Sara Tendulkar Marriage: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఇంట్లో మరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఇప్పటికే సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహం కాగా.. త్వరలోనే ఆయన తన కుమార్తె సారా టెండూల్కర్ వివాహం కూడా చేయబోతున్నట్లు సమాచారం. తన గారాల పట్టి సారా టెండూల్కర్‌కు ఓ మంచి వరుడిని ఎంపిక చేశాడని.. త్వరలోనే వారిద్దరి వివాహం చేయడానికి పెద్దలు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సచిన్‌కు కాబోయే అల్లుడు ఎవరో తెలుసుకుందాం.
సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ తన తండ్రి వ్యాపారాలు చూసుకోవడమే కాకుండా సొంతంగా పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది. అందంలో తల్లికి పోటీగా నిలుస్తున్న సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో తన అందంతో సందడి చేస్తోంది. ఆమె పెళ్లిపై ఎప్పటి నుంచో పుకార్లు వినిపిస్తున్నాయి. మొదట్లో యువ క్రికెటర్ శుభమన్ గిల్‌తో ప్రేమ వ్యవహారం నడుస్తోందని.. సచిన్‌కు అల్లుడిగా గిల్ కాబోతున్నాడనే వార్తలు వైరల్‌గా మారాయి. ఆ తర్వాత మరికొందరి హీరోలతో అనుబంధం ఉందనే ప్రచారం జరిగింది. ఇప్పుడు సారా టెండూల్కర్ పెళ్లి చేసుకోబోతుందనే వార్త వైరల్‌గా మారింది.
ఈ పుకార్ల నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ తన కుమార్తె సారాకు వివాహం చేయాలని నిశ్చయించినట్లు చర్చ జరుగుతోంది. ప్రముఖ నటుడు సన్నీ డియోల్ కుమారుడు రాజ్‌వీర్ డియోల్‌తో వివాహం నిశ్చయించినట్లు తెలుస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ 'రెడ్డిట్' పోస్ట్‌లో దీనికి సంబంధించిన ప్రచారం జరుగుతోంది. ఇది నిజమా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఇది పుకారు మాత్రమే!
'ఈ ప్రచారంలో ఎటువంటి నిజం లేదు. టెండూల్కర్ కుటుంబం నుంచి కానీ డియోల్ కుటుంబం నుంచి కూడా ఎలాంటి ప్రకటన లేదా ధృవీకరణ లేదు' అని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తెలిపింది. ఇలాంటి ప్రచారాలకు ఎలాంటి ఆధారాలు ఉండవని.. వీటిని వాస్తవంగా నమ్మవద్దని పేర్కొంది.
మోడలింగ్‌తోపాటు వ్యాపారం
ఇక సారా టెండూల్కర్ విషయం పరిశీలిస్తే ఆమె మోడలింగ్‌తోపాటు వ్యక్తిగత వ్యాపారాలతో బిజీగా ఉంది. 2021లో అజియో లక్స్ క్యాంపెయిన్‌తో తన మోడలింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. అప్పటి నుండి ఆమె లేనిజ్, మేబెలిన్, లేక్మీ, డిజైనర్ అనితా డోంగ్రే వంటి బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ బ్రాండ్‌లతో కలిసి పనిచేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో లైఫ్‌స్టైల్, బ్రాండ్ కంటెంట్‌ను చేస్తూ ఉంటారు.