• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Divya Bharathi Latest: "ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది" సుడిగాలి సుధీర్ హీరోయిన్ దివ్యభారతి షాకింగ్ కామెంట్స్!

Divya Bharathi Latest: "ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది" సుడిగాలి సుధీర్ హీరోయిన్ దివ్యభారతి షాకింగ్ కామెంట్స్!

Written ByHarish Darla
Published: Sep 27, 2026, 03:50 PM IST|Updated: Sep 27, 2026, 03:59 PM IST
joinshare

Divya Bharathi Latest News: తమిళ యంగ్ హీరోయిన్ దివ్య భారతి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్ల ఓ పెద్ద తప్పు చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఆమె ఆవేదన వెనుక అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Divya Bharathi Latest News1/7

లైమ్‌లైట్‌లోకి..

తమిళ అందాల భామ దివ్య 'బ్యాచిలర్' సినిమాతో కథానాయికగా దక్షిణ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక పేరు సంపాదించుకుంది నటి దివ్య భారతి. ఆమె తన నటన, అద్భుతమైన అందంతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Divya Bharathi2/7

సినీ కెరీర్..

మోడలింగ్ ద్వారా సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన నటి దివ్య భారతి, 2017లో విడుదలైన 'ముప్పరిమానం' సినిమాలో ఓ చిన్న పాత్ర చేసింది. అయితే సంగీత దర్శకుడు, నటుడు 'బ్యాచిలర్' సినిమా ద్వారా ఆమెకు పెద్ద బ్రేక్ ఇచ్చింది.
Divya Bharathi age3/7

పెద్ద తప్పు అదే..

ఇటీవలే తాను పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో, తన సినీ ప్రయాణంలో తాను చేసిన అతిపెద్ద తప్పు గురించి దివ్య భారతి వెల్లడించింది. "'బ్యాచిలర్' సూపర్ హిట్ అయ్యాక అవకాశాలు వాటికి అవే వెతుక్కుంటూ వస్తాయని అనుకున్నా. కానీ, చిత్ర సీమలో పరిచయాలు పెంచుకోవడం ఎంత ముఖ్యమో ఆ సమయంలో నాకు అర్థం కాలేదు" అని నటి దివ్య భారతి అన్నారు.
Divya Bharathi Interview4/7

అదే నాలో మైనస్..

చిత్రసీమలో గాడ్‌ఫాదర్ లేకుండా అడుగుపెట్టిన తన అనుభవాన్ని నటి దివ్య భారతి ఈ సందర్భంగా పంచుకున్నారు. "నాకు సినిమా పరిశ్రమలో ఎలాంటి నేపథ్యం (బ్యాగ్రౌండ్) లేదు. చిత్ర పరిశ్రమ ఇలాగే పనిచేస్తుందని నేను నమ్మాను. అది నా ప్రతిభపై అతి విశ్వాసం కాదు, చిత్ర పరిశ్రమ గురించి అవగాహన లేకపోవడమే కారణం. ఇండస్ట్రీలో నాకు నేనుగా, నిలబడి వ్యక్తులను కలవాల్సి వచ్చింది" అని హీరోయిన్ దివ్య భారతి చెప్పుకొచ్చింది.
Divya Bharathi News5/7

టైమ్ అంతా వృథా..

తన సినిమా కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం ఎదురుచూస్తూ సమయాన్ని వృధా చేశానని దివ్య భారతి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. "మంచి అవకాశాలు వస్తాయని ఆశతో ఎంతో కాలంగా ఎదురుచూస్తూనే ఉన్నా. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, అనవసరంగా ఎంతో కాలం వృథా చేశానని అనిపిస్తోంది. దాని వల్ల నా సినిమా కెరీర్ కొద్దిగా నెమ్మదించింది" అని తన మనసులో ఆవేదనను దివ్య భారతి వ్యక్తపరిచింది.
Actress Divya Bharathi Comments6/7

షాకింగ్ కామెంట్..

తెలుగు, తమిళ చిత్రాలలో ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్ దివ్య భారతి.. తాను ఓ పెద్ద తప్పు చేసినట్లు వెల్లడించింది. సౌత్ సినీ ఇండస్ట్రీలో బిజీగా సినిమాలతో గడుపుతున్న ఈ బ్యూటీ ఇటీవలే 'మహారాజా' చిత్రంతో అలరించి, ప్రస్తుతం 'కింగ్‌స్టన్'తో పాటు కొన్ని తెలుగు ప్రాజెక్ట్స్‌లోనూ నటిస్తోంది.
Divya Bharathi Bachelor movie7/7

దివ్య భారతి ఆవేదన..

తమిళ యంగ్ హీరోయిన్ దివ్య భారతి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్ల ఓ పెద్ద తప్పు చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఆమె ఆవేదన వెనుక అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
TAGS:
Telugu Movie
Telugu News
Tollywood

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.