Xiaomi 18t: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Xiaomi తన కొత్త ఫ్లాగ్‌షిప్ షావోమి 18టీని మార్కెట్‌లోకి తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. గతంలో వచ్చిన షావోమి 17టీకి సక్సెసర్‌గా దీనిని కంపెనీ అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాక ముందే ఈ మొబైల్‌కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు, వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.. టిప్‌స్టర్ల అందించిన సమాచారం ప్రకారం.. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన కెమెరా టెక్నాలజీతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ దీని కెమెరా అని తెలుస్తోంది.. ఇది లీకా బ్రాండింగ్‌తో ట్యూన్ చేసిన అద్భుతమైన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండబోతోంది.. ఇందులో ప్రధాన కెమెరా ఏకంగా 200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో అందుబాటులోకి రాబోతోంది.. దీంతో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో పాటు 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కెమెరాలను అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సెల్ఫీలు, హై-క్వాలిటీ వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాలు కూడా లభిస్తున్నాయి.
డిస్‌ప్లే పరంగా చూస్తే.. ఈ షావోమి 18టీ కస్టమర్స్‌కి మంచి ఎక్పిరీయన్స్‌ను కూడా అందిస్తోంది. ఇందులో LTPS OLED ప్యానెల్‌ను కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ కూడిన డిస్ల్పేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 185Hz వరకు రెస్పాన్స్ ఇస్తుందని తెలుస్తోంది. స్క్రీన్‌పైనే ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందిస్తూ వస్తోంది..
మల్టీ టాస్కింగ్‌తో పాటు గ్రాఫిక్స్ కోసం.. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8600 (MediaTek Dimensity 8600) చిప్‌సెట్ ప్రాసెసర్ అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.. వీటితో పాటు స్పీడ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ బ్యాటరీని కూడా అందిస్తున్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. టీవీలు, ఏసీలు, అన్నింటిని కంట్రోల్ చేసేందుకు ఐఆర్ బ్లాస్టర్ వంటి ఫీచర్లు ఇందులో లభిస్తున్నాయి.