ఈజీ పనులు చేయడం వల్ల మనకు ఎక్కువ రిలాక్సేషన్ లభిస్తుంది. డిష్ వాషర్ ఈ మధ్య కాలంలో చాలామంది వాడుతున్నారు. అయితే, ఇందులో పొరపాటున కూడా 5 వస్తువులు పెట్టకూడదు. దీంతో డిషవాషర్ కూడా పాడవుతుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
1/6
డిష్ వాషర్..
డిష్ వాషర్.. దుస్తులకు వాషింగ్ మెషీన్ ఎలాగో.. ఇంటి వంట పాత్రలకు డిష్ వాషర్ అలా.. చాలామంది ఈ మధ్య కాలంలో ఈ మెషీన్ వాడుతున్నారు. సింపుల్‌గా ఇందులో కిచెన్ సమాన్లు పెట్టేసి డిష్ వాష్ లిక్విడ్ వేస్తే చాలు శుభ్రమవుతాయి. అయితే, ప్రతి ఒక్క కిచెన్ వస్తువు స్ట్రాంగ్ ఉంటుందనే గ్యారెంటీ లేదు.. అందుకే కొన్ని వస్తువులు వేయకూడదు. లేకపోతే వీటితోపాటు డిష్ వాషర్ కూడా పాడయ్యే అవకాశం ఉంది.
2/6
వుడెన్ స్పూన్..
వుడెన్ స్పూన్..
ఈ చెక్కతో తయారు చేసిన పాత్రలు వేయడం వల్ల పాడవుతాయి. ఎందుకంటే నీరు వేడిగా మారుతుంది. డిటర్జెంట్ వేస్తాం కాబట్టి ఇలా వుడెన్ వస్తువులు పాడువుతాయి. వాటిపై భాగం కూడా డ్యామేజ్ అవుతుంది. అందుకే ఈ డిష్ వాషర్‌లో వేయకుండా చేయితో వాష్ చేయడం బెట్టర్... చాపింగ్ బోర్డు కూడా ఇందులో పెట్టకండి. కేవలం నిమ్మకాయతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
3/6
కాస్ట్ ఐరన్
కాస్ట్ ఐరన్ ప్యాన్..
కాస్ట్ ఐరన్ వంట పాత్రలు కూడా చాలా మంది ఇళ్లలో వాడుతున్నారు. ఇవి కాస్త బరువు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎక్కువ రోజులు మన్నికగా కూడా ఉంటాయి. అయితే, వీటి సీజనింగ్ ఉండాలంటే డిష్ వాషర్‌లో వేయకండి. లేయర్ వెళ్లిపోయి త్వరగా రస్ట్ కూడా వచ్చేస్తుంది. వీటిని కూడా చేయితో శుభ్రం చేస్తే సరిపోతుంది.
4/6
కత్తులు..
కత్తులు.. పదునైన వస్తువులు..
ఈ డిష్ వాషర్‌లో పదునైన కత్తులు, కత్తెరలు కూడా వేయకండి. వీటి వల్ల ఇతర పాత్రలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. చేయితో కడిగేయండి.
5/6
బాటిట్స్..
బాటిట్స్..
చాలామంది వీటిని ట్రావెలింగ్ సమయంలో ఉపయోగిస్తారు. ఇన్సులేటెడ్ మగ్ లేదా వాటర్ బాటిల్ కూడా డిష్ వాషర్‌లో వేయకండి. ఈ మెషీన్‌లో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇన్సులేషన్ పాడవుతుంది. మ్యానుఫాక్చరింగ్ జాగ్రత్తలు చదివి వాడండి.
6/6
నాన్ స్టిక్..
నాన్ స్టిక్..
వీటితోపాటు డిష్ వాషర్‌లో నాన్ స్టిక్ పాత్రలు కూడా వేయకండి. వాటిపై కోటింగ్ పోతుంది. ఆ ప్యాన్‌పై డిష్ వాషర్ సేఫ్ అని రాసినా కూడా కేవలం సింపుల్‌గా చేయితో కడిగేయండి. మృదువైన స్పాంజిని ఉపయోగించి నాన్ స్టిక్ వంట పాత్రలు శుభ్రం చేయండి.