SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Madurai Tanishq Theft: మధురై తనిష్క్ చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..ఫెమస్ యూట్యూబర్ అరెస్ట్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..

Youtuber arrested in Madurai tanishq case: మదురై నగరంలో ఉన్న తనిష్క్ బంగారంషాపులో ఇటీవల భారీ చోరీ జరిగింది. సుమారు 16 కేజీల ఆభరణాలు చోరికి గురయ్యాయి. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.

Written By Inamdar Paresh
Published: Nov 14, 2026, 07:35 PM IST | Updated: Nov 14, 2026, 07:52 PM IST
Image Credit: Madurai Tanishq Theft case (file)
Join

Youtuber arrested in Madurai tanishq jewellery theft row: తమిళనాడులోని మదురై నగరంలో ఇటీవల భారీ చోరీ జరిగింది.  కలవాసల్ బైపాస్ రోడ్డులో ఉన్న ప్రముఖ తనిష్క్ జ్యువెలరీ షోరూమ్‌ను టార్గెట్ గా చేసుకుని కొంత మంది దుండగులు భారీ చోరీకి ప్లాన్ వేశారు. షోరూమ్ లో ఉన్న సుమారు 16 కేజీల బంగారం నగల్ని కాజేశారు. దీని విలువ దాదాపుగా రూ. 25 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇంటిరియరర్ పనులు కొనసాగుతుండగానే ఈ ఘటన జరగడటంతో అందరు షాక్ అయ్యారు. దీంతో షోరూమ్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. సదరు జ్యువెల్లరీ షోరూమ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్ని జల్లెడపట్టారు. 

 

 

ఈ ఘటనలో మధురై పోలీసులు ఫెమస్ య్యూబర్ తో పాటు ప్రధాన నిందితుడి తండ్రిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు ఐదు కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను యూట్యూబర్ మీనాక్షి, ప్రధాన నిందితుడు నిశాంత్ కృష్ణ తండ్రి సురేష్‌గా గుర్తించారు.

మరోవైపు నిశాంత్ కోసం పోలీసులు ప్రత్యేకంగా రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. ఈ చోరీ కోసం దొంగలు నవంబర్ 5న రిహర్సల్స్ కూడా చేసినట్లు పోలీసులు గుర్తించారు. దొంగ గంటకు పైగా దుకాణంలోనే ఉండి, ఆ సమయంలో డిస్‌ప్లే కేసుల నుండి సంచులు, ట్రాలీ బ్యాగులలో బంగారం, వజ్రాల ఆభరణాలను దోచుకున్నాడని కూడా  సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. చోరీకి పాల్పడిన వ్యక్తి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES