• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /సల్మాన్ ఫ్లాప్స్ పరంపరకు ‘మాతృభూమి’ చెక్ పెడుతుందా..!!

సల్మాన్ ఫ్లాప్స్ పరంపరకు ‘మాతృభూమి’ చెక్ పెడుతుందా..!!

Salman Khan Fate: వరుస ఫ్లాపులతో దాదాపు పతనం వైపు పయనిస్తున్నాడు సల్మాన్ ఖాన్. ఇతను సాలిడ్ హిట్ కొట్టి పదేళ్లుకు పైగా అవుతుంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్.. రొటీన్ యాక్షన్ చిత్రాలకు భిన్నంగా 'మాతృభూమి' అనే దేశభక్తి నేపథ్యంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. మరి ఈ సినిమాతో సల్మాన్ పవర్‌ఫుల్ కమ్ బ్యాక్ ఇస్తాడా..ఇంతకీ ఈ సినిమా స్పెషాలిటీ ఏంటి..?

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 24, 2026, 07:25 IST|Updated: Nov 24, 2026, 07:26 IST
joinshare
సల్మాన్ ఫ్లాప్స్ పరంపరకు ‘మాతృభూమి’ చెక్ పెడుతుందా..!!
Image Credit: Salman Matrubhumi (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
సల్మాన్ ఫ్లాప్స్ పరంపరకు ‘మాతృభూమి’ చెక్ పెడుతుందా..!!

సల్మాన్ ఫ్లాప్స్ పరంపరకు ‘మాతృభూమి’ చెక్ పెడుతుందా..!!

2

సినిమాలకు కియారా అద్వానీ బై బై.. ? క్లారిటీ ఇచ్చిన ‘టాక్సిక్’ భామ..!!

3

కోలీవుడ్‌కు కలిసొచ్చిన 2027.. జైలర్ 2, వీరభద్రుడు, సీన్ సహా భారీ హిట్లు..

4

Ansal API: కోరమ్‌ లేక అన్సల్ ఏపీఐ ప్రమోటర్ల ఈజీఎం రద్దు.. తెరపైకి ఈ- ఓటింగ్ వివాదం

5

సనాతన ధర్మ పరిరక్షణ అంటే పురాతన దేవాలయాలను కూల్చివేయడమేనా? వైఎస్ జగన్..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Maatrubhumi - Salman Khan:సల్మాన్ ఖాన్ సాలిడ్ హిట్ అందుకొని దాదాపు దశాబ్దం కావొస్తోంది. అపుడెపుడో ‘సుల్తాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్‌ అందుకున్నాడు. ఆ తర్వాత ‘టైగర్ జిందా హై’, ‘భారత్’ సినిమాలు నడిచాయి. ఆ తర్వాత సల్మాన్ నటించిన ఏ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్దగా నడిచిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ సాలిడ్ హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో త్వరలో ‘మాతృభూమి’ సినిమాతో పలకరించబోతున్నాడు. ‘మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ అనేది ట్యాగ్ లైన్. ఎప్పుడో మొదలైన ఈ ప్రాజెక్ట్ గాల్వాన్ వివాదాల వల్ల టైటిల్, కథ మార్చుకుని ఇప్పుడు ట్రైలర్‌తోనూ ట్రోల్స్ ఎదుర్కొన్నాడు.

‘బాటిల్ ఆఫ్ గాల్వాన్’ నుంచి ‘మాతృభూమి’.. ‘మే వార్ రెస్ట్ ఇన్ పీస్‌’గా టైటిల్  మార్పు..

దేశభక్తి సినిమాల ట్రెండ్‌ను ఫాలో అవుతూ సల్మాన్ చేసిన 'బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్' ఆయనకు అతిపెద్ద తలనొప్పిగా మారింది. చైనా అభ్యంతరాలతో సినిమా పేరును ‘మాతృభూమి’గా మార్చారు. అంతేకాదు డియన్ ఆర్మీ వీరోచిత పోరాటాన్ని పక్కనపెట్టి యుద్ధం వద్దనేలా కథను మొత్తం మార్చేశారు. అప్పటివరకు తీసిన షూటింగ్ అంతా క్యాన్సిల్ చేసుకుని, మళ్లీ కొత్తగా సీన్స్ రాసుకుని రీషూట్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

గ్రీన్ మ్యాట్‌లో షూట్..

అప్పటి వరకు రియల్ లొకేషన్లలో కాకుండా కేవలం గ్రీన్ మ్యాట్ వేసుకుని, స్టూడియోలకే పరిమితమై AI సాయంతో సీన్స్ లాగించేశారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.  ట్రైలర్‌లో సల్మాన్ లుక్స్ ప్రతి షాట్‌కు ఒకలా ఉండటమే కాకుండా..  ఆయన ముఖంపై ఉన్న గాయం సైజ్ కూడా సీన్‌ను బట్టి మారిపోవడం ఆడియన్స్‌కు షాకింగ్ పరిణామం అని చెప్పాలి. ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్  వాడటం తప్పు కాదేమో కానీ AI ఒక్కటే వాడటం కచ్చితంగా తప్పే అని  చెప్పాలి.

సల్మాన్‌కు ఫ్లాపులు కొత్త కాదు..

సల్మాన్ ఖాన్‌కు ఫ్లాపులు కొత్త కాదు.  కానీ రిలీజ్‌కు ముందే నెగిటివిటీ మూటగట్టుకోవడం ఇదే మొదటిసారి. ఎపుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం  డిసెంబర్ 4న రిలీజ్ కాబోతుంది. ‘మాతృభూమి’ సినిమా పై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలైతే భారీగా ఏం లేవు. విడుదలైన తర్వాత బ్లాక్‌బస్టర్ టాక్ వస్తే ఈ సినిమా గట్టెక్కె అవకాశాలున్నాయి. ఈ సినిమా హిట్టైయితే 60 యేళ్ల వయసులో హిట్ కొట్టిన రెండో హీరోగా చరిత్రకు ఎక్కుతాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో 60 యేళ్ల తర్వాత సోలో హిట్ అందుకుంది సన్ని డియోల్ మాత్రమే. ఆ తర్వాత ఎవరు లేరు. ఈ సినిమా హిట్టైయితే సల్మాన్ రెండో హీరోగా అతని పేరు చరిత్రకు ఎక్కుతుంది.

మాతృభూమి.. 

మరోవైపు షారుఖ్ కూడా 60 యేళ్ల వయసులో ‘కింగ్’ సినిమాతో పలకరించబోతున్నాడు. ఇతను హిట్ కొట్టినా.. 60 యేళ్ల వయసులో సోలోగా హిట్ కొట్టిన బాలీవుడ్ హీరోగా నిలుస్తాడు. ఆ సంగతి పక్కనపెడితే.. సల్మాన్ కు ‘మాతృభూమి’ సినిమాతో హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ప్రస్తుతం  సల్మాన్ .. వంశీ పైడిపల్లితో ఓ సినిమా చేస్తున్నాడు.  ఆయన అభిమానుల ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. ఇక తమిళంలో కార్తి, విజయ్‌లకు మంచి హిట్స్ అందించిన వంశీ పైడిపల్లి తొలిసారి హిందీలో సల్మాన్ ఖాన్‌తో సినిమా చేస్తున్నాడు. మరి సల్మాన్ కు వంశీ పైడిపల్లి హిట్ ఇస్తాడా అనేది చూడాలి.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Bollywood
Tollywood
Telugu Movie