• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /పడమర, ఉత్తర దిక్కుల్లో తల పెట్టి నిద్రించకూడదా.. శాస్త్రం ఏం చెబుతుంది..

పడమర, ఉత్తర దిక్కుల్లో తల పెట్టి నిద్రించకూడదా.. శాస్త్రం ఏం చెబుతుంది..

Vastu Shastra: సాధారణంగా మన ఇళ్లల్లో ఉత్తర , పడమర దిక్కులకు తల ఉంచి నిద్రించకూడదనేది పెద్దలు చెబుతుంటారు.దీనికి శాస్త్రంతో పాటు కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. రాత్రి సమయంలో నిద్రపోయేటపుడు తల తూర్పు దిశగా ఉంచి నిద్రపోవాలంటారు పెద్దలు. దక్షిణ దిశకు ఒక మాదిరిగా కొంచం మంచిది అని పెద్దవారు చెబుతుంటారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 24, 2026, 06:28 IST|Updated: Nov 24, 2026, 09:38 IST
joinshare
పడమర, ఉత్తర దిక్కుల్లో తల పెట్టి నిద్రించకూడదా.. శాస్త్రం ఏం చెబుతుంది..
Image Credit: Vastu Shastra News (Source/ZEE News)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
APకి వాతావరణ శాఖ గుడ్‌ న్యూస్‌.. రెండు రోజులు వర్షాలు..

APకి వాతావరణ శాఖ గుడ్‌ న్యూస్‌.. రెండు రోజులు వర్షాలు..

2

గురు గ్రహం వక్రగమనంతో ఈ రాశులకు మహర్దశ.. ఆదాయం పెరుగుతుంది.. ఆర్థిక కష్టాలన్నీ దూరం!

3

ఈ 3 రాశులవారికి ఆర్థిక ఇబ్బందులు? సూర్య, చంద్రుల షడాష్టక యోగం ప్రభావం ఇదే!

4

సల్మాన్ ఫ్లాప్స్ పరంపరకు ‘మాతృభూమి’ చెక్ పెడుతుందా..!!

5

పడమర, ఉత్తర దిక్కుల్లో తల పెట్టి నిద్రించకూడదా.. శాస్త్రం ఏం చెబుతుంది..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vastu Shastra: తూర్పుదిశకు శిరస్సు ఉంచి నిద్రపోతే  ఆరోగ్యవంతులుగా ఉంటారనేది మార్కండేయ పురాణములో  ప్రస్తావించబడింది. అందులో వాస్తు శాస్త్రానికి సంబంధించిన  కొన్ని నియమాలేంటే చూద్దాం. భూమి ఒక పెద్ద అయస్కాంతం.  మాములు అయస్కాంతం చుట్టూ అయస్కాంత క్షేత్రం ఎలా ఉంటుంటుందో భూమి చుట్టూ అయస్కాంత క్షేత్రం 66 వేల మైళ్ళ వరకు వ్యాపించి ఉంది. ఈ విశ్వం అండాండంగా.. మన శరీరంను పిండాండం అని జ్ఞానులు పిలుస్తారు . విశ్వములోని అన్నింటి ప్రభావం, శక్తి మన శరీరంలో కూడా ఉంటుంది. 
          
ఉత్తర దిక్కుకు ఆకర్షణ.. 
భూమికి అయస్కాంత శక్తి ఉన్నది. దిక్సూచిని ఏ దిక్కుకి తిప్పినను దాని ముల్లు ఉత్తరదిక్కుకు తిరుగుతూ ఉంటుంది. ఈ ఆకర్షణ శక్తి మానవుని తల ఆధారంగా ఇది శరీరంపైన ప్రభావమును చూపిస్తుంది. అయస్కాంతపు ఉత్తర ధ్రువమునకు రోగనిరోధక శక్తి అనగా క్రిమిరోగాల వంటి వానిని నాశనం చేసి కాపాడగల శక్తి ఉంది. దక్షిణ ధ్రువమునకు శక్తిని ప్రసాదించగల గుణమున్నదనేది  మన పురాణాలలో ఉన్నది. మానవుని శరీరం ఒక విద్యుచ్ఛక్తి కేంద్రం.   శరీరముకు కావలసినంత విద్యుత్తు మాత్రమే శరీరంలో ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. శరీరం తనకి కావలసిన ఎలెక్ట్రిసిటీని ఎల్లప్పుడూ ఉత్పన్నం చేసుకుంటూ ఉంటుంది.  
        
వాత్సాయన మహర్షి.. 
వాత్సాయన మహర్షి చెప్పిన ప్రకారం శరీరంలో  24 కేంద్రాలలో ఈ పని  నిరంతరాయంగా జరుగును. ఈ 24 కేంద్రాలలో బ్రహ్మాండం అతి ముఖ్యమైన కేంద్రం అని చెప్పాలి. బ్రహ్మాండం అనగా శిరస్సులోని  పైభాగం. దీనినే పుణికి అని బ్రహ్మ కపాలం అని పిలుస్తారు. ఇది శరీరంలో విద్యుచ్చక్తి ఉత్పత్తికి, బయటకి విసర్జనకు రెండింటికి కేంద్రమై ఉన్నది. మానవ శరీరంలో ఉత్పత్తి అయిన విద్యుత్ వెంట్రుకల చివరనుంచి చేతి గోళ్ల చివర నుంచి చర్మరంధ్రాల ద్వారా అత్యంత సూక్ష్మంగా బయటకి విసర్జించబడును.
      
మెదడులో 20 వాట్స్ విద్యుత్ శక్తి..

దాదాపు 1300 గ్రాముల బరువుగల మనవుని మెదడు దాదాపు 20 వాట్స్ విద్యుత్ శక్తిని కలిగి ఉంటుందట. మానవ హృదయము నుండి వెలువడే విద్యుత్ శక్తిని ‘వెక్టార్’ ద్వారా కొలుస్తారు. ఈ విద్యుత్ శక్తిని ఊపిరిని తమ ఆధీనంలో ఉంచడం  ద్వారా ఆయుర్వృద్దిని పొందవచ్చునేది యోగులు చెబుతున్న మాట. ఈ విధంగా ఉచ్చ్వాస , నిచ్చ్వాసాలను తమ అదుపులో ఉంచి జీవశక్తిని దాని పరిమాణాన్ని ప్రభావితం చేయగలిగేవారున్నారు.
          
శిరస్సును ఉత్తర దిక్కుకు ఉంచి నిద్రించినపుడు  ఉత్తర దిక్కులో ఉండే ఆకర్షణ శక్తి వలన శరీరంలోని విద్యుత్ శక్తి కొంత కోల్పోతుంది . ప్రతిరోజు ఇలా చేయడం వలన క్రమేణా శరీరం తన శక్తిని వర్ఛస్సును కోల్పోతుందట.  విద్యుత్ కిరణాలు మన పాదముల నుండి ప్రవహించి శిరస్సు నుండి వస్తుంది. విద్యుత్ శక్తి ప్రవహించుచోట చల్లదనమును , వెలువడుచోట ఉష్ణం ఉంటుందని శాస్త్రవేత్తలు ఎపుడో నిర్ధారించారు.

శిరస్సు నుంచి విద్యుత్ శక్తి.. 
అందుకే  శిరస్సు నుండి విద్యుత్ శక్తి వెలుబడుతున్నందున  శిరస్సు అత్యుష్ణమ్ చెంది తలభారం , బాధ , అలసట , నిస్సారం మొదలగునవి కలుగుతాయి. కొన్ని శరీర భాగాలు తమ క్రియను కోల్పోయి పక్షవాతం , తిమ్మిరి , నడుమునొప్పి మొదలగు వాత వ్యాధులు కలుగును. నరముల సంబంధ వ్యాధులు వస్తాయి. కావున దక్షిణ దిశకు శిరము ఉంచి నిద్రించడం వలన  విద్యుత్ శక్తి పాదముల గుండా వెలువడుట వలన నష్టమేమి ఉండదు. శరీరంలో విద్యుత్ దక్షిణము నుండి ఉత్తరమునకు ప్రవహించును.
  
పడమర దిక్కు నిద్రించకూడదు..    
ఇదే విధముగా పడమట దిక్కు కూడా నిద్రించకూడదు.  ఇక్కడ సూర్యుడు అస్తమించుట చేత అతని ఆకర్షణశక్తి , మనుషులో ఉన్న విద్యుత్ శక్తిని ఆకర్షిస్తుందట. సూర్యుడు ప్రపంచానికి కన్నులాంటి వాడు.. సర్వప్రాణులకు ఆధారభూతుడు.  జగత్తును పోషించేవాడు. సూర్యుని నుండి ప్రసరించే కిరణములు మనుష్యుని పై మంచి ప్రభావం చూపి దానితో శరీరం నందలి విద్యుత్ ని తన అధీనంలో ఉంచుకునేలా చేస్తుంది. అందువలనే ఉత్తర దిశకు తల ఉంచి నిదురించిన ఎటువంటి పరిణామాలు కలుగునొ అటువంటి పరిణామాలే పడమర దిక్కుకి తల ఉంచి నిదురిస్తే  కలుగునని సైంటిఫిక్‌గా ప్రూవ్ అయింది. అదే మన పురాతన వాస్తు శాస్త్రంలో ఎపుడో నిర్ధారించారు. 

Add Zee News as a Preferred Source
TAGS:
Vastu Tips
Spirituality
Telugu News