Ranabaali: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా ‘రణబాలి’. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత ప్రేక్షకుల్లో ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమాలో రష్మిక పాత్ర ఎంత ముఖ్యమైనది? ఆమెను తీసుకోవడం నిజంగా అవసరమా? అనే చర్చ మొదలైంది. పెళ్లి తర్వాత విజయ్, రష్మిక కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఆమెకు ప్రాధాన్యత ఇచ్చారా? అనే సందేహాలు కూడా కొందరిలో వ్యక్తమయ్యాయి. అయితే ఈ ప్రశ్నలకు విజయ్ దేవరకొండ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.
1/5
రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్
‘రణబాలి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన విజయ్ దేవరకొండ రష్మిక గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో రష్మిక అవసరం చాలా ఉందని స్పష్టం చేశాడు. రణబాలి, రష్మిక జంట తెరపై చూపించే ప్రభావానికి ఆమె మాత్రమే న్యాయం చేయగలదని చెప్పాడు.
2/5
రణబాలి విడుదల తేదీ
రష్మిక నటిగా, వ్యక్తిగా ఎంతో ఎదిగిందని విజయ్ ప్రశంసించాడు. ఆమె ఒక రోబోలా కష్టపడుతుందని, తన కెరీర్లో సాధించిన గుర్తింపును చూసి గర్వపడుతుంటానని తెలిపాడు.
3/5
రాహుల్ సంకృత్యన్
విజయ్ మాటలను బట్టి చూస్తే ఈ సినిమాలో రష్మిక పాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉన్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే విజయ్, రష్మిక కలిసి రెండు సినిమాల్లో నటించారు. ‘రణబాలి’ వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా. దీంతో ఈ జంటను మరోసారి తెరపై చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
4/5
విజయ్ రష్మిక జంట
‘రణబాలి’ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఈ సినిమా కథ కోసం దర్శకుడు గ్రామాలకు వెళ్లి జాతరలు, పండుగలు చూశారని, జానపద కథలు విన్నారని విజయ్ వెల్లడించాడు. చరిత్రలో దాగి ఉన్న కొన్ని విషయాలు ఈ సినిమాకు స్ఫూర్తిగా నిలిచాయని తెలిపాడు. ఈ నెల 16న విజయదశమి సందర్భంగా ‘రణబాలి’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
5/5
రణబాలి మూవీ అప్డేట్
మరి విజయ్ చెప్పినట్లుగా రష్మిక పాత్ర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుంది? ఈ జంట తెరపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అనే విషయాలు తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాలి.