• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /దసరా సెలవులపై ఉపాధ్యాయులకు విద్యాశాఖ కీలక హెచ్చరిక.. ఆ 2 రోజులు డుమ్మా కొడితే 13 రోజులూ లీవ్ పడినట్లే..!!

దసరా సెలవులపై ఉపాధ్యాయులకు విద్యాశాఖ కీలక హెచ్చరిక.. ఆ 2 రోజులు డుమ్మా కొడితే 13 రోజులూ లీవ్ పడినట్లే..!!

Telangana Teachers Dasara Holidays: తెలంగాణలో అక్టోబర్ 10వ తేదీ నుంచి పాఠశాలలకు దసరా పండగ సెలవులు రాబోతున్నాయి. అక్టోబర్ 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మొత్తం 13 రోజులు ప్రభుత్వం అధికారికంగా ఈ సెలవులను ప్రకటించింది.

Reported ByBhoomiEdited ByBhoomi
Published: Oct 05, 2026, 10:44 AM IST|Updated: Oct 05, 2026, 10:45 AM IST
joinshare
దసరా సెలవులపై ఉపాధ్యాయులకు విద్యాశాఖ కీలక హెచ్చరిక.. ఆ 2 రోజులు డుమ్మా కొడితే 13 రోజులూ లీవ్ పడినట్లే..!!
Image Credit: Telangana Teachers Dasara Holidays

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం.. భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.!.

Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం.. భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.!.

2

బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాలు..

3

దసరా సెలవులపై ఉపాధ్యాయులకు విద్యాశాఖ కీలక హెచ్చరిక.. ఆ 2 రోజులు డుమ్మా కొడితే 13 రోజులూ లీవ్ పడినట్లే..!!

4

తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. 24 గంటల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు..

5

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ బీమా సంస్థలో 450 ఉద్యోగాలు! ఏ డిగ్రీ ఉన్నా ఓకే! సిలబస్‌ పూర్తి వివరాలు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Teachers Dasara Holidays: తెలంగాణలో అక్టోబర్ 10వ తేదీ నుంచి పాఠశాలలకు దసరా పండగ సెలవులు రాబోతున్నాయి. అక్టోబర్ 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మొత్తం 13 రోజులు ప్రభుత్వం అధికారికంగా ఈ సెలవులను ప్రకటించింది. అయితే ఈ 13 రోజుల దసరా సెలవుల వినియోగం విషయంలో టీచర్లు పాటించాల్సిన సెలవుల నిబంధనలను గుర్తు చేస్తూ పాఠశాల విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలను విస్మరించినట్లయితే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కొవల్సి వస్తుందని అధికారులు హోచ్చరించారు.

ప్రభుత్వ సెలవుల నియమావళి ప్రకారం.. స్కూల్లకు ఇచ్చే సుదీర్ఘమైన వెకేషన్ సెలవులు ప్రారంభం అయ్యే ముందు రోజు.. అలాగే సెలవులు ముగిసిన పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే మొదటి రోజున టీచర్లు విధుల్లో ఉండటం అనివార్యం.


విద్యాశాఖ విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం:

సెలవులకు ముందు రోజు (మొదటి పనిదినం): అక్టోబర్ 09

సెలవుల అనంతరం (పాఠశాలల పునఃప్రారంభ రోజు): అక్టోబర్ 23

ఒకవేళ ఏ ఉపాధ్యాయుడైనా సరే ముందస్తు అనుమతి లేకుండా లేదా అనధికారికంగా అక్టోబర్ 09న గానీ లేదా పండుగ సెలవులు పూర్తయిన తర్వాత  పాఠశాల తెరిచే అక్టోబర్ 23న గానీ విధులకు గైర్హాజరైతే లీవ్ నిబంధనల ప్రకారం తీవ్ర చర్యలు ఉంటాయి. అలా గైర్హాజరైన పక్షంలో.. మధ్యలో ఉన్న మొత్తం 13 రోజుల దసరా సెలవుల కాలాన్ని కూడా  విధి గైర్హాజరు (Unauthorized Absence) లేదా  సొంత సెలవు (Casual Leave / Loss of Pay) కిందకే పరిగణిస్తారు. దీనివల్ల సదరు ఉపాధ్యాయుల సెలవుల ఖాతా నుంచి ఏకంగా 13 రోజులు కోల్పోవడమో లేదా జీతంలో కోత పడటమో జరుగుతుందని విద్యాశాఖ స్పష్టం చేసింది.

దసరా సెలవులకు ముందూ, వెనుకా వచ్చే అక్టోబర్ 9.. అక్టోబర్ 23వ తేదీలలో ఉపాధ్యాయులందరూ విధిగా పాఠశాలలకు హాజరై ఎఫ్‌ఆర్‌ఎస్ లేదా బయోమెట్రిక్ హాజరును నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్పనిసరిగా ముందస్తుగానే ఉన్నతాధికారుల నుండి సరైన అనుమతితో లీవ్ మంజూరు చేయించుకోవాలని.. లేనిపక్షంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telangana News
Employees