!

World Teachers Day October 5: సమాజ వికాసానికి.. భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర అత్యంత కీలకమైంది. ప్రతి ఏటా అక్టోబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా.. అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంను ఘనంగా జరుపుకుంటారు.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Oct 05, 2026, 09:39 AM IST | Updated: Oct 05, 2026, 09:40 AM IST
Image Credit: World Teachers Day:
Join

World Teachers Day October 5: సమాజ వికాసానికి.. భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర అత్యంత కీలకమైంది. ప్రతి ఏటా అక్టోబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా.. అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంను ఘనంగా జరుపుకుంటారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు అందిస్తున్న విశేష సేవలను స్మరించుకునేందుకు..వారి హక్కులు.. బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు ఈ  రోజును ప్రత్యేకంగా కేటాయించారు.

యువతే..దేశభవిష్యత్తుకు ఆదారం. వారు సక్రమంగా ఉంటేనే సమాజం అన్ని విధాలా ముందడగు వేస్తుంది. వారిలోని సత్ప్రవర్తన.. మంచి ఆలోచనలు.. దేశం పట్ల భక్తి.. సమాజం..పెద్దలపట్ల గౌరవం.. అంకిత భావాలను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైంది. తరగతి గదిలో వారు తమ శిష్యులకు చదువుతోపాటు విలువలు, జ్నానంతో కూడిన జీవిత నైపుణ్యాలను అందిస్తారు. దీంతో ఎలాంటి సవాళ్లు అయినా సరే.. ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండేలా వారికి గురువులు సాయం చేస్తారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్రను గౌరవించుకునేందుకు ప్రతి ఏటా అక్టోబర్ 5వ తేదీన ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. దీన్ని అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అని కూడా పిలుస్తుంటారు. భవిష్యత్తు తరాలను అభివ్రుద్ధి చేయడంలో గురువుల క్రుషిని గుర్తించడంతోపాటు ఆ వ్రుత్తి గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం అనిచెప్పాలి.

ఐక్యరాజ్య సమితి 2030 నాటికి సాధించాలనుకుంటున్న 17 సుస్థిరాభివ్రుద్ధి లక్ష్యాల్లో నాలుగవది నాణ్యమైన విద్య. ఈమధ్యే ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ, సాంస్క్రుతిక సంస్థ విడుదల చేసిన గ్లోబల్ రిపోర్ట్ ఆన్ టీచర్స్ అడ్రెస్సింగ్ టీచర్స్ షార్టేజేస్ అనేది రిపోర్టు ప్రకారం 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 4.4కోట్ల ప్రాథమిక, మాధ్యమిక గురువుల లోటు ఉందని అంచనా వేసింది. మన దేశంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ జయంతి సందర్భంగా ఏటా సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తారు. చైనాలో ఏటా సెప్టెంబర్ 10వ తేదీన నిర్వహిస్తారు. 1951లో చైనీస్ టీచర్స్ అసోసియేషన్ స్థాపనకు గుర్తుగా ఈరోజును ఎంచుకున్నారు. 1985లో మొదటిసారి ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. రష్యాలో యునెస్కో తీర్మానించిన అక్టోబర్ 5వ తేదీనే ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తుంటారు.

ఐక్యరాజ్యసమితి .. యునెస్కో ఆధ్వర్యంలో ప్రపంచంలోని 100కి పైగా దేశాల్లో అక్టోబర్ 5న జరుపుకుంటారు. మారుతున్న డిజిటల్ యుగంలో విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడంతో పాటు నైతిక విలువలను నేర్పుతున్న ఉపాధ్యాయుల రక్షణ, గౌరవం.. సంక్షేమం కోసం ప్రభుత్వం.. సమాజం నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES