Sai Pallavi on ZEE5 OTT: జీ తెలుగు పాపులర్ సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి’ రెండో సీజన్ ఈ నెల 16న ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్ త్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. ఈ ఫస్ట్ ఎపిసోడ్లో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి అతిథిగా హాజరుకానున్నారు. దానికి సహజసిద్ధమైన నటనతో, ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో, అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. అంతేకాదు ‘రామాయణం’ వంటి పౌరాణిక ప్యాన్ ఇండియా సినిమా తర్వాత ఆమె తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చిన టాక్ షో ఇదే కావడం గమనార్హం.
మనసులో మాట నిక్కచ్చిగా..
మనసులోని మాటలను ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా బయటకు తెలిజయేసే సంభాషణలు, వ్యక్తిగత విషయాలు.. వారి జ్ఞాపకాలు, ఆసక్తికరమైన విషయాలు, వినోదభరితమైన అంశాలతో ఈ కొత్త సీజన్ ప్రేక్షకులను అలరించబోతుంది.
ప్రముఖ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షో.. సిల్వర్ స్క్రీన్ తారల వ్యక్తిగత జీవితాల్లోని ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. తెలుగు ఎంటర్టైన్మెంట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తొలి సీజన్లో అక్కినేని నాగార్జున, శ్రీలీల వంటి ప్రముఖులు అతిథులుగా పాల్గొని, తమ వ్యక్తిగత జీవిత విశేషాలు, సినీ ప్రయాణం, అనుబంధాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇవి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకిస్తున్నాయి. హోస్ట్ జగపతిబాబు, సెలబ్రిటీల మధ్య జరిగే సహజమైన సంభాషణలే ఈ షోకు మెయిన్ అట్రాక్షన్. తమ జీవితాలను మలుపు తిప్పిన అనుభవాలు, ఇప్పటివరకు పెద్దగా బయటకు రాని జ్ఞాపకాలు, తమ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు, మరచిపోలేని సంఘటనల గురించి సెలబ్రిటీలు మనసు విప్పి మాట్లాడే అవకాశం ఈ షో లో ప్రేక్షకులకు థ్రిల్ల్ కలిగించే అంశమనే చెప్పాలి. ఇప్పుడు రెండో సీజన్ కూడా అంతే ప్రత్యేకతతో రాబోతుంది.
ఆసక్తికరమైన విషయమేమంటే.. జయమ్ము నిశ్చయమ్మురా కొత్త సీజన్ సాయి పల్లవితో స్టార్ట్ కాబోతుంది. ముఖ్యంగా ‘సీత’ పాత్రతో ప్రేక్షకుల్లో ఆమెపై అభిమానం మరింత పెరిగిందనే చెప్పాలి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘రామాయణ’ చిత్రంలో సీతగా సాయి పల్లవికి ఈ పాత్ర ఎలా ఛాన్స్ దక్కింది. సినిమా టైటిల్‌ను ప్రకటించిన తర్వాత సాయి పల్లవి పాల్గొంటున్న తొలి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇదేనని నిర్వాహకులు చెబుతున్నారు. సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో నిరాడంబరంగా ఉండే సాయి పల్లవి.. మనసులోని మాటలను ఉన్నది ఉన్నట్టుగా పంచుకునే విధానం సాయి పల్లవిని సమకాలీన భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రత్యేకంగా నిలబెట్టింది.
ఈ సీజన్ తొలి ఎపిసోడ్లో సాయి పల్లవి, జగపతిబాబుతో కలిసి తన సినీ ప్రయాణంతో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకోనున్నారు. అంతేకాదు సాయి పల్లవి వ్యక్తిత్వం, ఆలోచనలు, జీవితంలో ఎదురైన అనుభవాల గురించి తెలుసుకునే అవకాశం ఈ ఎపిసోడ్ ద్వారా ప్రేక్షకులకు లభించబోతుంది.
అక్టోబర్ 16 నుంచి స్ట్రీమింగ్..
‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి’ రెండో సీజన్ అక్టోబర్ 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే అక్టోబర్ 18, ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు జీ తెలుగులో టెలివిజన్ ప్రసారం కానుంది. తొలి ఎపిసోడ్లో సాయి పల్లవి సందడి చేయనుండటంతో ఈ సీజన్‌పై ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ అయింది.