Bank Strike On December 3: అతిపెద్ద దిగ్గజ బ్యాంకు డిసెంబర్ 3న దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనుంది. యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఐడీబీఐ ఆఫీసర్స్‌తోపాటు ఆల్ ఇండియా ఐడీబీఐ ఆఫీసరస్ అసోసియేషన్ కూడా ఈ సమ్మెలో పాల్గొంటుంది. ఐడీబీఐ బ్యాంకును కెనడియన్ ఫెయిర్‌ఫ్యాక్స్‌కు విక్రయించే ప్లాన్‌కు నిరసనగా ఆ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు.
1/5
బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
ఐడీబీఐ బ్యాంక్ ఈ మేజర్ బ్యాంకును కెనడియన్ సంస్థ అయిన ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్ కంపెనీకి విక్రయించడాన్ని నిరసిస్తూ ఒక రోజు దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్రాంచీలు సమ్మెకు దిగనున్నాయి. 2026 డిసెంబర్ 3వ తేదీనా యూనైడెడ్ ఫోరమ్ ఆఫ్ ఐడీబీఐ ఆఫీసర్స్ ఎంప్లాయీస్, ఆల్ ఇండియా ఐడీబీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIIDBOA), ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ బ్యాంకు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనుంది.
2/5
బ్యాంక్ ప్రైవేటీకరణ
ఈ నెల ప్రారంభంలోనే దేశవ్యాప్తంగా రెండు రోజులపాటు సమ్మెకు ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వారు ఐడీబీఐ బ్యాంక్ ఎండీకి నోటీస్ పంపారు. ఆ తర్వాత యూఎఫ్‌ఐఓఈ ఆధ్వర్యంలో బ్యాంక్ సమ్మెకు పిలుపునిచ్చారు. ఇక ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగులు ఎల్‌ఐసీ, ప్రభుత్వాన్ని కూడా ఫెయిర్‌ఫ్యాక్స్ కంపెనీని బ్యాంకును విక్రయించాలనే ప్లాన్ వెనక్కి తీసుకోవాలని కూడా కోరాయి.
3/5
బ్యాంకు సమ్మె
ఇప్పటికే ఉద్యోగ సంఘాలు కూడా తమ డిమాండ్స్ పట్టించుకోకపోతే నిరసన మరింత ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించాయి. ఇందులో భాగంగా సమ్మెలను ఒక రోజుకు మించి కొనసాగించే అవకాశం ఉంది.
4/5
బ్యాంకు సమ్మె డిసెంబర్ 3
కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం ఐడీబీఐ బ్యాంకు విలువను కూడా ప్రశ్నించింది. బ్యాంకు పెట్టుబడుల ఉపసంహరణను స్కామ్‌గా.. ఒక విదేశీ కంపెనీకి అమ్మకం వ్యవహారంపై విచారణ జరపడానికి ఒక సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ కూడా డిమాండ్ చేస్తోంది.
5/5
ఐడీబీఐ బ్యాంక్ సమ్మె
ఒక విదేశీ సంస్థ ప్రభుత్వం నుంచి ఐడీబీఐ బ్యాంకును కొనుగోలు చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఆరోపించారు. ప్రస్తుతం, ఐడీబీఐ బ్యాంకులో కేంద్రం వాటా 45.48 శాతం , ఎల్ఐసికి 49.24 శాతం వాటా. ఐడీబీఐ బ్యాంకులోని 60.72 శాతం వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు సుమారు రూ.53 వేల కోట్లకు విక్రయించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు