Murali Mohan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా తన నటన, కష్టం, పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో కులాల ప్రభావం గురించి తరచూ చర్చలు జరుగుతుంటాయి. ఈ అంశంపై సీనియర్ నటుడు మురళీ మోహన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
1/5
మురళీ మోహన్ వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కులం ఆధారంగా అవకాశాలు ఇస్తారనే అభిప్రాయాలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. అయితే మురళీ మోహన్ మాత్రం సినీ పరిశ్రమలో ప్రతిభకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఒక నటుడికి ప్రేక్షకుల్లో ఆదరణ ఉంటే, అతనితో సినిమాలు చేయడానికి.. నిర్మాతలు ముందుకు వస్తారని చెప్పారు. చిరంజీవి ఎదుగుదలను ఉదాహరణగా తీసుకుంటే ఈ విషయం అర్థమవుతుందని ఆయన అభిప్రాయం. గతంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి ప్రముఖ నటులు తమకంటూ.. ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అప్పట్లో నిర్మాతలు, దర్శకుల్లోనూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు ఎక్కువగా ఉన్నారని మురళీ మోహన్ గుర్తుచేశారు.
2/5
చిరంజీవి కెరీర్
అయినప్పటికీ చిరంజీవి వంటి నటుడితో సినిమాలు చేయడానికి నిర్మాతలు వెనుకాడలేదని తెలిపారు. కేవలం కులాన్ని మాత్రమే చూసి సినిమాలు నిర్మించి ఉంటే చిరంజీవి ఈ స్థాయికి చేరుకునేవారా అనే ప్రశ్నను ఆయన ప్రస్తావించారు. ప్రేక్షకుల ఆదరణ, నటన, సినిమా విజయాలే చిరంజీవిని మెగాస్టార్ స్థాయికి తీసుకెళ్లాయని ఆయన వ్యాఖ్యల.. సారాంశం.
3/5
చిరంజీవి తాజా వార్తలు
గతంలో తెలుగు సినిమా పరిశ్రమ మద్రాస్ కేంద్రంగా పనిచేసినప్పుడు కులాల గురించి ఇంత విస్తృతంగా చర్చ జరిగేది కాదని మురళీ మోహన్ పేర్కొన్నారు. అప్పట్లో తెలుగు వారమనే భావనకు ఎక్కువ ప్రాధాన్యం ఉండేదని చెప్పారు. ఒకరి కులం ఏమిటని అడగడం కంటే, వారు తెలుగు వారనే గుర్తింపుతో కలిసిమెలిసి ఉండేవారని వివరించారు.
4/5
మెగాస్టార్ చిరంజీవి
తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్కు మారిన తర్వాత కులాల అంశం ఎక్కువగా చర్చకు రావడం ప్రారంభమైందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి రాజకీయ పరిణామాలు కూడా ఒక కారణమని పేర్కొన్నారు. సినిమా అనేది భాషలు, ప్రాంతాల హద్దులను దాటి ప్రేక్షకులను ఆకట్టుకునే కళ. మంచి కథ, నటీనటుల ప్రతిభ, దర్శకుడి పనితనం సినిమాకు విజయాన్ని అందిస్తాయి. అందుకే కులం కంటే ప్రతిభకే ప్రాధాన్యం ఇవ్వాలని మురళీ మోహన్ అభిప్రాయపడ్డారు.
5/5
చిరంజీవి ఎదుగుదల
సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్రకుమార్తో జరిగిన సంభాషణలో ఆయన ఈ విషయాలను వెల్లడించినట్లు కథనంలో పేర్కొన్నారు. ప్రస్తుతం చిరంజీవి బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న కాకా సినిమాలో నటిస్తున్నారు. వాల్తేరు వీరయ్య తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.