Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్‌కు సినిమాలతో పాటు తన మంచి మనసుతో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఆయన ఆతిథ్యం గురించి సినీ పరిశ్రమలో చాలామంది గొప్పగా చెబుతుంటారు. తనతో కలిసి పనిచేసే నటీనటులకు రుచికరమైన వంటకాలు పంపిస్తూ వారిని సంతోషపెట్టడం ప్రభాస్‌కు అలవాటు. ఇప్పుడు మరోసారి తన ప్రత్యేకమైన ఆతిథ్యంతో వార్తల్లో నిలిచారు డార్లింగ్. ఈసారి ఆయన ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వికి బర్త్‌డే సందర్భంగా అదిరిపోయే విందు పంపించారు.
1/5
ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి
ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఫౌజీ’. ఈ సినిమాతో సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఇమాన్వి హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా ఆమె నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది.
2/5
ఫౌజీ సినిమా
అక్టోబర్ 13న ఇమాన్వి తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ‘ఫౌజీ’ చిత్ర బృందం ఆమెకు ప్రత్యేక పోస్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. అయితే ప్రభాస్ మాత్రం ఆమెకు మరింత ప్రత్యేకమైన బహుమతి ఇచ్చారు. రకరకాల వంటకాలతో కూడిన భారీ విందును ఆమెకు పంపించి సర్ప్రైజ్ చేశారు.
3/5
ప్రభాస్ బర్త్‌డే ట్రీట్
ప్రభాస్ పంపించిన వంటకాల ఫొటోలు, వీడియోలను ఇమాన్వి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ టేబుల్‌పై ఎన్నో రకాల నాన్‌వెజ్ వంటకాలు, స్వీట్లు కనిపించాయి. ఒకే టేబుల్‌పై ఇన్ని రకాల వంటకాలు ఉండటంతో ఈ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
4/5
ఇమాన్వి
తన కోసం ప్రభాస్ ఇంత ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడంతో ఇమాన్వి ఎంతో సంతోషించారు. ఈ సందర్భంగా ప్రభాస్‌కు కృతజ్ఞతలు చెబుతూ తన మనసు, కడుపు రెండూ నిండిపోయాయని అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టారు. విందును చూసి ఆశ్చర్యపోతూ, సంతోషంగా ఉన్న ఆమె ఫొటోలు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ప్రభాస్ తన సహనటీనటులపై చూపించే ప్రేమ, అభిమానాన్ని చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
5/5
ప్రభాస్
ప్రభాస్ తనతో పనిచేసే వారికి మంచి భోజనం పెట్టడంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. గతంలో కూడా పలువురు నటీనటులు ఆయన ఆతిథ్యం గురించి పలు సందర్భాల్లో మాట్లాడారు. శ్రద్ధా దాస్, పూజా హెగ్డే, కృతి సనన్, దీపిక పదుకొణె వంటి తారలతో పాటు పలువురు ప్రముఖులు కూడా ప్రభాస్ ఇచ్చే విందుల గురించి ప్రస్తావించారు. ప్రభాస్ ఇంటికి వెళ్తే రకరకాల వంటకాలతో కడుపు నిండిపోతుందని చాలామంది సరదాగా చెబుతుంటారు. ఇప్పుడు ఇమాన్వికి ఇచ్చిన బర్త్‌డే ట్రీట్‌తో మరోసారి ఆయన ఆతిథ్యం వార్తల్లో నిలిచింది.