PF UPI Withdrawal: ఈపీఎఫ్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ నుంచి డబ్బులు అవసరమైనప్పుడు విత్‌డ్రా చేసుకోవడం మరింత సులభం కానుంది. ఇప్పటివరకు పీఎఫ్ నగదు కోసం ఆన్‌లైన్‌లో క్లెయిమ్ పెట్టి.. ప్రాసెస్ పూర్తయ్యే వరకు ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇకపై UPI ద్వారా నేరుగా డబ్బులు తీసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు EPFO రెడీ అవుతోంది. వివరాలు ఇలా..
1/7
PF Withdrawal Limit
యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకునే విషయంపై గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నా.. ఇప్పటివరకు అమలు చేయలేదు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 2026 చివరి నాటికి ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
2/7
PF Withdrawal Through UPI
BHIM యాప్ ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే సమయంలో పీఎఫ్ విత్‌డ్రా నిబంధనల్లోనూ కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
3/7
EPFO Latest News
EPFO తీసుకొస్తున్న ఈ కొత్త విధానంలో ఉద్యోగుల యూఏఎన్‌ను వారి UPI ఖాతాతో అనుసంధానం చేయనున్నారు. EPFOలో నమోదైన.. ధ్రువీకరించిన బ్యాంక్ అకౌంట్‌లకు మాత్రమే ఈ సదుపాయం వర్తించే అవకాశం ఉంది.
4/7
PF Withdrawal Rules 2026
BHIM యాప్ ద్వారా పీఎఫ్‌లో విత్‌డ్రా చేసుకోవడానికి అర్హత ఉన్న బ్యాలెన్స్ ఎంత..? ఖాతాలో కనీసం ఎంత మొత్తం ఉంచాలి..? అనే వివరాలను కూడా తెలుసుకోవచ్చని సమాచారం. UPI విత్‌డ్రా సదుపాయానికి సంబంధించిన ట్రయల్స్ పూర్తయ్యాయని.. ఈ సమయంలో ఎదురైన టెక్నికల్ సమస్యలు పరిష్కరించినట్లు తెలుస్తోంది.
5/7
EPFO
ప్రస్తుతం పీఎఫ్ నగదు తీసుకోవాలంటే UAN పోర్టల్ ద్వారా క్లెయిమ్ సమర్పించాలి. EPFO ఆ క్లెయిమ్‌ను పరిశీలించి ఆమోదించిన తర్వాత బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. కొత్త విధానం అందుబాటులోకి వస్తే.. ఈ ప్రక్రియ మరింత సులభతరం కానుంది.
6/7
EPFO UPI Withdrawal
UPI విధానంలో అర్హత కలిగిన పీఎఫ్ మొత్తంలో 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే UPI ద్వారా నగదు విత్‌డ్రాకు సంబంధించి తుది పరిమితిని EPFO ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
7/7
EPFO Updates
కాగా.. నవంబర్ 19న జరిగిన EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో పీఎఫ్ ఖాతాలో తప్పనిసరిగా ఉంచాల్సిన కనీస బ్యాలెన్స్‌ను 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించే ప్రతిపాదనకు ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అర్హత కలిగిన మొత్తంలో 90 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.