ఏపీలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మూడు విడతల్లో మొత్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. సాధారణంగా మొదటి దశలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి; అలాగే రెండో, మూడో దశల్లో కూడా ఇదే విధంగా నిర్వహిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించే పాఠశాలలకు సెలవులు కూడా రానున్నాయి. ఆ పూర్తి వివరాలను తెలుసుకున్నాం.
1/5
పాఠశాలలకు సెలవులు
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులపై ఏపీ ప్రభుత్వ అధికారులు స్పష్టతనిచ్చారు. డిసెంబర్ 26, 29, 2 తేదీల్లో మూడు విడతలుగా పంచాయతీ పోలింగ్ జరుగుతుంది.
2/5
ఏపీ పాఠశాలలకు సెలవులుap school holidays
రాష్ట్రవ్యాప్తంగా కాకుండా కేవలం పోలింగ్ నిర్వహించే పాఠశాలలకు మాత్రమే సెలవులు ఉంటాయి. గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో, ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన పాఠశాలలకు మాత్రమే ఆయా తేదీల్లో సెలవు ఉంటుంది.
3/5
ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు
మిగతా పాఠశాలలకు సెలవు ఉండదని, షెడ్యూల్ ప్రకారం యథావిధిగా పనిచేస్తాయని అధికారులు ప్రకటించారు. ప్రైవేట్ పాఠశాలలకు కూడా ఈ సెలవు వర్తించదని స్పష్టం చేశారు.
4/5
స్కూల్ హాలిడేస్ న్యూస్
ఏపీ గ్రామీణ ప్రాంతాల ఎన్నికల్లో తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, వీధి దీపాలు, సంక్షేమ పథకాలు కీలకంగా మారనున్నాయి. ఈ అంశాలకు ప్రాధాన్యత పెరిగింది. వాటినే ఆసరాగా చేసుకొని అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్తున్నారు. మొత్తంగా ఏపీలో మూడు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలతో పల్లెల్లో రాజకీయ వాతావరణం ప్రస్తుతం వేడెక్కింది.
5/5
సర్పంచ్ ఎన్నికలు 2026
పోలింగ్ నవంబర్ 26, 29 తేదీలతో పాటు డిసెంబర్ 2న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమవుతుంది.