• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /విటమిన్ ‘డి’ లోపిస్తే శరీరంలో కనిపించే హెచ్చరిక సంకేతాలివే.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే..!!

విటమిన్ ‘డి’ లోపిస్తే శరీరంలో కనిపించే హెచ్చరిక సంకేతాలివే.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే..!!

Vitamin D: మారుతున్న జీవనశైలితోపాటు.. గంటల తరబడి నాలుగు గోడలకే పరిమితమై పనిచేయడం వంటి కారణాల వల్ల నేడు చాలామందిలో విటమిన్ డి లోపం తీవ్రమైన సమస్యగా మారుతోంది.

Written ByBhoomi
Published: Nov 11, 2026, 01:00 PM IST|Updated: Nov 11, 2026, 01:01 PM IST
joinshare
విటమిన్ ‘డి’ లోపిస్తే శరీరంలో కనిపించే హెచ్చరిక సంకేతాలివే.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే..!!
Image Credit: Vitamin D

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
యువతకు సీరియస్ అలర్ట్.. విటమిన్ B6 లోపిస్తే పక్షవాతం ప్రమాదం? పరిశోధనల్లో షాకింగ్ విషయాలు..!!

యువతకు సీరియస్ అలర్ట్.. విటమిన్ B6 లోపిస్తే పక్షవాతం ప్రమాదం? పరిశోధనల్లో షాకింగ్ విషయాలు..!!

2

Hardik Pandya IPL Salary: రూ.10 లక్షల నుంచి రూ.140 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతంటే..?

3

కోల్‌కతా - ముంబై ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేస్తామంటూ వార్నింగ్..!

4

బైక్‌పై కూర్చొని చలాన్లు వేస్తున్న కానిస్టేబుల్.. తలపై హెల్మెట్ ఎక్కడ?

5

కమల్ హాసన్‌ కొత్త సినిమా టైటిల్ పై వివాదం.. కేసు నమోదు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vitamin D: మారుతున్న జీవనశైలితోపాటు.. గంటల తరబడి నాలుగు గోడలకే పరిమితమై పనిచేయడం వంటి కారణాల వల్ల నేడు చాలామందిలో విటమిన్  డి లోపం తీవ్రమైన సమస్యగా మారుతోంది. ఎలాంటి తీవ్రమైన హెచ్చరికలు లేకుండానే ఇది నిశ్శబ్దంగా శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మన శరీరంలో ఎముకలు, కండరాలు దృఢంగా ఉండటానికి.. మనం తీసుకునే ఆహారం నుంచి కాల్షియంను సరిగ్గా గ్రహించడానికి విటమిన్  డి అత్యంత ప్రధానమైనది. అందుకే దీనిని  సన్‌షైన్ విటమిన్ అని పిలుస్తారు. శరీరంలో ఈ విటమిన్ శాతం తగ్గితే అనేక రకాల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది.

విటమిన్ డిలోపం ఉన్నవారిలో తరచుగా ఎముకల నొప్పులు, నడుము నొప్పి, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. చిన్న పనులకు అలసిపోవడం, నీరసంగా ఉండటం కూడా ఈ విటమిన్ లోపానికి సంకేతమే. సమస్య తీవ్రమైతే.. ఎముకలు పెళుసుబారి వాటి బలం తగ్గుతుంది. కొందరిలో ఎముకలు మెత్తబడే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు  చెబుతున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండటం ఎంతో ముఖ్యమని సూచిస్తున్నారు.

విటమిన్ డి పొందడం ఎలా ఉంటే.. దీనికి ప్రధానమైన సూర్య రశ్మి సహజమార్గం. ప్రతి రోజూ ఉదయం కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు సురక్షితమైన సూర్యకాంతి శరీరానికి తాకే విధంగా చూసుకోవాలి. దీంతోపాటు కొన్ని ఆహార పదార్థాల ద్వారా కూడా విటమిన్ డి ని పొందవచ్చు. గుడ్డులోని పచ్చసొన, చేపలు, యూవీ కిరణాల ద్వారా పెంచిన పుట్టగొడుగులు, విటమిన్ డి బలవర్ధకం చేసిన పాలు, ఇతర పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిది.

పైన వివరించిన లక్షణాలు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా కలగవచ్చు. అందువల్ల.. మీకు విటమిన్ డి లోపం ఉందని మీరు అనుమానిస్తే.. సొంతంగా మందులు వాడకుండా నిపుణులైన వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. వారి సలహా ప్రకారం, లోపం  తీవ్రతను నిర్ధారించడానికి మీరు రక్త పరీక్ష చేయించుకోవాలి. సప్లిమెంట్లను అవసరమైనప్పుడు మాత్రమే.. మీ వైద్యుడు సూచించిన మోతాదులో వాడాలి. ఎముకల ఆరోగ్యం మన శారీరక బలానికి పునాది కాబట్టి, విటమిన్ డి ప్రాముఖ్యతను అర్థం చేసుకుని ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం.

Also Read: 

 

జాతీయ విద్యా దినోత్సవం.. IIT, UGCల వ్యవస్థాపకుడు ఆజాద్ ఆశయాలు నెరవేరుతున్నాయా?.. నేటి విద్యా వ్యవస్థ సవాళ్లు ఇవే..!!

 

విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లకు చెక్.. వరుస ఘటనలతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Health
Telugu News