• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Mohan Babu: ఆ దర్శకుడు నన్ను చంపేశాడు.. చాలా ఇబ్బంది పెట్టాడు.. మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు..!

Mohan Babu: ఆ దర్శకుడు నన్ను చంపేశాడు.. చాలా ఇబ్బంది పెట్టాడు.. మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు..!

Written ByVishnu Priya
Published: Sep 27, 2026, 03:32 PM IST|Updated: Sep 27, 2026, 03:42 PM IST
joinshare

Mohan Babu: నాని నటించిన ది ప్యారడైజ్ సినిమా విజయోత్సవం సందర్భంగా మోహన్ బాబు తన షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన నుంచి మంచి నటన రాబట్టేందుకు ఎన్నో రీటేక్స్ తీసుకున్నారని చెప్పారు. తన 50 ఏళ్ల సినీ ప్రయాణంలో ఇంత కఠినమైన పాత్ర చేయలేదని, షూటింగ్ సమయంలో శ్రీకాంత్ తనను చాలా ఇబ్బంది పెట్టారని సరదాగా అన్నారు. అయితే ఈ అనుభవం తనకు తన గురువు దాసరి నారాయణరావు చెప్పిన మాటలను గుర్తు చేసిందని తెలిపారు. శ్రీకాంత్ ప్రతిభను మోహన్ బాబు ప్రత్యేకంగా ప్రశంసించారు.
 

 Mohan Babu1/6

శ్రీకాంత్ ఓదెల

నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ సినిమా ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమా విడుదలైన తర్వాత చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో పాటు చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు మోహన్ బాబు తన అనుభవాలను పంచుకున్నారు. ది ప్యారడైజ్‌లో మోహన్ బాబు షిఖంజ మాలిక్ అనే పాత్రలో కనిపించారు. ఈ పాత్ర తన కెరీర్‌లో చాలా ప్రత్యేకమైనదని ఆయన చెప్పారు. తనకు శ్రీకాంత్ ఓదెల కథ చెప్పిన విధానం మొదటి నుంచే నచ్చిందని తెలిపారు.
Mohan Babu The Paradise2/6

శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైజ్

మోహన్ బాబు మాట్లాడుతూ.. రాజా రవీంద్ర చెప్పడంతో శ్రీకాంత్ ఓదెల తనను కలవడానికి తిరుపతికి వచ్చారని చెప్పారు. అయితే కథ చెప్పడానికి వచ్చినప్పుడు, నాని అనుమతి తీసుకుని వచ్చానని శ్రీకాంత్ చెప్పడంతో తనకు కొంత ఆశ్చర్యం కలిగిందని తెలిపారు. ఆ సమయంలో తనలోని ఈగో కొద్దిగా దెబ్బతిన్నట్లు సరదాగా గుర్తు చేసుకున్నారు.
Srikanth Odela3/6

ది ప్యారడైజ్ సక్సెస్ మీట్

అయితే శ్రీకాంత్ కథ చెప్పిన విధానం తనను బాగా ఆకట్టుకుందని మోహన్ బాబు అన్నారు. కథను చాలా స్పష్టంగా వివరించాడని, అతడి ధైర్యం తనకు నచ్చిందని చెప్పారు. కానీ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత మాత్రం శ్రీకాంత్ తనను చాలా ఇబ్బంది పెట్టాడని నవ్వుతూ తెలిపారు.
Srikanth Odela The Paradise4/6

నాని సినిమా

తన 50 ఏళ్ల నట జీవితంలో ఇంత కఠినమైన పాత్రను ఇంతకు ముందు చేయలేదని మోహన్ బాబు చెప్పారు. పాత్రకు సంబంధించిన మేకప్ వేసుకున్న తర్వాత వెనక్కి తగ్గే అవకాశం లేకపోవడంతో షూటింగ్ కొనసాగించానని తెలిపారు. హీరో, నిర్మాత, మొత్తం సినిమా టీమ్ గురించి ఆలోచించి తన పాత్రను పూర్తి చేశానని చెప్పారు.
The Paradise Success Meet5/6

తెలుగు సినిమా వార్తలు

అలాగే తన కెరీర్‌లో ఎక్కువ రీటేక్స్ తీసుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెలేనని మోహన్ బాబు వెల్లడించారు. మొదట్లో రీటేక్స్ ఎక్కువగా తీసుకోవడం తనకు ఆశ్చర్యంగా అనిపించినా, తర్వాత తన గురువు దాసరి నారాయణరావు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయని తెలిపారు. ఎక్కువ టేకులు తీసుకుంటే నటుడిలోని అసలు ప్రతిభ బయటకు వస్తుందని దాసరి తనకు చెప్పేవారని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. శ్రీకాంత్ కూడా అదే విధంగా తన నుంచి మరింత మంచి నటనను తీసుకున్నాడని చెప్పారు.
 The Paradise Updates6/6

ది ప్యారడైజ్ అప్‌డేట్స్

శ్రీకాంత్ ఓదెలలో మంచి ప్రతిభ ఉందని, అతడు భవిష్యత్తులో మరింత ఎదగాలని మోహన్ బాబు ఆకాంక్షించారు. తనను ఒక సీనియర్ నటుడిగా కాకుండా ఒక ఆర్టిస్ట్‌గా మాత్రమే చూసి, పాత్రకు అవసరమైన నటనను రాబట్టేందుకు దర్శకుడు ప్రయత్నించాడని ప్రశంసించారు.
TAGS:
Telugu News
Tollywood
Telugu Movie

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.